Contact

Text

Sunday, 29 June 2014

మార్నింగ్ వాక్ కు వెళ్తే.. సామూహిక అత్యాచారం


చెల్లెలితో కలిసి మార్నింగ్ వాక్ కు వెళ్లిన యువతిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది. మలియానా గ్రామానికి చెందిన యువతి (26) మార్నింగ్ వాక్ కు వెళ్లినప్పుడు కొంతమంది యువకులు ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దాంతో వెంటనే ఆమె చెల్లి ఇంటివైపు పరిగెత్తి, ఎవరినైనా సాయం పిలవాలని ప్రయత్నించింది.

కానీ, వాళ్లు తిరిగి వచ్చేసరికి అక్కడకు కొంచెం దూరంలో ఉన్న పొలాల్లో ఆమె స్పృహ కోల్పోయి కనిపించింది. యశ్ పాల్, రాజ్ పాల్, రాజేంద్ర అనే ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరో ఇద్దరిని ఇంకా గుర్తించాల్సి ఉంది. నిందితులు ఐదుగురిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు మొదలుపెట్టినట్లు పోలీసులు తెలిపారు.
21:43 - By Unknown 1

1 comments:

Monday, 23 June 2014

బాబుకు వచ్చింది 57 మార్కులే: జగన్


హైదరాబాద్: చంద్రబాబు నాయుడు కంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మెరుగైన పాలన అందించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్‌వో) రేటు రేటు ప్రకారం బాబు హయాంకన్నా వైఎస్ఆర్ పాలన మెరుగని తేల్చిందని తెలిపారు. బాబు పాలనకు 57 మార్కులు వస్తే, వైఎస్ఆర్ హయాంలో 82 మార్కులొచ్చాయని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చలో జగన్ పాల్గొన్నారు. ప్రతిపక్ష నేతగా సుదీర్ఘంగా ప్రసంగించారు. హామీల అమలు కోసం ప్రజలు ఆశగా ప్రభుత్వంవైపు చూస్తున్నారని చెప్పారు. ప్రజలకు మంచి చేస్తే తమ సహాయ సహకాలుంటాయని స్పష్టం చేశారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని నేరవేర్చాలని జగన్ డిమాండ్  చేశారు.
04:57 - By Unknown 0

0 comments:

జగన్ ప్రసంగానికి 17సార్లు ఆటంకం!


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్పీకర్ కోడెల శివప్రసాద్ కనీస మర్యాద పాటించకుండా వ్యవహరించారని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సభా సంప్రదాయలకు విరుద్దంగా ఆయన వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ వాయిదా వేసిన తరువాత వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, డేవిడ్‌రాజు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాచమల్లు ప్రసాదరెడ్డి మాట్లాడారు.

ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగా కనీసం మర్యాద ఇవ్వకుండా, ఆయనను సంప్రదించకుండా సభను వాయిదావేయడం సభా సంప్రదాయాలకు విరుద్ధం అన్నారు. సభను వాయిదా వేసిన తీరు బాధాకరం అన్నారు. జగన్మోహన రెడ్డి ప్రసంగానికి టీడీపీ సభ్యులు పదేపదే అడ్డుతగిలారని చెప్పారు. జగన్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు 17 సార్లు ఆటంకపరిచారన్నారు. సభలో రేపు జగన్ ప్రసంగాన్ని కొనసాగనివ్వాలని డిమాండ్ చేశారు. స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.

అసెంబ్లీ వాయిదా వేయడమనేది వారు ఆలోచించుకోవాలన్నారు. అసెంబ్లీలో అధికారపక్షం తీరు సరిగా లేదని చెప్పారు. ఎదురుదాడే ఎజెండాగా సభను నడిపించారన్నారు. స్పీకర్ వ్యవహారశైలి సరిగ్గాలేదని విమర్శించారు.
04:55 - By Unknown 0

0 comments:

Saturday, 21 June 2014

ఇది మా ప్రభుత్వం..మా మాటే వినాలి!

  • మండల పరిషత్  కార్యాలయంలో టీడీపీ నేతల హల్‌చల్
  • గ్రామ కో-ఆర్డినేటర్లను తొలగించాలని రగడ
  • ఎంసీతో వాగ్వాదం

ఆదోని రూరల్: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు హల్‌చల్ చేశారు. ఇది మా ప్రభుత్వం.. మా మాట వినకపోతే అంతే సంగతి అంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. శనివారం స్మార్ట్‌కార్డు మండల కో-ఆర్డినేటర్ నరసింహారెడ్డితో టీడీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ నాయకులు పదేళ్ల పాటు అధికారంలో ఉండి అన్ని పనులు చేయించుకున్నారని, ప్రస్తుతం తమకు అధికారం వచ్చినా మా పనులు చేయకపోతే ఎలా అంటూ మండిపడ్డారు.

గ్రామంలో సర్పంచ్‌కు తెలియకుండానే ఫినో కంపెనీ యాజమాన్యం గ్రామ కో-ఆర్డినేటర్‌ను ఎలా ఎంపిక చేస్తారంటూ బైచిగేరి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ధనుసింగ్ ప్రశ్నించారు. గ్రామ కో-ఆర్డినేటర్ల ఎంపికలో తన ప్రమేయం లేదని ఎంసీ సమాధానం ఇచ్చినప్పటికీ శాంతించకుండా చిందులేశారు.

కపటి గ్రామంలో కూడా నిబంధనలుకు విరుద్ధంగా కో-ఆర్డినేటర్లను ఎంపిక చేశారని ఆ గ్రామ నాయకుడు మాధవతో పాటు మరికొంతమంది అధికారులపై విరుచుకుపడ్డారు. నెట్టేకల్, దిబ్బనకల్, గోనబావి గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు ఈరన్న, లక్ష్మన్న, వలమన్న తదితరులు గ్రామ కో-ఆర్డినేటర్లను తొలగించాలని ఎంసీకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎంసీ నర్సింహారెడ్డి ఈ విషయాన్ని జిల్లా కో-ఆర్డినేటర్‌తో ఫోన్‌లో వివరిస్తుండగా అడ్డు తగిలిన దేశం నేతలు ప్రస్తుతం ఎంపికైన వారందరినీ తొలగించాలని డిమాండ్ చేశారు.

నాయకులు డిస్ట్రిక్ కో-ఆర్డినేటర్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ అవసరమైతే గ్రామ పంచాయతీ కార్యదర్శులతో పింఛన్లు పంచాలని, కొత్తగా ఎన్నికైన వారితో పంపిణీ చేయించేది లేదని ఖరాకండీగా తేల్చి చెప్పారు. దాదాపు గంటపాటు ఎంపీడీఓ సలీంబాష సమక్షంలోనే టీడీపీ నాయకులు, మండల కో-ఆర్డినేటర్ల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. అరుపులు, కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఈ విషయాన్ని జిల్లా కో-ఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్తానని ఎంసీ నర్సింహారెడ్డి విలేకరులకు చెప్పారు.
22:43 - By Unknown 0

0 comments:

Friday, 20 June 2014

బాబు వచ్చె.. జాబు పోయె!.


సీన్ రివర్స్
 
గృహ నిర్మాణ శాఖలో 158 మందికి ఉద్వాసన!
నెలాఖరులోగా ఇంటికి పంపాలని ఆదేశాలు
ఆందోళనలో ఉద్యోగులు

 
 

అనంతపురం : జాబు రావాలంటే బాబు రావాలి.. ఇంటికో ఉద్యోగం చంద్రబాబుతోనే సాధ్యం.. ఇలా సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగు తమ్ముళ్లు ఉపన్యాసాలు, గోడ రాతలతో ఊదరగొట్టారు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే సీన్ రివర్స్ అవుతోంది. వివిధ శాఖల్లో తాత్కాలిక, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇంటికి పంపే పనిలో పడ్డారు. ఇప్పటికే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకంలో దాదాపు 850 మంది ఔట్ సోర్సింగ్ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాలని నిర్ణయించిన చంద్రబాబు.. తాజాగా గృహ నిర్మాణ శాఖపై దృష్టి సారించారు. ఆ శాఖలో ఔట్ సోర్సింగ్ కింద జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న 30 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు (ఎఈలు), 99 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లు, 22 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, ఏడుగురు కార్యాలయ సిబ్బందిని మొత్తంగా 158 మందిని ఇంటికి పంపటానికి రంగం సిద్ధం చేశారు. జూన్ 30 కల్లా వారిని తొలగించాంటూ గృహ నిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్‌కు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. అయితే ఖాళీ అయ్యే ఈ పోస్టులను అలాగే ఖాళీగా ఉంచుతారా? లేక కొత్త వారిని నియమిస్తారా? అనే విషయంపై ప్రభుత్వం వద్ద కానీ, అధికారుల వద్ద కానీ స్పష్టత లేదు.

ఇంటి నిర్మాణాలు పూర్తవుతాయా?

 వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు గృహ నిర్మాణ శాఖకు ప్రాధాన్యత లేదు. స్థానిక నియోజకవర్గాలకు  
 కొద్దిపాటి ఇళ్లు మాత్రమే మంజూరు చేసేవారు. కేంద్ర, రాష్ట్రాలు మంజూరు చేసే గృహాలు ఏడాదికి వెయ్యి ఇళ్లకు మించేవి కావు. అయితే 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రాన్ని పూరిగుడిసెల్లేని రాష్ట్రంగా చూడాలని భావించారు. ఇందులో భాగంగా ఇందిరమ్మ పథకం కింద మూడు విడతల్లో ప్రతి నియోజకవర్గానికి వేలాది ఇళ్లు మంజూరు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే మూడు విడతల్లో అనంతపురం జిల్లాకు ఇందిరమ్మ పథకం కింద దాదాపు 4,61,471 ఇళ్లు మంజూరు చేశారు. ఒక్కసారిగా గృహ నిర్మాణ శాఖకు ప్రాధాన్యత పెరగడంతో ఉద్యోగులకు పనిభారం కూడా ఎక్కువైంది. ఈ క్రమంలో నామమాత్రంగా ఉన్న శాశ్వత ఉద్యోగులకు తోడు ఔట్‌సోర్సింగ్ కింద అర్హతలను బట్టి ఉద్యోగులను నియమించారు. రాజశేఖర్‌రెడ్డి నిర్ణయంతో గూడులేని నిరుపేదలకు సొంత గూడు దొరకడమే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి దొరికినట్లైంది. ఈ క్రమంలో సిబ్బంది ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించారు.


 జిల్లాలో మొత్తం 4,61,471 గృహాలు మంజూరు కాగా ఇప్పటి వరకు 2,86,107 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇక 2,24,335 ఇళ్లు వివిధ దశల్లో ఉండగా, 61,772 ఇంటి నిర్మాణాలు అసలు ప్రారంభమే కాలేదు. ఈ పరిస్థితుల్లో గృహ నిర్మాణ శాఖలో కీలక పాత్ర పోషించే ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తొలగించడానికి రంగం సిద్ధం చేయడంతో అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ నిర్మాణాల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పెరిగిన సిమెంటు ధరలు, సమయానికి రాని బిల్లులతో నిర్మాణాలు పూర్తి చేసుకోలేని లబ్ధిదారులు ఇప్పుడు సిబ్బంది పర్యవేక్షణ తగ్గిపోతే ఇంటి నిర్మాణాలు ఎలా పూర్తి చేసుకుంటారో అర్థం కాని పరిస్థితి. 158 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ఇంటికి పంపిన పక్షంలో ఆ శాఖలో శాశ్వత ప్రాతిపదికన పనిచేసే సిబ్బంది నామమాత్రంగానే ఉన్నారు. వర్క్‌ఇన్‌స్పెక్టర్లు 24 మంది, ఏఈలు 31, సీనియర్ అసిస్టెంట్లు నలుగురు, జూనియర్ అసిస్టెంట్లు ముగ్గురు, అసిస్టెంట్ మేనేజర్లు ముగ్గురు, ఒక మేనేజర్ మాత్రమే ఉంటారు. పూర్తి స్థాయిలో సిబ్బంది ఉన్న రోజుల్లోనే జిల్లాలో నత్తనడకన సాగిన ఇళ్ల నిర్మాణాలు ఇప్పుడు ఏమేరకు పూర్తవుతాయన్నది ప్రశ్నార్థకమే. నెలాఖరుకు ఇంటి దారి పట్టించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని తెలుసుకున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనలో పడ్డారు.  

 ఔట్‌సోర్సింగ్ సిబ్బందిలో టెన్షన్

 ఒక్కోశాఖలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని చంద్రబాబు నాయుడు తొలగిస్తూ పోతుండడంతో ఇతర శాఖల్లో ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళనకు గురౌతున్నారు. ఎప్పుడు తమ శాఖపై బాబు కన్నుపడుతుందో.. తమ ఉద్యోగాలకు ఎప్పుడు ఉద్వాసన పలుకుతారో తెలియక వారు టెన్షన్‌కు గురౌతున్నారు. ఈ విషయమై గృహ నిర్మాణ శాఖ పీడీ ప్రసాద్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని, పరిశీలిస్తున్నామని తెలిపారు.
 
22:03 - By Unknown 0

0 comments:

మేము ఎప్పటికీ ప్రతిపక్షంలోనే...


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తడబడ్డారు. తాము ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉంటామన్న ఆయన ఆ తర్వాత తన పొరపాటును సరిదిద్దుకున్నారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం చోటు చేసుకుంది. స్పీకర్ గా కోడెల శివప్రసాదరావు ఎన్నిక అయిన సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ సభలో కేవలం రెండు పార్టీలు మాత్రమే ఉన్నాయని, ఒకటి అధికార పార్టీ, మరొకటి ప్రతిపక్షం అన్నారు.
అయితే మూడో పార్టీ బీజేపీ కూడా ఉందని కోడెల ఈ సందర్భంగా గుర్తు చేశారు. దానిపై జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ అయితే టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉందని, వారు ఇటువైపు వచ్చే వరకు పాలకపక్షంగానే పరిగణిస్తామని జగన్ అనడంతో సభలో నవ్వులు విరిశాయి.

దీనిపై యనమల స్పందిస్తూ ఎప్పటికీ తాము పాలకపక్షంలోనే ఉంటామని అనబోయి.. ప్రతిపక్షంలోనే ఉంటామని అన్నారు. ఆ తర్వాత వెంటనే తన పొరపాటును సద్దుకున్నారు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ 1999 సంవత్సరంలో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు శాశ్వతంగా ప్రతిపక్షంలోనే ఉంటారని టీడీపీ నేతలు అన్నారని, అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. అధికారం అన్నది దేవుడు ఇస్తారని, ప్రజలు నిర్ణయిస్తారని జగన్ వ్యాఖ్యానించారు.
05:53 - By Unknown 0

0 comments:

సమంత వి పట్టుకున్న హీరో

సమంత నటిస్తున్న తమిళ చిత్రం “అంజాన్” సినిమా బృందం ఇటీవల విడుదల చేసిన కొన్ని పోస్టర్ లలో ఒక పిక్ కాంట్రవర్సీకి దగ్గరగా వుంది. బీచ్ లో తడిబట్టలతో సమంత సేదతీరుతుంటే సూర్య ఆమె పాదాలని పట్టుకుంటాడు. మహేష్ వెనుక పాకినందుకే అంత రచ్చచేస్తే, ఇప్పుడు ఏకంగా ఈ అమ్మడి పాదాలను పట్టుకున్నందుకు ఆ పోస్టర్ ని ఏమనాలా అని సోషల్ నెట్వర్కింగ్ సైట్ లలో మహేష్ ఫాన్స్ కౌంటర్స్  వేస్తున్నారు.. పాపం సమంత.. అప్పుడు అనవసరంగా నోరు పారేసుకున్నందుకు ఇప్పుడు చింతిస్తూ వుంటుంది
04:19 - By Unknown 0

0 comments:

సమంత బొడ్డు అందాలు హైలైట్ చేస్తున్న సూర్య

నాగ చైతన్య నటించిన  ‘ఆటో నగర్ సూర్య’ చిత్రం ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడుదల ఆలస్యం అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో విడుదల చేద్దామని పలు సందర్భాల్లో నిర్మాతలు ప్రయత్నాలు చేసినప్పటికీ వివిధ రకాల ఇబ్బందులు, కోర్టు సమస్యలతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ‘ఆటో నగర్ సూర్య’ విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ చిత్రాన్ని జూన్ 27న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవా కట్ట దర్శకత్వం వహిస్తున్నారు. నాగ చైతన్య సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ మీడియా కి  విడుదల చేసారు. ఈ ఫోటోలు చూస్తుంటే సినిమాలో దర్శకుడు సమంత బొడ్డు అందాలపై బాగా ఫోకస్ చేసినట్లు స్పష్టమవుతోంది. ‘ఆటో నగర్ సూర్య’ చిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ స్లైడ్ షోల, సమంత బొడ్డు అందాలూ ఈ చిత్రానికి ఎంత వరకు దోహద చేస్తావో చూడాలి.
04:17 - By Unknown 0

0 comments:

Thursday, 19 June 2014

రైతులను బిచ్చగాళ్ళుగా చూస్తున్న చంద్రబాబు


                                    

రుణమాఫి పేరు చెప్పి అధికారం లోకి వచ్చిన చంద్రబాబు రుణమాఫి కి కేంద్రం, రిజర్వు బ్యాంకు ఒప్పుకోవట్లేదు
అంటూ కొత్త నాటకాలు మొదలు పెట్టారు .10 సంవత్సరాలు తనని ప్రతిపక్షంలో కూర్చోపెట్టిన రైతులను ఆడుకొని తర్వాత ఎంతో కొంత మాఫీ చేస్తే వాళ్లే పడి ఉంటారని బాబు ఆలోచన. 9 ఏళ్ళు అధికారం లో వున్నప్పుడు రైతులను , మహిళలను బానిసలు కంటే హీనంగా చుసిన బాబు అన్ని కులాల పేర్లు , నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చారు. ఇప్పుడు ఆ కమిటీ ఈ కమిటి అంటూ కాలయాపన చేస్తూ ప్రజల జీవితాలతో  చలగాటం ఆడుతున్నాడు. ఇంటికో ఉద్యగం లేదు , రైతు స్తిరీకరణ నిధి లేదు,  రైతులకు  9 గంటల  నిరంతర  విద్యుత్  లేదు , బి సి  లకు ప్రత్యెక హోదా లేదు, బలిజలను  ఇంకా  బిసి జాబితాలో  చేర్చలేదు ,  బ్రహ్మినుల కోసం  ప్రత్యెక కమిటీ లేదు, విద్యార్దుల  ఫీజు  రాయతి  కి  సంబంధించి  హామీ  లేదు, చేనేత  కార్మికులకు  సహాయం  లేదు, గర్భిని స్త్రీలకు 3వ నెల నుండి ప్రసవం అయ్యేంత వరకు ప్రభుత్వ సహాయము లేదు, ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయ కుండ ఏమి చేస్తున్నారు. డబ్బులు తీసుకొని ఓటేశం ఇక మనకు సంభందం లేదు అనుకుంటున్నారేమో.    
23:53 - By Unknown 0

