Contact

Text

Saturday 31 May 2014

జగన్, చంద్రబాబులకు కెసిఆర్ ఆహ్వానం!

హైదరాబాద్: 


తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ప్రమాణ స్వీకారానికి టిడిపి అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇప్పటి వరకు ఆహ్వానం పలకని విషయం తెలిసిందే. అయితే తన ప్రమాణ స్వీకారానికి చంద్రబాబును ఆహ్వానించాలని కెసిఆర్ భావిస్తున్నారట. చంద్రబాబు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానాలు పంపిస్తున్నారట. వీరితోపాటు మిగిలిన పార్టీల అధ్యక్షులు, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు.


పార్టీని బలోపేతం చేయండి: జగన్ 


తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ పార్టీ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఎంపీల భేటీలో పార్లమెంటరీ నేతను ఎన్నుకోనున్నారు.

23:42 - By Unknown 0

0 comments:

వ్యభిచారం కేసులో పట్టుబడ్డ ఆర్టిస్టు


హైదరాబాద్ : ఎల్బీనగర్ ప్రాంతంలో వ్యభిచారం చేస్తూ నీహారిక అనే జూనియర్ ఆర్టిస్టు పట్టుబడింది. ఈ ప్రాంతంలో వ్యభిచారం జరుగుతోందని పక్కా సమాచారం అందడంతో స్పెషల్ ఆపరేటింగ్ టీమ్ దాడులు చేయడంతో ఆమెతో పాటు భారీ సంఖ్యలో యువతులు, పలువురు పురుషులు పట్టుబడ్డారు. పట్టుబడ్డవారిలో ప్రముఖులు, బడా వ్యాపారులు కూడా ఉన్నట్లు సమాచారం.

ఇటీవలి కాలంలో ఎక్కువగా శివారు ప్రాంతాల్లోనే ఈ తరహా కార్యకలాపాలు సాగుతున్నాయి. ఎల్బీనగర్, మాదాపూర్, కూకట్ పల్లి లాంటి ప్రాంతాల్లో అయితే పోలీసు నిఘా చాలా తక్కువగా ఉంటుందని వ్యభిచార ముఠాలు ఈ ప్రాంతాలను ఎంచుకుంటున్నట్లు తెలిసింది. డబ్బులకు అలవాటుపడి కొంతమంది యువతులు ఈ రొంపిలోకి దిగుతున్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న కొన్ని హోటళ్లు, లాడ్జిలలో తరచు వ్యభిచారం కేసులు నమోదవుతున్నాయి.
23:22 - By Unknown 0

0 comments:

ఆ ఇద్దరు హీరోల జీవితాల్లో ఎన్ని ట్విస్టులో!


సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అంతా మాయ. ఎవరు ఎప్పుడు ఓ వెలుగు వెలుగుతారో, ఎప్పుడు మసకబారిపోతారో చెప్పడం కష్టం.  ఒక సినిమా హిట్ అయితే ఆ హీరోని, హీరోయిన్ ను ఆకాశానికి ఎత్తుతారు. ఫెయిల్ అయితే వారి మొఖం చూసేవారు ఉండరు. మంచి ఫామ్ లో ఉన్నవారు హఠాత్తుగా డౌన్ ఫాల్ అవుతారు.  సినిమా కథల్లో ఎన్ని మలుపులుంటాయో, సినీతారల జీవితాల్లో కూడా అన్ని ట్విస్టులు ఉంటాయి. చూస్తుండగానే అందలం ఎక్కుతారు. ఒక్కసారిగా పడిపోతుంటారు. అలా అందలం ఎక్కిన ఇద్దరు హీరోలు ప్రస్తుతం డౌన్ ఫాల్ లో పడిపోతున్నారు.

టాలీవుడ్ స్టార్ కమెడియన్ గా  సునీల్ ఓ వెలుగు వెలిగాడు. బ్రహ్మానందం తరువాత ఆ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను ఆక్రమించేశాడు. బిజీ అయిపోయాడు. ఆ ఊపులోనే సిక్స్ ప్యాక్  హీరోగా మారిపోయాడు.  'అందాలరాముడు' అదరగొట్టినా ఆ తరువాత ఆ స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు.  కథలను ఎంచుకోవడంలో సునీల్ ఫెయిలయ్యాడన్న విమర్శ వినవచ్చింది. ఎంత సేపూ రొటీన్ గా కనిపిస్తూ చివరుకు ఫ్లాప్ హీరో అయిపోయాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న భీమవరం బుల్లోడు కూడా ఫ్లాప్ అవ్వడంతో సునీల్ ప్రస్తుతం తీవ్ర నిరాశతో ఉన్నట్లు సమాచారం. హీరోగా కొనసాగాలా? లేక కమెడియన్ గానే కొనసాగాలా? అన్న సందిగ్ధంలో సునీల్ ఉన్నట్లున్నారు.

