Contact

Text

Thursday, 3 July 2014

రేపిస్టుల నుంచి తప్పించుకుని, దూకి చనిపోయిన యువతి

లైంగిక అత్యాచారానికి గురైన ఒక గిరిజన యువతి రేపిస్టులనుంచి తప్పించుకునేందుకు నగ్నంగానే పరుగులు తీసి, చివరికి 70 అడుగుల ఎత్తైన టవర్ నుంచి దూకి ప్రాణాలువదిలేసింది.

గుండెల్ని పిండేసే ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో జరిగింది. సంఘటన సోమవారం జరిగినా ఇప్పటి వరకూ పోలీసులు ఎవర్నీ అరెస్టు చేయలేదు. ఆ గిరిజన యువతి ఉద్యోగం కోసం ఇండోర్ నగరానికి వెళ్తూండగా ఈ సంఘటన జరిగింది. ఆమె సొంతూరు డిండోరీ.
 
02:29 - By Unknown 0

వీడియోతో బ్లాక్ మెయిల్

  • నటి నయనా కృష్ణపై మరో బాధితుడి కేసు  
  •  వైద్యుడి ఫిర్యాదుతో వెలుగులోకి వస్తున్న బాధితులు
  •  దర్యాప్తు చేస్తున్న సీసీబీ
  •  12 రోజులుగా నటి కోసం గాలింపు

బెంగళూరు: లైంగిక క్రీడలో ఉన్న సమయంలో వీడియో తీసి..  వాటితో బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ కన్నడ నటి నయనా కృష్ణపై తాజాగా మరో బాధితుడు స్థానిక విల్సన్ గార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీ సులు తెలిపిన సమాచారం మేరకు.. నగరంలో నివాసముంటున్న కృష్ణప్ప 2010లో లైంగిక క్రీడలో ఉన్న సమయంలో నటి నయనా కృష్ణ, ఆమె స్నేహితులు వీడియో తీశారు. అనంతరం ఆ క్లిప్పింగులు చూపి నటి నయనా బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. భారీగా డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు విల్సన్ గార్డెన్ పోలీసులకు శనివారం రాత్రి ఫిర్యాదు చేశాడు.
 
వైద్యుడి ధైర్యంతో ముందుకొస్తున్న బాధితులు
చాళుక్య సర్కిల్‌లో ఉన్న ఒక వైద్యుడు కొన్ని రోజుల క్రితం లైంగిక క్రీడలో ఉన్న సమయంలో నటి నయనా కృష్ణ, ఆమె స్నేహితులు మేఘనా, రిహానా తదితరులు వీడియో తీశారు. తర్వాత వీరితో పాటు కానిస్టేబుల్ మల్లేష్, ప్రైవేటు టీవీ చానెల్‌లో పని చేస్తున్న హేమంత్ కుమార్, సునీల్, జిమ్ సెంటర్ నిర్వహకుడు రఘు ఆ క్లిప్పింగ్‌లు చూపి వైద్యుడ్ని బ్లాక్ మెయిల్ చేశారు. రూ. లక్షను వసూలు చేసి.. మరో రూ. 15 లక్షలను సిద్ధం చేసుకోవాలని డిమాండ్ చేసి వెళ్లిపోయారు. దీంతో ఆ వైద్యుడు రెండు వారాల క్రితం సీసీబీ పోలీసులను ఆశ్రయించాడు. 12 రోజుల క్రితం నగదు తీసుకోడానికి ఆ వైద్యుడి వద్దకు వచ్చిన హేమంత్ కుమార్, సునీల్‌ను ఆ పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి మిగి లిన నిందితుల కోసం గాలిస్తున్నారు.  
 
