తెలుగు చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్న కథనాల ప్రకారం అక్కినేని నాగార్జున మాటీవీ ఛానల్ ని పూర్తిగా అమ్ముకున్నట్లు తెలుస్తుంది. పరిశ్రమలో వినిపిస్తున్న వార్త ప్రకారం గత పదిరోజుల క్రితం తెలుగులో ప్రధాన ఎంటర్టైనర్ ఛానల్ గా ఉన్న మాటీవీ సంస్థ అమ్మకానికి పెట్టేశారు. ఈ సంస్థను సోనీ సంస్థ భారీ మొత్తంలో కొనుక్కుంది. దాదాపు 18000 కోట్లకు సోనీ సంస్థ మాటీవీ కి సంబందించిన అన్ని చానల్స్ కొన్నది. గత కొంతకాలం నుంచే వాటా దారుడిగా ఉన్న నాగార్జున ప్రధన షేర్ హోల్డర్ నిమ్మగడ్డ ప్రసాద్ లు మాటీవీని అమ్మేయాలని తెగ ప్రయత్నాలు చేశారు. సోనీ సంస్థతో గత రెండేళ్లుగా ఈ డీల్ నడుస్తుందని మీడియా వర్గాలు అంటున్నాయి. ఛానల్ లో అధిక భాగం నిమ్మగడ్డ ప్రసాద్ షేర్ ఉన్నప్పటికీ నాగార్జుననే ఎక్కువగా దీని నిర్వహణ బాధ్యతలను చూసుకునేవారు. మాటీవీ షేర్ లో అల్లు అరవింద్ తో పాటు పలువురు సినీ వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. మొత్తానికి తెలుగు ప్రేక్షకులకు ఆనందాన్ని పంచిన మాటీవీ సంస్థ ఇక నుంచి సోనీ మేనేజ్ మెంట్ అధ్వర్యంలో తెలుగు ప్రేక్షకులను అలరించబోతుంది
0 comments:
Post a Comment