హీరో నాని చిన్న సినిమాలతో పెద్ద సక్కెస్ లు సాధించాడు. మంచి కథా చిత్రాలలో నటించి స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఈగతో మంచి పేరు సంపాదించాడు. ఆ తరువాత వరుసగా నాని డౌన్ ఫాల్ మొదలైంది. ఇటీవల  తను నటించిన సినిమాలు వరుసుగా ఫ్లాపులు కావడంతో నాని దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. అతనితో చిత్రాలు నిర్మించినవారి పరిస్థితి కూడా అలానే ఉంది.  ఎంతగా అంటే నాని నటించిన 'జేండాపై కపిరాజు'ని  కొనడానికి ఎవరూ ముందుకు రావడంలేదని సినీవర్గాల సమాచారం. ఈ నేపధ్యంలో ఎలాగైనా మళ్లీ పుంజుకోవడానికి నాని తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. సునీల్, నాని మళ్లీ జనరంజక చిత్రాలలో నటించి పూర్వపు స్థానాన్ని ఆక్రమించాలని ఆశిద్దాం.
13:09 - By Unknown 0

0 comments:

Friday 30 May 2014

మళ్లీ తెరపైకి రిలయన్స్ గ్యాస్:చంద్రబాబు మరిచిపోయినవా ?


చంద్రబాబు మరిచిపోయినా, ఈనాడు రాయకపోయినా, రిలయన్స్ గ్యాస్ వ్యవహారం మరుగునపడిపోలేదు. మీకేంటి, సీమాంధ్రకు అపార సముద్రతీరం, సహజ వనరులు వున్నాయని చెప్పే భాజపా రిలయన్స్ గ్యాస్ గురించి మాట్లాడదు. సీమాంద్ర గ్యాస్ ను గుజరాత్ కు కట్టబెట్టింది ఎవరో జనాలకు తెలియంది కాదు. అందుకే చంద్రబాబూ, రాష్ట్రానికి డబ్బులు లేవంటారు కానీ, దాని గురించి ప్రస్తావించరు. కోనసీమలో జనాలకు తెలుసు తమకు జరుగుతున్న అన్యాయం. కానీ ఎక్కడా ఎవరూ మాట్లాడరు. కాంగ్రెస్ కాదు, భాజపా కాదు, తేదేపా కాదు. అందరూ అంబానీ కంపెనీకి విధేయులే అని విమర్శలు వినవస్తున్న నేపథ్యంలో కాగ్ నోరు విప్పింది.  జీ-డీ6గ్యాస్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) ప్రభుత్వ ఆమోదిత ధర కంటే అధికంగా వసూలు చేసిందని, అంతేకాకుండా.. అదనంగా వసూలు చేసిన మార్కెటింగ్ మార్జిన్‌ను ప్రభుత్వంతో ఆదాయ పంపకం, రాయల్టీల లెక్కింపులో చూపలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) పేర్కొంది. కాగ్ చెప్పింది ఇదీ... కేజీ-డీ6లో వెలికితీసిన గ్యాస్‌ను రిలయన్స్ తమ కస్టమర్లకు విక్రయించే ధరను ప్రభుత్వం 2007 అక్టోబర్‌లో ఒకో మిలియన్ బ్రిటిష్ యూనిట్(ఎంబీటీయూ)కు 4.2 డాలర్లుగా నిర్ణయించింది.  అయితే, రిలయన్స్ మాత్రం ఒక్కో యూనిట్‌కు 4.205 డాలర్ల చొప్పున వసూలు చేసిందని, దీనివల్ల అదనంగా 2009-10 నుంచి తొలి నాలుగేళ్లలో 9.68 మిలియన్ డాలర్ల మొత్తాన్ని వసూలు చేసినట్లు పేర్కొంది. ఈ ధరపైన ఆర్‌ఐఎల్ తమ మార్కెటింగ్ రిస్క్‌ల కోసమంటూ ఒక్కో ఎంబీటీయూకి 0.135 డాలర్లను అదనంగా రాబట్టిందని కాగ్ తెలిపింది. అయితే, ప్రభుత్వంతో లాభాల పంపకం, రాయల్టీ లెక్కింపు విషయంలో మాత్రం 4.34 డాలర్లకు బదులు కేవలం 4.205 డాలర్ల ధరనే పరిగణనలోకి తీసుకున్నట్లు తమ ఆడిటింగ్‌లో గుర్తించినట్లు పేర్కొంది. 