0 comments:

చంద్రబాబు ఆడుకుంటున్న నేతలు


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అడ్డం తగిలింది చంద్రబాబేనంటూ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి నినదించింది. కాంగ్రెస్‌ పార్టీ వంతపాడింది. తద్వారా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో నానా కష్టాలూ పడింది గడచిన ఐదేళ్ళలో. ఇప్పుడు విభజన జరిగిపోయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కూడా. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చేసినా, టీడీపీ అధినేత చంద్రబాబుని ఇరకాటంలో పెట్టేయడం మానలేదు. ‘విభజనతో కరెంటు కష్టాలు వస్తాయి..’ అని చంద్రబాబు, మాజీ సీఎం కిరణ్‌, దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి.. ఇలా సీమాంధ్ర నేతలు చాలామంది చెప్పారు. ఆ కష్టాలే ఇప్పుడు తెలంగాణను వెంటాడుతున్నాయి. కరెంటు కష్టాల నుంచి తెలంగాణకు వెసులుబాటు కల్పిస్తూ, ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ‘అదెలా కుదురుతుంది.. ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయమెలా చేస్తారు..’ అని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున చంద్రబాబు ప్రశ్నిస్తే, ‘చంద్రబాబు తెలంగాణ ప్రజల్ని చీకట్లోకి నెట్టేయడానికి చూస్తున్నారు..’ అంటూ కొత్త ప్రచారానికి తెరలేపింది తెలంగాణ రాష్ట్ర సమితి. ‘తెలంగాణకు కరెంటు కష్టాలు తప్పవు.. అయితే అది కొద్ది కాలమే.. సిద్ధంగా వుండాలి..’ అని ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి వాస్తవాల్ని తెలంగాణ ప్రజల ముందుంచింది.. ఆ పార్టీ చిత్తశుద్ధిని నమ్మి, తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించారు. ఇప్పుడేమో ఆ కష్టాలకి కారణం చంద్రబాబేనంటూ టీఆర్‌ఎస్‌ ప్రచారానికి తెరలేపేసరికి, తెలంగాణ టీడీపీ నేతలు షాక్‌కి గురవుతున్నారు. ‘ఈ మాట మేం గతంలోనే చెప్పాం.. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అయ్యే కరెంట్‌ని లాక్కోవాలనుకోవడం ఎలా సమంజసం.?’ అని ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారు తెలంగాణ టీడీపీ నేతలు. అలాగని చంద్రబాబునీ వారు నిలదీసే పరిస్థితి లేదు.  1956కి ముందున్న తెలంగాణ కావాలి.. అని గతంలో టీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. ఆ లెక్కన భద్రాచలం, అశ్వారావుపేట, మునగాల డివిజన్లను ఆంధ్రప్రదేశ్‌కి వదిలేయాల్సి వుంది. కానీ విభజన ప్రక్రియలో అలా జరగలేదు. పోలవరం ప్రాజెక్టు కోసం 7 ముంపు మండలాల్ని ఆంధ్రప్రదేశ్‌లో కలపడంపైనా టీఆర్‌ఎస్‌ రాద్ధాంతం చేస్తోంది. ‘అప్పుడు అలా అన్నారు కదా..’ అని టీఆర్‌ఎస్‌ని నిలదీసే పరిస్థితి లేదు. ఇక్కడా టీడీపీనే ఇరకాటంలో పడిపోతోంది. మొత్తంగా చూస్తే, విభజనకి ముందూ, విభజనకి తర్వాత తెలంగాణలో చంద్రబాబు అడ్డంగా బుక్కయిపోతున్నారు. అప్పుడూ ఇప్పుడూ చంద్రబాబుని తెలంగాణ ద్రోహిగానే చూపించే ప్రయత్నమైతే జరుగుతోన్న విషయం స్పష్టం కన్పిస్తోంది. కానీ, చంద్రబాబు ఏమీ చేయలేని దయనీయ స్థితిలో వున్నారు. కారణం ఆయన  జపిస్తున్న రెండు కళ్ళ సిద్ధాంతమే. 
22:54 - By Unknown 0

0 comments:

నగదుతో ఉడాయించిన కొత్త పెళ్లి కూతురు


తిరువళ్లూరు : పెళ్లయి నెల రోజులు కాకముందే భర్త ఇంటి నుంచి బంగారు నగలు, నగదుతో ఉడాయించింది ఓ నవవధువు. ఆ సంఘటన తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలో చోటు చేసుకుంది. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్ ప్రాంతానికి చెందిన కళ అనే యువతి చేపల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తుంది. ఆమె నాలుగు నెలల క్రితం రైలులో చెన్నై నుంచి తిరువళ్లూరు వస్తుండగా, అదే రైలులో ప్రయాణిస్తున్న కళతో కవి అనే యువతి పరిచయం చేసుకుంది. తన స్వస్థలం సేలం అని కళకు కవి వెల్లడించింది. తాను బీఎస్పీ చదువుకున్నట్లు తెలిపింది. తన తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోయారని, దాంతో తాను అనాథగా మిగిలిపోయానని ఈ నేపథ్యంలో తనకు ఆశ్రయం కల్పించాలని కళను ఆ యువతి కోరింది. దాంతో ఆ యువతికి కళ తన ఇంట్లో ఆశ్రయం కల్పించింది.

ఆ క్రమంలో మనవాలనగర్ ప్రాంతంలో మినీలారీ డ్రైవర్ గా పని చేస్తున్న రాజశేఖర్ కుమారుడు వినోద్ కు కళతో ఎంతో కాలంగా పరిచయం ఉంది. అయితే తాను పెళ్లి చేసుకోవానుకుంటున్నట్లు... ఎవరైన మంచి అమ్మాయి ఉంటే చెప్పాలని కళను వినోద్ కోరారు. దాంతో తన ఇంట్లో ఆశ్రయం పొందుతున్న కవి మంచి అమ్మాయి అని ఆమెను పెళ్లి చేసుకుంటే అన్ని విధాల బాగుంటుందని వినోద్ కు కళ సూచించింది. దీంతో ఇరువురికి వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. దాంతో గత నెల 5వ తేదీన  వినోద్ కుమార్, కవిలకు పెళ్లి చేశారు. అయితే ఈ నెల 16న రాత్రి కరెంట్ పోవడంతో ఇంట్లో వారంత బయట నిద్రిస్తున్నారు. దీనినే అదునుగా భావించి కవి బీరువాలోని
రూ.15 వేల నగదు, బంగారు నగలతో ఉడాయించింది. భార్య కవి కోసం భర్త వినోద్ కుమార్, అతడి బంధువులు తీవ్రంగా గాలించారు. అయిన ఫలితం లేకపోవడంతో బుధవారం రాత్రి వినోద్ కుమార్ తల్లి కమల మనవాలనగర్ పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
22:45 - By Unknown 0

0 comments:

ఆ బాధ నాకు తెలుసు: వైఎస్ జగన్


హైదరాబాద్: నందిగామ శాసనసభ్యుడు తంగిరాల ప్రభాకరరావు ఆకస్మిక మరణం దురదృష్టకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తంగిరాల, శోభానాగిరెడ్డి మృతికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... తంగిరాల గురించి తనకు పెద్దగా తెలియనప్పటికీ వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన దళిత నాయకుడు కాబట్టి ఆయన గురించి వేరే చెప్పక్కర్లేదన్నారు.

కుటుంబ పెద్దను కోల్పోతే ఆ బాధ ఎలావుంటుందో తనకు తెలుసునని జగన్ అన్నారు. తంగిరాల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. తంగిరాల ప్రభాకరరావు సేవలను పలువురు నేతలు కొనియాడారు. కోడెల శివప్రసాదరావు, ప్రత్తిపాటి పుల్లారావు, గొల్లపాటి సూర్యారావు, ఉప్పులేటి కల్పన, రావెల కిశోర్, బొండా ఉమామహేశ్వరరావు తదితరులు సభలో మాట్లాడారు.
09:40 - By Unknown 0

0 comments:

'నా అవసరం చంద్రబాబుకు చాలా ఉంది '

హైదరాబాద్ : నా అవసరం అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుకు ఉందని, అలాగే ఆయన అవసరం తనకు ఉన్నాయంటూ అనంతపురం లోక్ సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే తామిద్దరం ఎన్నికల మందు కలిశామని తెలిపారు. అనంతపురం జిల్లాలో తనను కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ పని చేయలేరని చెప్పారు. పరిటాల సునీత పౌరసరఫరాల శాఖ మంత్రి అయిన జిల్లాలో తన మాటే నెగ్గుతుందని ఆయన స్ఫష్టం చేశారు. టీడీపీలో చేరినప్పుడు, ఎన్నికల సందర్బంగా జరిగిన ప్రచారంలో మాత్రమే పచ్చకండువా కప్పుకున్నానని ఆయన అన్నారు.
 

ఇప్పటికి తనకు పచ్చ చొక్క ఒక్కటి కూడా లేదని తెలిపారు. గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైయ్యారు. అనంతరం అసెంబ్లీ లాబీలో జేసీ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ,  ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శకం ముగిసిందని అన్నారు. రాజీవ్, సోనియాల కుమార్తె ప్రియాంక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహారించిన ఫలితం మాత్రం శూన్యమని జేసీ వ్యాఖ్యానించారు.  
04:02 - By Unknown 0

0 comments:

పవన్ పై అనుచిత వ్యాఖ్యలు, కేసీఆర్ కు నోటీసులు

అనంతపురం : సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనంతపురం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. మురళీ కృష్ణ అనే న్యాయవాది గురువారం ఈ పిటిషన్ దాఖలు చేశారు.  పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 30న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
03:59 - By Unknown 0

0 comments:

బాలీవుడ్ నటిని రెండు గంటలపాటు ...

