సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉండటంతో... బిజెపిలో చేరి, ఆ పార్టీ టిక్కెట్ పైన టిడిపి మద్దతుతో గెలవవచ్చునని బాలయ్య సూచించారని వినికిడి. ఇప్పటికే బిజెపి నాయకత్వం విజయవాడ పార్లమెంటు సీటును తమకు వదిలేయాలని టిడిపిని కోరినట్లుగా తెలుస్తోంది. బాలయ్య సూచన మేరకు బిజెపిలో చేరిన ఆమె ఇప్పుడు విజయవాడ పైన ప్రత్యేక దృష్టి సారించారని అంటున్నారు. మరోవైపు కేంద్ర జౌళీశాఖ మంత్రి కావూరి సాంబశివ రావు కూడా విజయవాడ టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన టిడిపి తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. విజయవాడ కాకపోయినా మచిలీపట్నం నుండి టిడిపి టిక్కెట్ పైన పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారట. అయితే, కావూరి చేరికను టిడిపి స్థానిక నాయకత్వం వ్యతిరేకిస్తోంది. అయితే, బాలయ్యతో కావూరికి మంచి సంబంధాలు ఉన్నాయి. హీరో మద్దతుతో టిడిపిలోకి ఎంట్రీ ఇచ్చేందుకు కావూరి ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు.
About the Author

0 comments:
Post a Comment