మరి ఇప్పుడైనా మనవాళ్లు నోరు విప్పుతారా? 
23:25 - By Unknown 0

0 comments:

జగన్ వై ఎస్ ర్ లది నేరచరిత్ర : జైలుకి ఎప్పుడు


హైదరాబాద్: హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిల పైన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య శుక్రవారం నిప్పులు చెరిగారు.జగన్, వైయస్సార్‌లది నేర చరిత అని, నేరాలు చెయ్యడంలో వారిద్దరు పేటెంట్ హక్కు పొందారని ఎద్దేవా చేశారు. గంగిరెడ్డిని ఎర్రచందనం స్మగ్లర్ అంటే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. ఆయన మీ ముఠాలో సభ్యుడు కాదా అన్నారు. గంగిరెడ్డికి జగన్‌కు మధ్య సంబంధం లేదా అన్నారు. దాడులు చేసే సంస్కృతి వైయస్సార్ కాంగ్రెసు పార్టీదేనని, టిడిపి నేతలకు అలాంటివి తెలియదన్నారు. చంద్రబాబు గొప్పతనం తెలియక కొత్తగా ఎన్నికైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారన్నారు. రెండు వందల మంది టిడిపి కార్యకర్తలను పొట్టన పెట్టుకుంది మీ నాయకుడే అన్నారు. పరిటాల హత్య కేసులో సిబిఐ, వైయస్సార్, సోనియా న్యాయబద్ధంగా వ్యవహరించి ఉంటే జగన్ ఏనాడో జైలుకు వెళ్లేవారన్నారు. రాష్ట్రంలో ఉగ్రవాదం పెరగడానికి కారణం వైయస్సే అని ఆరోపించారు. దొంగ పాసుపోర్టులతో గంగిరెడ్డి విదేశాలకు పారిపోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సహకరించిందని విరుచుకుపడ్డారు. ఎర్రచందనం స్మగ్లర్లలో 90 శాతం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలే అన్నారు. త్వరలోనే ఆ చిట్టా బయటపెడతామన్నారు.

23:15 - By Unknown 0

0 comments:

పొగ రాణుల మజాకా ....

హైదరాబాద్ : భారతీయుల్లో పొగతాగే అలవాట్లు క్రమంగా మారిపోతున్నాయి. క్లబ్బులు, పబ్బులు, కాఫీడేలు, సాంస్కృతిక కేంద్రాలు, బస్టాపులు.. ఇలా ఎక్కడ చూసినా ఉఫ్. ఉఫ్.. అంటూ పొగతాగే పొగరాణుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఓవైపు అబ్బాయిలు తమ జేబు బరువును, ఆరోగ్యాన్ని చూసుకుని కాస్తంత జాగ్రత్త పడుతుంటే.. అమ్మాయిలు మాత్రం అదేమీ లెక్కచేయకుండా పొలోమంటూ పొగ తాగేస్తున్నారు, చుట్టుపక్కల వాళ్లనూ తాగిస్తున్నారు. దీంతో సంతానరాహిత్యం, కేన్సర్ లాంటి ప్రమాదాలు చాలా ఎక్కువ అవుతున్నాయి.



1980 నుంచి 2012 వరకు మొత్తం 187 దేశాల్లోని ప్రజల ధూమపాన అలవాట్లు, పోకడలను పరిశీలించిన అమెరికన్, బ్రిటిష్ వైద్య పత్రికలు ఈ మార్పును స్పష్టంగా గమనించాయి. భారతీయ పురుషుల్లో పొగ తాగేవారి సంఖ్య 33.8 శాతం నుంచి 23 శాతానికి తగ్గిపోతే, మహిళల్లో మాత్రం పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా చుట్టలు, తంబాకు.. ఇలా ఏదో ఒకపేరుతో పొగతాగే మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో ఇది బాగా కనిపిస్తుంటుంది. 1980 నాటికి మన దేశంలో దాదాపు 53 లక్షల మంది పొగరాణులుంటే, 2012 నాటికి ఆ సంఖ్య ఏకంగా 1.22 కోట్లకు చేరుకుంది. అంటే రెట్టింపునకు పైగా పెరిగిపోయిందన్న మాట.