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి రిచా చద్దాను ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతాధికారులు, ఆధికారులు నిలిపివేసి ప్రశ్నించారు. రిచా చద్దా బ్యాగ్ లో ఉన్న వస్తువుపై అనుమానం తలెత్తడంతో అధికారులు సోదా చేశారు. రిచా చద్దా చర్మ సౌందర్యానికి ఉపయోగించే వస్తువులలో ఓ పౌడర్ పై అధికారులకు అనుమానం కలిగింది.
 

చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుచుకునేందుకు గత ఆరు నెలలుగా సాంప్రదాయ పద్దతిలో ఆయుర్వేద పౌడర్ ఉపయోగిస్తున్నట్టు రిచా చద్దా అధికారులకు వెల్లడించారు. ఆయుర్వేద పౌడర్ చెప్పినా అధికారులకు నమ్మకం కలగపోవడంతో తనను రెండు గంటలపాటు ప్రశ్నించారని రిచా చద్దా మీడియాకు వెల్లడించారు. 
 
ఆయుర్వేద వస్తువులపై నాకు నమ్మకం చాలా ఎక్కవ. ముంబైకి ఆయుర్వేద వస్తువులు తీసుకెళ్లడం అలవాటు. ఈసారి మాత్రమే సమస్యగా మారింది అని రిచా చద్దా అన్నారు. తన వెంట ఉన్న ఆయుర్వేద వస్తువులను ఓపెన్ చేసి భద్రతాధికారులు తనిఖీ చేయడం ఇష్టం లేదని.. వాటిని నిలువ చేయడం చాలా కష్టపనైనందున తాను తొలుత నిరాకరించానని.. రెండు గంటలపాటు అధికారులను ఒప్పించడానికి శ్రమించినా.. ఉపయోగం లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో తనిఖీలకు అంగీకరించానని రిచా చద్దా అన్నారు. 'గ్యాంగ్ ఆఫ్ వాస్సేపూర్', 'ఓయే లక్కి! లక్కి ఓయే' అనే చిత్రాల్లో రిచా చద్దా నటించింది. 
03:57 - By Unknown 0

0 comments:

Wednesday, 18 June 2014

జగన్మోహన రెడ్డిలో ఒక అపరిచితుడు

జగన్మోహన రెడ్డిలో ఒక అపరిచితుడు


తాను జైలులో ఉన్న జగన్‌ను కలుసుకున్నప్పుడు వేదాంతం చెప్పాడని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన దాడి వీరభద్ర రావు చెప్పారు. బుధవారం దాడి మీడియాతో మాట్లాడుతూ తాను జైలులో జగన్ కలుసుకున్నప్పుడు యువ రక్తం, మారాడని భావించానని చెప్పారు. కానీ బెయిల్‌పై బయటకు వచ్చిన జగన్మోహన రెడ్డిలో ఒక అపరిచితుడు కనిపించాడన్నారు.
1989 ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమెవ్వరని నాటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీఆర్ అంగీకరించారని దాడి గుర్తు చేసుకున్నారు. క్షణికావేశంలో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. ఈనాడు ఆయన నాయకత్వాన్ని బల పర్చడం మరో నేరమవుతుందని అన్నారు.
జగన్ నమ్ముకున్న వారిని నట్టేట ముంచాడన్నారు. పార్టీని నడపాలంటే పార్టీ నేతలు, కార్యకర్తల పట్ల అధినేతకు విశ్వాసం, నమ్మకం ఉండాలన్నారు. కొంత మంది పార్టీ ఫిరాయిస్తున్నారన్నవార్తలతో పార్టీ నాయకత్వం ఆందోళనకు గురైందన్నారు. విశ్వసనీయత తనకు ఉన్నదని తనకు ఉందని తాను చెప్పారే గానీ గానీ, ఆయన అన్న మాటపై ఏనాడూ నిలకడగా నిలబడలేదన్నారు. ఒక్కో నేతకు ఒక్కో విధంగా చెప్పడం సర్వ సాధారణమైందన్నారు.
22:54 - By Unknown 0

0 comments:

జగన్ మళ్లీ జైలుకు?


జగన్ మోహన్ రెడ్డిని అక్రమాస్తుల కేసు మళ్లీ వెంటాడుతోంది. ఈ కేసుపై విచారణను జూలై 21 నుంచి ప్రారంభించబోతున్నట్లు సీబీఐ కోర్టు వెల్లడించడంతో జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైకాపాలో నిరాశ అలముకున్నట్లు తెలుస్తోంది. కాగా సీబీఐ జగన్ మోహన్ రెడ్డిపై ఇప్పటికే 10 అభియోగ పత్రాలను దాఖలు చేసింది. వీటిలో అరబిందో, హెటిరో కేసులను జూలై 21 నుంచి ప్రారంభించబోతున్నట్లు స్పష్టీకరించింది.
ఈ కేసుల తర్వాత మెల్లమెల్లగా మిగిలిన కేసులపై విచారణ కూడా ఉంటుందనే సంకేతాలు వెలువరించింది. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి తెదేపా ఒత్తిడి తీసుకువచ్చే అవకాశాలున్నాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ఒకవేళ కేసు విచారణ సమయంలో జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ జైలుకు తీసుకెళతారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి
22:46 - By Unknown 1

1 comments:

హిట్లర్ ని మించిన నియంత చంద్రబాబు


తెలుగు దేశం పార్టీ లో బడా కాంట్రాక్టర్స్ కి , పెట్టుబడి దారులకి మాత్రమే పెద్ద పీట వేస్తున్నారని, హిట్లర్ ని మించిన నియంతల బాబు వ్యవహరిస్తున్నారని తెలంగాణా పోలిట్ బ్యూరో సభ్యుడు ప్రభాకర్ ఆరోపించారు .
ఆయన బుధవారం తెలంగాణా భవన్ లో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ కొత్త్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అందరి సహాయ సహకారాలతో రాష్ట్ర అభివ్రిద్దికి కృషి చేయాలనీ , కెసిఆర్ నాయకత్వాన్ని బలపరచాలని పిలుపినిచ్చారు . ప్రతిపక్ష పార్టీ లో సలహాలు అందించాలని అంటే విమర్శలతో కాలం వృధా చేయడం మంచిది కాదని సూచించారు .
22:27 - By Unknown 0

0 comments:

మసాజ్‌కు వెళ్తే.. హెచ్‌ఐవీ వచ్చింది

బెంగళూరు : మసాజ్ కేంద్రానికి వెళ్లిన యువకులను రెచ్చగొట్టి.. యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారని, అలా వెళ్లిన తనకు హెచ్‌ఐవీ సోకిందని బాధితుడు నగర పోలీస్ కమిషనర్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.  స్పందించిన పోలీసులు ఆ కేంద్రాన్ని సీజ్ చేసి.. ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీసులు మంగళవారం తెలిపిన వివరాలు మేరకు.. పాత ఎయిర్ పోర్టు రోడ్డులోని దొమ్మలూరులో ఉస్మాన్ అనే వ్యక్తి ఓ మసాజ్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్, ముంబాయి, ఢిల్లీకి చెందిన యువతులతో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు.  
 

 యువతుల అర్ధనగ్న ఫొటోలతో ఇంటర్నెట్‌లో ప్రచారం చేశాడు. మసాజ్ కేంద్రానికి వెళ్లిన యువకులను రెచ్చగొట్టి యువతులతో వ్యభిచారం చేయించసాగాడు. విటులను ఆకర్షించడానికి ముగ్గురు పింప్‌లను పెట్టాడు. ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి (29) కొద్ది రోజుల క్రితం ఆ మసాజ్ కేంద్రానికి వెళ్లాడు. అక్కడ ఒక యువతికి రూ. 25 వేలు చెల్లించి లైంగిక కోర్కెలు తీర్చుకున్నాడు. ఇటీవల పదేపదే జ్వరం వస్తుండటంతో ఈనెల 11న ఆస్పత్రికి వెళ్లిన అతనికి హెచ్‌ఐవీ సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆ బాధితుడు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. మసాజ్ కేంద్రం ముసుగులో వ్యభిచారం చేయిస్తూ యువకుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఆ కేంద్ర నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
 
 దీంతో కమిషనర్ ఆదేశాల మేరకు సీసీబీ పోలీసులు సోమవారం రాత్రి ఆ కేంద్రంపై దాడి చేశారు. ముగ్గురు పింప్‌లను అరెస్టు చేశారు.  హైదరాబాద్, ఢిల్లీ, ముంబాయికి చెందిన నలుగురు యువతులను రక్షించారు. పరారీలో ఉన్న ఉస్మాన్ కోసం గాలిస్తున్నట్లు  సీసీబీ పోలీసులు మంగళవారం తెలిపారు.
 
21:53 - By Unknown 0

0 comments:

టీవీ9 రవిప్రకాశ్‌పై కేసు నమోదు



*పోలీసులకు రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశం

రంగారెడ్డి జిల్లా కోర్టులు: తెలంగాణ ప్రజాప్రతినిధులను కించ పరిచే విధంగా కార్యక్రమాలను ప్రసారం చేసిన టీవీ-9 యజమాని రవిప్రకాశ్‌పై కేసు నమోదు చేయాలని సైబరాబాద్ 2వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బుధవారం ఎల్‌బీనగర్ పోలీసులను ఆదేశించారు.