నటి నయనా కృష్ణ కోసం గాలిస్తున్నాం.. : పోలీసులు
నటి నయనా కృష్ణ  కోసం తాము 12 రోజులుగా గాలిస్తున్నామని సీసీబీ పోలీసులు తెలిపారు. నగర పోలీసు అధికారులు ఆదేశాల మేరకు తామీ కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.  ఈ కేసు విషయమై వారు బుధవారం మాట్లాడుతూ.. ‘ నటి నయనా కృష్ణ ఇలా చాలా మందిని బ్లాక్‌మెయిల్ చేస్తోంది. బెదిరించి లక్షలాది రూపాయలను వసూలు చేస్తోంది.

అయితే పరువు పోతుందని, సినీ రంగానికి చెందిన ఆమెకు ప్రముఖులతో పరిచయాలు ఉండటంతో ఆమెపై ఫిర్యాదుకు ఎవరూ ముందుకు రాలేకపోయారు. అయితే రెండు వారాల క్రితం వైద్యుడు ధైర్యంగా ముందుకు వచ్చి..   ఫిర్యాదు చేశాడు. దీంతో మేం మొట్టమొదటి సారిగా ఆమెపై కేసు నమోదైంది. దీంతో అప్పటి నుంచి మేం ఆమె, ఆమె స్నేహితుల కోసం గాలిస్తున్నాం. ఈ విషయం తెలుసుకొని తాజా మరో బాధితుడు ముందుకు రావడం విశేషం. త్వరలోనే ఆమెను అరెస్ట్ చేస్తాం ’ అని ధీమా వ్యక్తం చేశారు.
02:23 - By Unknown 0

Wednesday, 2 July 2014

15 రోజులకు 170 కోట్లు తీసుకున్న పవన్ కళ్యాణ్



టాలీవుడ్ టాప్ హీరో పవన్ కళ్యాణ్ కి ఒక అలవాటు వుంది తను నటించిన ఎ సినిమా కి ప్రచారం చేయరు సినిమా పుర్తయ్యంత వరకే ఆయన భాద్యతగా తీసుకుంటారు. ఆ తర్వాత సినిమా హిట్ అయిన,ప్లాప్ అయిన పట్టించుకోరు. అలాగే అభిమానులను నా సినిమా చూడండి, సినిమా లో అది బాగుంది, ఇది బాగుంది అని అభిమానులను ఎ రోజు అడగని హీరో. అలాంటి హీరో ఈ మధ్య రాష్ట్ర ఎన్నికలలో 15 రోజులకు 170 కోట్లు తీసుకుని ప్రచారం నిర్వహించిన  పవన్ కళ్యాణ్ ప్రజలకు అన్యాయం చేస్తే ప్రశ్నిస్తా అంటూ ఒక ప్రభంజనం శ్రుష్టించారు, కానీ తన సినిమా ప్రమోషన్ కి వెళ్ళని పవన్ ఎన్నికలలో ప్రచారం నిర్వహించడం వరకే తన భాద్యత అందుకు తనకు ముట్టవలిసిన సొమ్ము ముట్టడంతో ప్రజలకు న్యాయం జరిగిన ,జరగకపోయినా తనకు సంబంధం లేదంటూ ఇంకో అమ్మాయి  కోసం వేటలో వున్నట్లు టాలీవుడ్ టాక్. సినిమాలలో నటించి డబ్బులు తీసుకొని అభిమానులను మెప్పించే పవన్ ఇలా ప్రజల ముందు కూడా బాగానే నటించాడు, కానీ సామాన్య ప్రజలు పవన్ ని క్షమిస్తార. అయిన గుండు కొట్టించిన పార్టీ దగ్గరికి వెళ్లి బాగానే నటించాడు.... మరి అదే మరి డబ్బంటే.. అయిన డబ్బుల కోసం నాటకాలు ఆడే వీళ్ళకు ప్రజల కష్టాలు ఎం తెలుస్తాయి.....