మొదట్లో సిగరెట్లు కాల్చేవాళ్లు రోజుకు నాలుగైదు మాత్రమే కాలుస్తారని, దానివల్ల వాళ్ల ఆరోగ్యంలో కూడా పెద్దగా తేడా కనపడదని.. అదే కొన్నాళ్ల తర్వాత మాత్రం సిగరెట్ల సంఖ్య పెరుగుతుందని .. దానివల్ల ఆడవాళ్లలో అయితే సంతానరాహిత్యం సమస్య చాలా ఎక్కువ అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దానికితోడు పొగతాగే అలవాటు వల్ల పలురకాల కేన్సర్ కేసులు కూడా భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లో సిగరెట్ తయారీ సంస్థలపై విపరీతంగా కేసులు నమోదయ్యాయని, అందువల్ల అక్కడి కేసులను వదిలించుకుని బయటపడటం కంటే భారత్, చైనా లాంటి జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో మహిళలకు పొగతాగే అలవాటు పెంచితే తమ అమ్మకాలు పెరుగుతాయని కుట్రపన్ని, సిగరెట్లు కాల్చడాన్ని ఒక సోషల్ స్టేటస్ గా అవి మార్చేస్తున్నాయని సప్నా నంగియా అనే కేన్సర్ వైద్య నిపుణురాలు చెప్పారు. ఇవన్నీ జాగ్రత్తగా తెలుసుకుని, ఇప్పటికైనా పొగరాయుళ్లు, పొగరాణులు ఆ అలవాటును మానుకోవడం మంచిది.
23:07 - By Unknown 0

0 comments:

జాతీయ జెండా కి అవమానం

సినిమా తీసేవాళ్లకే కాదు, చేసేవాళ్లకు కూడా నైతికత అవసరం. అది లేకపోతే... వాళ్లకే కాదు... సమాజానికీ ఎంతో నష్టం. కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసే వెండితెరపై... దేశ ప్రతిష్ఠకే మచ్చ తెచ్చే కథాకథనాల్ని, పాత్ర చిత్రణల్ని, ఆహార్యాల్ని ప్రోత్సహించడం ఒక రకంగా క్షమించరాని నేరం. బాలీవుడ్‌లో మల్లికా శరావత్ చేసిన ఓ దుశ్చర్య... ప్రస్తుతం ఈ స్థాయి విమర్శలకు కారణం అయ్యింది. ఆమె నటిస్తున్న ‘డర్టీ పాలిటిక్స్’ సినిమాకు సంబంధించిన దృశ్యాలను ఇటీవల రాజస్థాన్ అసెంబ్లీ ముందు చిత్రీకరించారు. జాతీయ జెండాను ఒంటికి చుట్టుకొని ప్రభుత్వ వాహనంపై కూర్చొని రెచ్చగొట్టే భంగిమలు మల్లిక ఇస్తుండగా ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. పైగా మల్లికా తన నగ్న దేహానికి మువ్వన్నెల జెండాను చుట్టుకున్న స్టిల్‌ని ఈ సినిమా ఫస్ట్ లుక్‌గా విడుదల చేయడం మరో దారుణం. మొత్తంగా ఈ చిత్రం బృదం చేసిన దుశ్చర్య తీవ్రమైన వివాదానికి తెర లేపింది. జాతీయ జెండాను ఇలా అవమానించడం బాధాకరమే కాక, క్షమించరాని నేరం. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి.
23:01 - By Unknown 0

0 comments:

స్మృతి ఇరానీకి ఖుష్బూ అండ


చెన్నై : కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి స్మృతి ఇరానీని సినీనటి, డీఎంకే నాయకురాలు ఖుష్బూ బాసటగా నిలిచారు. కనీస డిగ్రీ కూడా లేని స్మృతి ఇరానీకి కీలక మయిన మానవ వనరుల అభివృద్ధి శాఖను ఎలా కట్టబెడతారంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దానికి ఖుష్బూ అభ్యంతరం తెలిపారు. ఆమె తన ట్విట్టర్‌లో ఇలా పేర్కొన్నారు. సాధించడానికి విద్య మాత్రమే ముఖ్యం కాదన్నారు. సచిన్ టెండూల్కర్, బిల్‌గేట్స్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి వారు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందారని, వారంతా పట్టభద్రులు కాదని గుర్తు చేశారు. సాధించడానికి ప్రతిభ ముఖ్యంగానీ విద్యకాదని ఖుష్బూ ట్విట్ చేశారు.