ఈ నెల 12న రాత్రి 8.30 గంటల సమయంలో ‘బుల్లెట్ న్యూస్’ పేరిట ప్రసారం చేసిన కార్యక్రమంలో తెలంగాణ ప్రజాప్రతినిధులను కించపరిచారంటూ స్థానిక న్యాయవాది సుంకరి జనార్దన్‌గౌడ్ బుధవారం సైబరాబాద్ 2వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. దీంతో సెక్షన్- 504, 506 భారతీయ శిక్ష్మాస్మృతి, 4ఏ, 6 కేబుల్ అండ్ నెట్‌వర్క్ యాక్ట్ ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది
21:39 - By Unknown 0

0 comments:

Tuesday, 17 June 2014

అంతమాత్రాన చంద్రబాబు స్మగ్లర్ అవుతారా?'


విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను రాజకీయ ప్రత్యర్థులుగా కాకుండా శత్రువులుగా భావించి టీడీపీ అణగదొక్కాలని చూస్తోందని చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. గంగాధర నెల్లూరుకు చెందిన పార్టీ కార్యకర్త విజయానందరెడ్డిపై రాజకీయ కోణంలోనే స్మగ్లర్ అని కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. రాజమండ్రి జైలులో ఉన్న విజయానందరెడ్డిని పరామర్శించటం తన బాధ్యతగా  అనుకున్నానన్నారు. అయితే దీనిపై కొన్ని ఛానల్స్ రకరకాల క్లిప్సింగ్స్ వేస్తూ ఆరోపణలు చేయటం సరికాదన్నారు.

తానెప్పుడూ ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించలేదని చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్పష్టం చేశారు. అసలైన నేరస్తులను శిక్షస్తే తాను సమర్థిస్తానని ఆయన అన్నారు. కడపలో పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన ఇద్దరికి చంద్రబాబు నాయుడు బీఫారమ్ ఇచ్చింది వాస్తవం కాదా అని చెవిరెడ్డి ప్రశ్నించారు. అంతమాత్రాన చంద్రబాబు స్మగ్లర్ అవుతారా అని ఆయన అన్నారు.
 
10:01 - By Unknown 0

0 comments:

అతనితో సంబంధాలు అంటగట్టడం బాధేసింది: తమన్నా

ముంబై: బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ సంబంధాలను అంటగట్టడం చాలా బాధేసిందని సినీ నటి తమన్నా భాటియా అన్నారు. సాజిద్ నాకు సోదరుడిలాంటి వాడని తమన్నా తెలిపింది. దక్షిణాదిలో అగ్రతారగా వెలుగొందిన తమన్నా.. అజయ్ దేవగణ్ సరసన 'హిమ్మత్ వాలా' చిత్రంలో నటించింది. సాజిద్, తమన్నాల సంబందాలపై బాలీవుడ్ లో ప్రచారం జోరందుకుంది. 
 
సాజిద్ నా సోదరుడు. నేను రాఖీ కూడా కట్టాను. రూమర్లు చాలా వినిపిస్తున్నాయి. ఓ యాక్టర్ ను డైరెక్టర్ నమ్మితే.. సంబంధాలను అంటగడుతారా? అంటూ తమన్నా ఓ ఇంటర్వ్యూలో విచారం వ్యక్తం చేశారు. సైఫ్ ఆలీ ఖాన్, రితేష్ దేశ్ ముఖ్, రామ్ కపూర్, బిపాసా బసు, ఇషా గుప్తాలతో కలిసి 'హమ్ షకల్స్' చిత్రంలో నటించింది. 
 
తమన్నా పాత్రతో పోల్చితే తన పాత్రకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదనే ఆరోపణపై బిపాసా బసు ఈ చిత్రం ప్రచారానికి దూరంగా ఉండటంపై మరో రూమర్ కూడా మీడియాలో ప్రచారం జరుగుతోంది. బిపాసా ప్రచారంలో పాల్గొనకపోవడానికి కారణం తనకు తెలియదని తమన్నా వెల్లడించింది. హాస్య చిత్రాలను రూపొందించడంలో దిట్ట సాజిద్ పై పొగడ్తలని తమన్నా గుమ్మరించింది. 
09:59 - By Unknown 0

0 comments:

యువ జంటలే టార్గెట్

ర్నూలు : నల్లమల అభయారణ్యంలో నకిలీ పోలీసులు హల్‌చల్ సృష్టిస్తున్నారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ చేస్తున్న మఫ్టీలో ఉన్న పోలీసుల్లా యాత్రికులను బెదిరించి దారిదోపిడీకి పాల్పడుతున్నారు. ప్రేమికుల ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ నగదు, బంగారు ఆభరణాలను దోచుకుంటున్నారు. పోలీసుల పేరిట సాగుతున్న ఈ దందాతో బాధితులు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో మిన్నకుండిపోతున్నారు. ఒకరిద్దరు మాత్రం మీడియా, పత్రికా ప్రతినిధులకు ఫోన్ చేసి తమ గోడు వినిపిస్తున్నారు. అయితే ఫిర్యాదు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు.
 

యువ జంటలే టార్గెట్
ఆదివారం అనంతపురం నుంచి ఓ కుటుంబం శ్రీశైలం వెళ్లేందుకు కారులో వచ్చింది. ఆత్మకూరు చేరుకున్న ఆ కుటుంబం సాయంత్రం 5 గంటలకు వైఎస్సార్ స్మృతివనం చేరుకున్నారు. నకిలీ పోలీసులు వీరు ప్రయాణిస్తున్న కారును ఆపి లెసైన్స్, ఆర్‌సీ పుస్తకం అడిగారు.  లెసైన్స్, ఆర్‌సీ చూపినా.. రకరకాల ప్రశ్నలు వేసి తమ నుంచి రూ. 7 వేలు వసూలు చేసినట్లు ఆ కుటుంబ యజమాని వాపోయారు. నకిలీ పోలీసుల ఆగడాలను భరించలేక ఒకసారి వచ్చిన వారు తిరిగి ఈ ప్రాంతంలో పర్యటించేందుకు ఆసకి చూపడంలేదు. 

శ్రీశైలం, మహానంది క్షేత్రాల దర్శనార్థం రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో అధికశాతం ఆత్మకూరు సమీపంలోని వైఎస్సార్ స్మృతివనాన్ని సందర్శిస్తున్నారు. రోజూ వందలాది మంది వస్తుండటంతో కొందరు యువకులు పోలీసులమని చెప్పి  పథకం ప్రకారం దారిదోపిడీ చేస్తున్నారు. 15 నుంచి 20 మంది యువకులు మూడు గ్రూపులుగా ఈ దందా కొనసాగిస్తున్నారు. నల్లమల మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసుల నిఘా ఉంటుంది. ఎక్కువ మంది మఫ్టీలోనే తిరుగుతుంటారు.

పోలీసుల కదలికలను గమనించిన కొందరు యువకులు మఫ్టీలో ఉన్న పోలీసుల మాదిరి వారి హావభావాలతో తిరుగుతూ హంగామా చేస్తున్నారు. వారం క్రితం హైదరాబాద్ నుంచి కొత్తగా వివాహం చేసుకున్న జంట వైఎస్సార్ స్మృతివనం చూసేందుకు వచ్చారు. గమనించిన నకిలీ పోలీసులు వారిని వెంబడించారు. వీరు సరదాగా గడిపిన దృశ్యాలను ఫొటోలు, వీడియో తీశారు. ఆ తర్వాత వాటిని చూపి బెదిరించే ప్రయత్నం చేశారు.

అయినప్పటికీ దారికి రాకపోవడంతో వీడియోలు యూటూబ్‌లో పెడతామని బెదిరించారు. దీంతో చేసేది లేక వారి వద్దనున్న బంగారు ఆభరణాలను తీసిచ్చి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఆ జంట హైదరాబాద్ నుంచి సాక్షి ప్రతినిధికి ఫోన్ చేసి తమ గోడు వినిపించారు. గతంలోనూ ఓ కళాశాలకు చెందిన కొందరు నల్లమల అందాలు చూసేందుకు వచ్చారు. వారి ఫొటోలను తీసి అల్లరి చేశారు. దీంతో వారు చేసేది లేక వారి వద్దనున్న సెల్‌పోన్లను, నగదు ఇచ్చేసి ప్రాణాలతో బయటపడ్డారు. ఇలా ఒకటి కాదు.. అనేకం నల్లమల ప్రాంతంలో చోటు చేసుకోవడం సర్వసాధారణంగా మారింది.
 
అసాంఘిక కార్యకలాపాలకు నిలయం
నల్లమల అటవీ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. యాత్రికులుగా వస్తున్న యువతీ యువకులు కొందరు ఈ ప్రాంతంలో మద్యం సేవిస్తూ జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నారు. వీరిని చూసి నిజమైన యాత్రికులు, భక్తులు ఇటువైపు వచ్చేందుకు జంకుతున్నారు. వన్యప్రాణుల వేట సాగిస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. జింకలు, అడవి పందులను వేటాడి ఇక్కడే వంట చేసుకుని విందు చేసుకుంటున్నట్లు స్థానికులు వాపోతున్నారు.
09:58 - By Unknown 0

0 comments:

ఫేస్ బుక్ స్నేహంతో సామూహిక అత్యాచారం!

బెంగళూరు :  పీయూసీ విద్యార్థినిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. బ్యాటరాయణపుర పోలీసులు కథనం ప్రకారం నగరంలో ప్రముఖ ప్రైవేటు కాలేజీలో పీయూసీ చదువుతున్న ఓ యువతికి (18) అభిషేక్ అనే వ్యక్తి 10 నెలల క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు. రెండుసార్లు వ్యక్తిగతంగా కూడా వారు కలుసుకున్నారు.