...........................మీ కామెంట్స్, సూచనలు మరియు సలహాలు పోస్ట్ చేయండి ................................
                                                    నిరంతరం ప్రజల పక్షం 
21:23 - By Unknown 4

Sunday, 29 June 2014

మార్నింగ్ వాక్ కు వెళ్తే.. సామూహిక అత్యాచారం


చెల్లెలితో కలిసి మార్నింగ్ వాక్ కు వెళ్లిన యువతిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది. మలియానా గ్రామానికి చెందిన యువతి (26) మార్నింగ్ వాక్ కు వెళ్లినప్పుడు కొంతమంది యువకులు ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దాంతో వెంటనే ఆమె చెల్లి ఇంటివైపు పరిగెత్తి, ఎవరినైనా సాయం పిలవాలని ప్రయత్నించింది.

కానీ, వాళ్లు తిరిగి వచ్చేసరికి అక్కడకు కొంచెం దూరంలో ఉన్న పొలాల్లో ఆమె స్పృహ కోల్పోయి కనిపించింది. యశ్ పాల్, రాజ్ పాల్, రాజేంద్ర అనే ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరో ఇద్దరిని ఇంకా గుర్తించాల్సి ఉంది. నిందితులు ఐదుగురిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు మొదలుపెట్టినట్లు పోలీసులు తెలిపారు.
21:43 - By Unknown 1

Monday, 23 June 2014

బాబుకు వచ్చింది 57 మార్కులే: జగన్


హైదరాబాద్: చంద్రబాబు నాయుడు కంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మెరుగైన పాలన అందించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్‌వో) రేటు రేటు ప్రకారం బాబు హయాంకన్నా వైఎస్ఆర్ పాలన మెరుగని తేల్చిందని తెలిపారు. బాబు పాలనకు 57 మార్కులు వస్తే, వైఎస్ఆర్ హయాంలో 82 మార్కులొచ్చాయని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చలో జగన్ పాల్గొన్నారు. ప్రతిపక్ష నేతగా సుదీర్ఘంగా ప్రసంగించారు. హామీల అమలు కోసం ప్రజలు ఆశగా ప్రభుత్వంవైపు చూస్తున్నారని చెప్పారు. ప్రజలకు మంచి చేస్తే తమ సహాయ సహకాలుంటాయని స్పష్టం చేశారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని నేరవేర్చాలని జగన్ డిమాండ్  చేశారు.
04:57 - By Unknown 0

జగన్ ప్రసంగానికి 17సార్లు ఆటంకం!


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్పీకర్ కోడెల శివప్రసాద్ కనీస మర్యాద పాటించకుండా వ్యవహరించారని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సభా సంప్రదాయలకు విరుద్దంగా ఆయన వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ వాయిదా వేసిన తరువాత వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, డేవిడ్‌రాజు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాచమల్లు ప్రసాదరెడ్డి మాట్లాడారు.

ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగా కనీసం మర్యాద ఇవ్వకుండా, ఆయనను సంప్రదించకుండా సభను వాయిదావేయడం సభా సంప్రదాయాలకు విరుద్ధం అన్నారు. సభను వాయిదా వేసిన తీరు బాధాకరం అన్నారు. జగన్మోహన రెడ్డి ప్రసంగానికి టీడీపీ సభ్యులు పదేపదే అడ్డుతగిలారని చెప్పారు. జగన్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు 17 సార్లు ఆటంకపరిచారన్నారు. సభలో రేపు జగన్ ప్రసంగాన్ని కొనసాగనివ్వాలని డిమాండ్ చేశారు. స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.

అసెంబ్లీ వాయిదా వేయడమనేది వారు ఆలోచించుకోవాలన్నారు. అసెంబ్లీలో అధికారపక్షం తీరు సరిగా లేదని చెప్పారు. ఎదురుదాడే ఎజెండాగా సభను నడిపించారన్నారు. స్పీకర్ వ్యవహారశైలి సరిగ్గాలేదని విమర్శించారు.
04:55 - By Unknown 0

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

    Popular Posts

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top