ఆదివారం సాయంత్రం జాలి రైడ్ పేరుతో అభిషేక్, అతని స్నేహితుడు రాజు బలవంతంగా ఆ యువతిని కారులో తీసుకెళ్లారు. నగర శివార్లలోని తలఘట్టపుర సమీపంలోని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి వారిద్దరూ అత్యాచారం చేశారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. బ్యాటరాయణపుర సమీపంలోని నిర్జన ప్రదేశంలో సోమవారం ఉదయం ఆ యువతిని వదలిపెట్టి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బ్యాటరాయణపుర పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
09:54 - By Unknown 0

0 comments:

Monday, 16 June 2014

ప్రభాస్ నే ఎందుకు ఎంచుకున్నారు ?


మన సామాజిక కులం కి చెందిన హీరో ని పెట్టడం వలన రేపు మనవాడే అన్ పాపులర్ అవుతాడు . అందుకే వేరే సామాజిక కులానికి చెందిన ప్రభాస్ నే ఇందులో దింపి ప్రచారం చేస్తే ఒక దెబ్బకు రెండు పిట్టలని ఒక కులం వేసిన ఎత్తుగడ అని చిన్న పిల్లలకు కూడా అర్ధం అవుతుంది . ఇప్పుడు హిట్ చిత్రాలు చేస్తునా ప్రభాస్ ని నిలువరించడానికి రాజకీయంగా వై ఎస్ ర్ పార్టీని దేబ్బతెయడానికి, వేరే కులం హీరో పెద్ద హీరో అవకుండా అడ్డుకోవడం కోసం ఒక వర్గం చేసిన ప్రచారం ఇది .. ఆ మధ్య చిరు, ఇప్పుడు చిరు ఫ్యామిలీ మొదటి స్థానం లో వుండడం తో ప్రభాస్ కూడా పెద్ద హీరో అవ్వడం వలన తమ వర్గం హీరోల ఉనికి కోసం ప్రభాస్ ని టార్గెట్ చేసారు .. అంటే ఒక దెబ్బకు రెండు పిట్టలు .... 
23:20 - By Unknown 1

1 comments:

రుణమాఫీపై చంద్రబాబుకు రిజర్వ్ బ్యాంక్ షాక్


హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ షాక్ ఇచ్చింది. రుణమాఫీకి తాము అనుకూలం కాదని తేల్చి చెప్పింది. రుణమాఫీ అమలు బ్యాంకర్ల ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీస్తుందని... రుణాలు సక్రమంగా చెల్లించేవారికి మాఫీ అంశం అన్యాయం చేయడమే అవుతుందని పేర్కొంది. రుణమాఫీని నగదు రూపంలో చెల్లిస్తేనే అంగీకరిస్తామని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీలను ఆమోదించేది లేదని తెలిపింది.

రుణమాఫీ వంటి పథకాన్ని తాము ప్రోత్సహించలేమని ఖరాఖండీగా చెప్పేసింది. ఆ మేరకు  ఆర్ బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపాలి పంత్ జోషి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు.  రుణమాఫీ వంటి విధానం... తిరిగి చెల్లించే సంస్కృతిని నాశనం చేస్తుందని.. దీనివల్ల బ్యాంకుల పరిస్థితి దిగజారుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. రుణమాఫీకి తాము అనుకూలంగా దీపాలి పంత్ జోషి ఈనెల 11న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. కాగా ఆర్ బీఐ లేఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 25న ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్ బీఐని రుణమాఫీ అంశంపై సడలింపులు కోరే అవకాశం ఉంది.

రుణమాఫీ అమలు చేస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు ఈ వార్త అశనిపాతమనే చెప్పవచ్చు. కాగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక అందించిన వెంటనే రైతుల రుణ మాఫీకి చర్యలు తీసుకుంటామని  చంద్రబాబునాయుడు పేర్కొన్న విషయం తెలిసిందే. కమిటీ ఈ నెల 22లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వనుంది. ఆ తరువాత 45 రోజుల్లో తుది నివేదిక వచ్చాక కేంద్రంతో మాట్లాడి మాఫీకి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు రిజర్వ్ బ్యాంక్ షరతులు షాక్ ఇచ్చాయనే చెప్పుకోవచ్చు.
22:14 - By Unknown 0

0 comments:

వాచ్ మెన్ పై నటి తారా చౌదరి ఫిర్యాదు


హైదరాబాద్: నటి తారా చౌదరి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. సెక్స్ రాకెట్ కేసులో ఒకప్పుడు రాష్ట్రంలో హాట్ టాఫిక్ గా మారిన ఆమె తాజాగా వాచ్ మెన్ వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. సోమవారం రాత్రి హఠాత్తుగా ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షం అయ్యింది. తన పట్ల వాచ్ మెన్ సుబ్రహ్మణ్యం అసభ్యంగా ప్రవర్తించి, దాడికి యత్నించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనికి తాము నివాసం ఉండే అపార్ట్ మెంట్ ఎదురుగా ఉండే కిరాణ దుకాణం యజమాని కూడా సహకరిస్తున్నాడని తారా చౌదరి తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గుంటూరు జిల్లాకు చెందిన  రావెళ్ల రాజేశ్వరి.. అలియాస్ తారా చౌదరి గతంలో తనను వేధిస్తున్నారని, ప్రాణభయం ఉందంటూ అప్పటి ఎంపీ రాయపాటి సాంబశివరావుపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు తనకు సినిమా అవకాశాలు ఇస్తానని రచయిత చిన్నికృష్ణ మోసం చేశారంటూ ఆత్మహత్యాయత్నం చేసి కలకలం సృషించింది. ఆ తర్వాత తన తమ్ముడిని కొందరు కిడ్నాప్ చేశారంటూ ఆమె గుంటూరు జిల్లా వినుకొండ పోలీసులకు ఫిర్యాదు చేసి మీడియా కెక్కింది.
22:13 - By Unknown 0

0 comments:

Sunday, 15 June 2014

వైఎస్ఆర్ వల్లే రాజకీయాల్లోకొచ్చా..తెలంగాణ ఉప ముఖ్యమంత్రి


హైదరాబాద్ : తనను దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయాల్లోకి తీసుకొచ్చారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖమంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. ఆయన మరణాన్ని ఇప్పటికీ తాను జీర్ణించుకోలేక పోతున్నానని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో మంత్రి రాజయ్యను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి ప్రవేశించాక రెండుసార్లు ఓడిపోయినా...వైఎస్ పిలిచి టికెట్ ఇస్తే 11వేల ఓట్లతో విజయం సాధించినట్లు వివరించారు. అయితే గెలిచిన కొంత కాలానికే వైఎస్ మరణించారని, ఆయన లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి వస్తే వైద్యశాఖ మంత్రి పదవి ఇస్తానని వైఎస్ చెప్పారని ఈ సందర్భంగా రాజయ్య గుర్తు చేసుకున్నారు. పశువుల కాపరి నుంచి చిన్న పిల్లల వైద్యుడిగా ఆపై ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగిన తనకు ఇప్పుడు పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత మరింత పెరిగిందని అన్నారు.
20:51 - By Unknown 0

0 comments:

గుండెపోటుతో ఎమ్మెల్యే హఠాన్మరణం

గుండెపోటుతో ఆస్పత్రిలో కన్నుమూత
 

నందిగామ: కృష్ణాజిల్లా నందిగామ టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు (64) ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. రాత్రి 11.30 గంటల సమయంలో ఆయనకు గుండెపోటు రాగా కుటుంబసభ్యులు వెంటనే స్థానిక మదర్‌థెరిస్సా ఆస్పత్రికి  తరలించారు. అరుుతే 12 సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. టీడీపీ ప్రారంభం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న ప్రభాకర్ 2009లో తొలిసారిగా నందిగామ ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కంచికచర్ల మండలం పరిటాలకు చెందిన ఆయన న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అంతకుముందు వీరులపాడు జెడ్పీటీసీగా, ఎంపీపీగా పనిచేశారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య దాదాపు ఎనిమిదేళ్ల క్రితమే చనిపోయారు. ఆదివారం ఉదయమే ఆయన మంత్రి దేవినేని ఉమామహేశ్వరావుతో కలసి పులిచింతల ప్రాజెక్టును సందర్శించారు
20:48 - By Unknown 0

0 comments:

మాజీ ప్రియుడిపై కేసు పెట్టిన ప్రీతి జింతా


ముంబాయి : బాలీవుట్ నటి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓనర్ ప్రీతి జింతా తన మాజీ ప్రియుడు, వ్యాపారవేత్త నెస్ వాడియాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మే 30న వాంఖేడ్ స్టేడియంలో  పంజాబ్-చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా తనతో నెస్ వాడియా అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా తనపై చేయి చేసుకున్నాడని ప్రీతి జింతా ఆరోపించింది.

ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె గురువారం రాత్రి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కాగా  ప్రీతి ఫిర్యాదు మేరకు ముంబయి మెరైన్ డ్రైవ్ పోలీసులు నెస్ వాడియాపై పలు సెక్షన్ల (354, 504, 506,509 సెక్షన్లు) కింద కేసు నమోదు చేశారు. పోలీసులు  దర్యాప్తు చేపట్టారు. నెస్ వాడియా, ప్రీతి జింతాల మధ్య గతంలో ప్రేమ వ్యవహారం నడిచిన విషయం తెలిసిందే. 
 
ఇద్దరూ కలిసి గతంలో ఐపీఎల్ పంజాబ్ టీంకు ఓనర్లుగా ఉన్నారు. కొంత కాలం తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు ఒకరంటే ఒకరికి పడనంత శత్రుత్వం. చివరికి వీరిద్దరి వ్యవహారం పోలీస్ స్టేషన్ కి చేరటం విశేషం. మరోవైపు ప్రీతి ఫిర్యాదును నెస్ వాడియా తోసిపుచ్చారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు
11:04 - By Unknown 0

0 comments:

వైఎస్ షర్మిలను కలవలేదు,మాట్లాడలేదు: హీరో ప్రభాస్

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు  వైఎస్ షర్మిలను తాను ఎప్పుడూ కలవలేదని, ఆమెతో మాట్లాడలేదని సినీ హీరో ప్రభాస్ స్పష్టం చేశారు. షర్మిలపై కొంత కాలంగా కొన్ని వెబ్ సైట్లలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రచారం అంతా నిరాధారం అని ఆయన పేర్కొన్నారు. వైఎస్ షర్మిళను తానెప్పుడూ కలవలేదని, ఆమెతో మాట్లాడలేదని  ప్రభాస్‌ తెలిపారు.

ఈ ప్రచారంలో అణువంత కూడా నిజం లేదన్నారు. కొన్నాళ్లుగా ఈ రూమర్లను తాను పట్టించుకోలేదని తెలిపారు. అయితే ఇవి మరో వ్యక్తిని తీవ్రంగా బాధపెడుతున్నాయి. అందుకనే తాను వీటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఒక వ్యక్తికి భార్యగా, ఒక తల్లిగా సమాజంలో అత్యంత గౌరవ ప్రతిష్టలు కలిగిన వ్యక్తిని తీవ్రంగా దెబ్బతీసేలా ఈ రూమర్లు ఉన్నాయని బాధను వ్యక్తం చేశారు. అందుకే ఈమేరకు ప్రకటన విడుదల  చేస్తున్నట్లు తెలిపారు.

తనకు  ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు. ఇలాంటి నిరాధారమైన రూమర్లు కారణంగా ఒక వ్యక్తి ఎంత తీవ్రంగా బాధపడతారో, మనస్తాపం చెందుతారో తాను అర్థంచేసుకోగలనన్నారు. ఈ తరహా రూమర్లకు పుల్‌స్టాప్‌ పెట్టడానికి తాను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దీనికి కారకులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

తన అనారోగ్యంపై కూడా పుకార్లు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.  తాను కోమాలో ఉన్నట్లు, తీవ్రంగా గాయపడినట్లు ఏవేవో ప్రచారం చేస్తున్నారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.  తన కుటుంబ సభ్యులు తీవ్రంగా బాధపడుతున్నారని పేర్కొన్నారు.  ఫేస్ బుక్ లో కూడా ఆయన ఇదే విషయాన్ని తెలిపారు.
తనపై జరుగుతున్న అసభ్య ప్రచారంపై వైఎస్ షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు బహిరంగ లేఖ కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.
10:38 - By Unknown 0

0 comments:

Thursday, 12 June 2014

విషాదాంతంగా ముగిసిన ప్రేమ వ్యవహారం


హైదరాబాద్ : హైదరాబాద్ తిరుమలగిరిలో ఓ ప్రేమ వ్యవహారం విషాదాంతంగా ముగిసింది. లోతుకుంటలోని సరస్వతీనగర్ నివాసి భాగ్యశ్రీ రెడ్డి ఓ ప్రయివేట్ పాఠశాలలో టీచర్. సంవత్సర కాలంగా ఆమె వైజాగ్ కు చెందిన గీతాకృష్ణతో ప్రేమ వ్యవహారం కొనసాగింది.  భాగ్యశ్రీ బీఎస్సీ కంప్యూటర్స్‌ చదువుతుండగా.. గీతాకృష్ణ ఎంటెక్‌ చేస్తున్నాడు. అయితే వీరి ప్రేమను గీతాకృష్ణ పేరెంట్స్‌ అంగీకరించలేదు. ఆరు నెలలుగా తనను పెళ్లి చేసుకోవాలని అతనిపై భాగ్యశ్రీ ఒత్తిడి తీసుకు రావటంతో  గీతాకృష్ణ కనిపించకుండా పోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె చున్నీతో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కాగా  పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటానన్న గీతాకృష్ణ మాట మార్చడంతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని భాగ్యశ్రీ తల్లిదండ్రులు ఆరోపించారు. గీతాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గీతాకృష్ణ తనను మోసం చేశాడంటూ భాగ్యశ్రీరెడ్డి రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
23:28 - By Unknown 0

0 comments:

ఉదయం పెళ్లి... మధ్యాహ్నం లైంగికదాడి, ఆపై హత్యాయత్నం


పలమనేరు:  స్నేహితురాలి నగలపై కన్నేశాడు. రెండేళ్లుగా ప్రేమించినట్టు నటిం చాడు. పెళ్లి చేసుకుందామని  కాణిపాకానికి తీసుకెళ్లాడు. అక్కడ తాళి కట్టాడు. తిరుగు ప్రయాణంలో ఓ అడవిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. మెడలోని నగలను లాక్కొన్నాడు. ఇదేమని ప్రతిఘటించిన ఆమెపై పెద్ద బండరాయిని వేశాడు. చనిపోయిందనుకుని నగలతో అక్కడి నుంచి ఉడాయించాడు. స్పృహలోకొచ్చిన బాధితురాలు  స్థాని కుల సాయంతో ఆస్పత్రిలో చేరింది. ఈ సంఘటన గురువారం పలమనేరు మండలంలోని కాలువపల్లె అటవీప్రాంతంలో చోటుచేసుకుంది.

బాధితురాలి కథనం మేరకు...
తమిళనాడు రాష్ట్రం పల్లికొండ సమీపంలోని కీల్‌చేర్ గ్రామానికి చెందిన ఓ యువతి(23)కి, అంబూరు సమీపంలోని మేల్‌వయిదన కుప్పానికి చెందిన టైలర్ పెరియ మురుగతో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆ యువతి ఓ ప్రైవేటు షూ కంపెనీలో పనిచేస్తోంది. పెళ్లి కోసం నగలను సిద్ధం చేసుకుంది. వాటిపై కన్నేశాడు మురుగ. ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. అతని మా టలు నమ్మిన ఆమె గురువారం ఉద యం ఇంటి నుంచి వచ్చేసింది. ఇద్దరూ స్కూటర్‌పై బయల్దేరి కాణిపాకం చేరుకున్నారు.

అక్కడ ఉదయం 10.30 గంట లకు పెళ్లి చేసుకున్నారు. తర్వాత తమిళనాడుకు తిరుగు ప్రయాణమయ్యారు. దారి మధ్యలో పలమనేరు మండలంలోని కాలువపల్లె కౌండిన్యా అటవీప్రాంతం చాలా బాగుంటుందని చెప్పి అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై బలవంతంగా ఆమె మెడలోని నెక్లెస్, మూడు చైన్లు, ఓ హారం లాక్కున్నాడు. వాటితో పాటు ఉదయం తాను కట్టిన తాళిని సైతం తీసుకున్నాడు. దీంతో బాధితురాలు ప్రతిఘటించగా ఓ పెద్ద బండ  రాయిని వేశాడు.
దీంతో తీవ్రంగా గాయపడిన యువతి స్పృహ కోల్పోయింది. చనిపోయిందనుకుని భావించిన నిందితుడు నగలతో బైక్‌పై ఉడాయించాడు. కొంతసేపటికి స్పృహలోకొచ్చిన బాధితురాలు అతి కష్టంపై అక్కడి నుంచి మెయిన్ రోడ్డుకు చేరుకుంది. ఆమెను గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారమందించారు.  వారు ఆమెను పలమనేరు ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు చెప్పిన వివరాల మేరకు పోలీసులు కేసు విచారిస్తున్నారు
23:17 - By Unknown 0

0 comments:

సాప్ట్ వేర్ ఇంజినీర్‌పై సీఈఓ సామూహిక అత్యాచారం

*అవమానం భరించలేక ఆత్మహత్య
* సీఈఓనే ప్రధాన నిందితుడు
 * సోదరుడు, స్నేహితుడితో కలిసి కిరాతకం

 

 బెంగళూరు   :  ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ.. అతని సోదరుడు, మరో స్నేహితుడితో కలిసి తన సంస్థలో పని చేస్తున్న మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ అవమానాన్ని భరించలేక బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, బాధితురాలి సోదరుడి వివరాల మేరకు.. చిక్కమగళూరు జిల్లా అజ్జంపుర సమీపంలోని హెబ్బూరుకు చెందిన అనిత (25) బెంగళూరులోని ఎట్రియా కాలేజ్‌లో విద్యాభ్యాసం చేసింది. తనను ప్రేమించాలంటూ తోటి విద్యార్థి గిరీష్ ...అనితను ఐదేళ్ల పాటు వేధించాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. అనంతరం అనితకు కేబీ ఫౌండేషన్  సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది.

తనను ప్రేమించాలంటూ ఆ కంపెనీ సీఈఓ శ్రీకాంత్‌కు సోదరుడు, గిరీష్‌కు స్నేహితుడైన మదన్ ఆమెను ఒత్తిడి చేశాడు. ఇందుకు ఆమె అంగీకరించలేదు. తమ్ముడి కోరికను తెలుసుకున్న శ్రీకాంత్.. ఈ నెల 10వ తేదీ (మంగళవారం) రాత్రి అత్యవసర పని అంటూ అనితను తన ఇంటికి రప్పించుకున్నాడు. ఆమె వెళ్లిన సమయానికి ఆ ఇంట్లో మదన్, గిరీష్ కూడా ఉన్నారు. వారు అనితను నిర్బంధించి.. సామూహిక అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపుతామంటూ ఆమెను హెచ్చరించి బుధవారం ఉదయం  వదిలిపెట్టారు.

ఈ అవమానాన్ని భరించలేని అనిత.. తన సోదరుడు వినయ్‌కు మొబైల్ ద్వారా ఓ మెసేజ్ ఇచ్చింది. నేరుగా తను ఉంటున్న హుళిమావు సమీపంలోని బృందావన లేఔట్‌లోని ఒక పీజీ హాస్టల్‌కు వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనితకు పలుమార్లు కాల్ చేసినా స్పందన లేకపోవడంతో వినయ్ గురువారం హాస్టల్‌కు చేరుకోవడంతో ఆత్మహత్య విషయం వెలుగు చూసింది. పోలీసులు అనిత మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. వినయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న శ్రీకాంత్, మదన్, గిరీష్ కోసం గాలిస్తున్నారు.
23:16 - By Unknown 0

0 comments:

Tuesday, 10 June 2014

రాష్ట్రం లో రెడ్ల ఉనికి లేకుండా చేయడమే టిడిపీ లక్ష్యమా?


రాష్ట్రం లో రెడ్ల ఉనికి లేకుండా చేయడమే టిడిపీ లక్ష్యంగా కనిపిస్తుంది. అందుకు నిదర్శనం మంత్రివర్గ విస్తరణ అందులో రెడ్డ్లకు ప్రాధాన్యం కలిపించ లేదు. అంతేకాకుండ బి సి జపం చేసిన బాబు యాదవ వర్గానికి  అసలు ప్రాధాన్యమే ఇవ్వలేదు.. ఈ విధంగా బాబు తన సామాజిక వర్గానికే పెద్ద పీట వేశారు . అంతేకాకుండా టి డి పి అధికారంలోకి  రావడానికి కారణం అయిన కాపు సామాజిక వర్గాన్ని కూడా బాబు దూరంగా పెట్టడం విశేషం .. ఈ విధంగా బాబు రాష్రం లో కమ్మ వర్గాన్ని తప్ప వేరే వర్గాన్ని ఫైకి రాకుండా చేసున్నారు.. బాబా మజాకా... 

K E Krishna Murthy (Pattikonada) 

Yanamala Rama Krishnudu (Tuni)

Nimmakayala Chinna Rajappa (Peddapuram)

Ayyanna Patrudu (Narsipatnam)

B Gopal Krishna Reddy (Srikalahasti)

Devineni Umamaheswara Rao (Mylavaram)

P Narayana (Nellore)

Paritala Sunitha (Ananthapuram)

Prathipati Pulla Rao (Chilakaluripet)

Kamineni Srinivas (Kaikaluru)

Ganta Srinivas (Bhimili)

Palle Raghunatha Reddy (Puttaparthi)

Peethala Sujatha (Chintalapudi)

Atchannaidu Kinjarapu (Tekali)

Sidda Raghava Rao (Darshi)

Kimidi Mrunalini (Chipurupalli)

Kollu Ravindra (Machilipatnam)

Ravela Kishore Babu (Prathipadu)

Pydikondala Manikyala Rao (Tadepalligudem)
21:39 - By Unknown 0

0 comments:

Monday, 9 June 2014

సీఎం చంద్రబాబుకి జగన్‌ తొలి లేఖాస్త్రం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి లేఖాస్త్రం సంధించారు. ముఖ్యమంత్రి అయ్యాక తొలి సంతకం రైతు రుణ మాఫీ ఫైలుపై చేస్తానని చంద్రబాబు చెప్పినా, రుణ మాఫీ కమిటీపై చంద్రబాబు తొలి సంతకం చేయడాన్ని ప్రశ్నిస్తూ, ఈ లేఖాస్త్రాన్ని వైఎస్‌ జగన్‌ సంధించడం గమనార్హం. ‘ఎన్నికల ప్రచారంలో కమిటీ అన్న మాట చెప్పలేదు.. రుణాల్ని మాఫీ చేస్తామని మాత్రమే చెప్పారు. ఇప్పుడు కమిటీ వేశారు. 45 రోజుల్లో ఆ కమిటీ ఏం తేల్చుతుందోగానీ, ఈలోగా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తక్షణం అన్ని రకాల రైతుల రుణాల్నీ మాఫీ చేసే దిశగా చర్యలు చేపట్టండి..’ అని వైఎస్‌ జగన్‌, చంద్రబాబుకి సంధించిన లేఖలో పేర్కొన్నారు. రుణ మాఫీ చేసిన రోజు నుంచీ కొత్త రుణాల్ని మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరిన జగన్‌, ఎన్నికల ప్రచారంలో భాగంగా టీవీల్లో టీడీపీ తరఫున వచ్చిన ప్రకటనల అంశాన్ని కూడా ప్రస్తావించారు. ప్రజలు మీ మాటల్ని నమ్మి ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించారు గనుక, వారి నమ్మకాన్ని వమ్ము చేయకండి.. అని జగన్‌ లేఖాస్త్రంలో ప్రస్తావించారు. నిన్న సాయంత్రం భారీ హంగూ ఆర్భాటాల నడుమ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు పదవీ ప్రమాణ స్వీకారం చేయగా, ఇరవై నాలుగ్గంటలు కూడా గడవకముందే ఆయనకు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ లేఖాస్త్రం సంధించడం విశేషమే. మరి జగన్‌ లేఖపై టీడీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 
23:41 - By Unknown 0

0 comments:

జగన్‌ చెప్పాడు... చంద్రబాబు చేశాడు...!

ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన వెంటనే.. అయిదు సంతకాలు, ఆరు పనులతో రాష్ట్ర ప్రజల స్థితి గతులు మార్చేస్తానంటూ వైఎస్‌ జగన్మోహనరెడ్డి తన ఎన్నికల ప్రచారం సందర్భంగా పదేపదేహామీ ఇచ్చారు. అయితే ఆ మాట నిలబెట్టుకోవడానికి అనగా సీఎం అయిన వెంటనే అయిదు సంతకాలు చేసి ప్రజల జీవనగతుల్ని మార్చేయడానికి ప్రజలు ఆయనకు అవకాశం ఇవ్వలేదు. నారా చంద్రబాబునాయుడును గెలిపించారు. నారా చంద్రబాబునాయుడు తొలినుంచి రైతు రుణమాఫీ పథకం పై ముఖ్యమంత్రి అయ్యాక తొలిసంతకం చేస్తానంటూ ఊదరగొడుతూ వచ్చారు. ఇవాళ ఆదివారం సాయంత్రం 7.27 గంటలకు ఆయన పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆ పిమ్మట జరిగిన బహిరంగ సభలో చంద్రబాబునాయుడు... ఏకంగా అయిదు తొలి సంతకాలు చేశారు. ఆయన చెప్పింది రైతు రుణమాఫీ అంశం ఒక్కటే అయినా.. జగన్‌ చెప్పిన తరహాలో అయిదు బిల్లుల మీద చంద్రబాబు సంతకాలు చేశారు. ఇవి అచ్చంగా జగన్‌ సంతకం చేస్తానన్న హామీలు కాదు గానీ.. జగన్‌ చెప్పిన తరహాలోనే చంద్రబాబు అయిదు సంతకాలు చేయడం అనేది కేవలం యాదృచ్ఛికం కావచ్చు.  అయితే రాష్ట్ర ప్రజలు యావత్తూ కీలకంగా ఎదురుచూస్తూ ఉన్న సంతకం.. రైతురుణమాఫీకి సంబంధించినది మాత్రమే. ఆ ఒక్క సంగతి ఆయన ఏం చేస్తారో...? ఎలాంటి మెలికలు పెడతారో..? రైతు రుణమాఫీని ఆచరణలోకి తీసుకువచ్చే విషయంలో ఎలాంటి మడతపేచీలు ఉంటాయో.. అనే భయంతోనే రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పదవీస్వీకార ప్రమాణం కోసం ఎదురుచూశారంటే అతిశయోక్తి కాదు.  చంద్రబాబు తొలి సంతకం రైతు రుణమాఫీ పైనే చేశారు. అయితే ఈ విషయంలో ఆయన తన తెలివితేటల్ని ప్రదర్శించారు. నేరుగా రుణమాఫీ చేయకుండా.. రైతు రుణమాఫీకి సంబంధించి.. విధివిధానాలు ఖరారుచేసేందుకు ఒక కమిటీని ఏర్పాటుచేస్తూ ఆయన తొలి సంతకం చేశారు. అయితే ఈ కమిటీ ఎప్పటికి విధివిధానాలను తేలుస్తుందో ఇవాళ్టికి ఖరారు కాలేదు. ప్రజల మదిలో సందేహాలు, సందిగ్ధాలు మాత్రం తొలగలేదు.
 చంద్రబాబు చేసిన సంతకాల వివరాలు: 

1) రైతు రుణమాఫీకి విధివిధానాల రూపకల్పనకు కమిటీ ఏర్పాటు
 2) వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ల పెంపు
 3) ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం
 4) మద్యం బెల్టుషాపుల రద్దు
 5) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితి 58 నుంచి 60 ఏళ్లకు పెంపు.  

మొత్తానికి తన తొలి అయిదు సంతకాలతో.. రాష్ట్ర ప్రజల అనుమానాలు నివృత్తి చేయలేకపోయినా.. అభిమానాన్ని చూరగొనేందుకు ప్రయత్నిస్తున్నారు నారా చంద్రబాబునాయుడు. ఆయన ఎలాంటి మెలికలు లేని రుణమాఫీ అందించాలని ఆశిద్దాం. 
23:36 - By Unknown 0

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top