అలాగే సుష్మాపై ఆమె ప్రశంసల జల్లు కురిపించారు. సుష్మాజీ మీ ధైర్యం అలుపెరగని శ్రమ, ప్రయత్నాల వలన సాధించిన శక్తి ముందు ఎవరూ తోక జాడించలేరు. ప్రజలకు మీరు ఉత్తమ సేవలందించగలరు. మీకు నా శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు.
22:54 - By Unknown 0

0 comments:

దర్శకుడు రాజమౌళి తండ్రికి నాన్ బెయిలబుల్ వారెంట్

విశాఖపట్నం: దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు యలమంచిలి కోర్టులో చుక్కెదురైంది. చెక్ బౌన్స్ కేసులో విజయేంద్ర ప్రసాద్ కు యలమంచిలి కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. 
 

జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నరసింహుడు' సినిమా కోసం నిర్మాత చెంగల వెంకట్రావ్‌ వద్ద 30 లక్షల రూపాయలు తీసుకున్నారు. అయితే ఆ సినిమా విషయంలో వెంకట్రావ్, విజయేంద్ర ప్రసాద్ కు విభేదాలు తలెత్తడంతో ఇచ్చిన పారితోషికాన్ని తిరిగి ఇవ్వాలని కోరారు.
 
అయితే బకాయి పడ్డ డబ్బు చెల్లింపు కోసం ఇచ్చిన చెక్‌ బౌన్స్‌ కావడంతో యలమంచిలి కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసులో తాజాగా విజయేంద్ర ప్రసాద్ కు కోర్టు  వారంట్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 
04:53 - By Unknown 0

0 comments:

ముద్దులతో రికార్డు


పాటలో అత్యధిక ముద్దు సన్నివేశాలను చిత్రీకరించి గిన్నిస్ రికార్డ్ సాధిస్తానంటున్నారు దర్శకుడు జేఎం ఇసాక్. ఈయన తొలి చిత్రం అగడంను ఎడిటింగ్ లేకుండా తెరకెక్కించి గిన్నిస్ రికార్డు సాధించారు.  ఇసాక్ రూపొందిస్తున్న రెండో చిత్రం లారా. లాస్ట్ బెంచ్ బాయ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఎన్.సెల్వకుమార్, కె.తామరై సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నూతన నటుడు హరి, శ్రీప్రియాంక, గీతాంజలి, లక్ష్మీ కిరణ్, గణేష్, చంద్రు, శిబి, సేతన్, విఘ్నేష్, గాట్పాడి షణ్ముగం తదితరులు నటిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు వివరించారు.

ఇది లవ్, కామెడీ మిళితమయిన థ్రిల్లర్ కథా చిత్రం అని తెలిపారు. వైవిద్యభరిత చిత్రాల దర్శకుడు కొత్త కథను తయారు చేసుకోవడానికి ఏకాంత ప్రదేశానికి వెళతారన్నారు. అయితే ఆయనపై సందేహంతో భార్య కూడా వెళుతుందని చెప్పారు. ఆ దర్శకుడి కథ రాయడానికి పలు అవాంతరాలు ఎదురవుతాయన్నారు. చివరి వరకు ఆయన కథను రాయలేక పోతారని పేర్కొన్నారు. ఆటంకాలకు కారణాలేమిటన్న విషయంపై ఆలోచనతో ఒక దిగ్భ్రాంతి కలిగించే సంఘటన గురించి తెలుస్తుందని చెప్పారు.

ఆ సంఘటన ఇతివృత్తంగానే దర్శకుడు కథ తయారు చేసుకుంటారని ఇలాంటి ఆసక్తికరమైన సంఘటనల సమాహారంగా లారా చిత్రం ఉంటుందని తెలిపారు. చిత్రంలోని ఒక పాటలో అత్యధిక ముద్దు సన్నివేశాలను చిత్రీకరించి గిన్నిస్ రికార్డు సాగించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పాటను త్వరలోనే చిత్రీకరించి వచ్చే వేసవిలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దర్శకుడు చెప్పారు.
04:50 - By Unknown 0

0 comments:

ఆ జీవితమంతా శూన్యమే:ఏంజలీనా జోలీ


లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటి ఏంజలీనా జోలీ జీవితం అచ్చం సినిమా కథనే తలపిస్తోంది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం.. ముగ్గురు భర్తలతో వైవాహిక జీవితం.. ఆరుగురు పిల్లలకు జీవితాన్ని ఇవ్వడం.. ఆపై బోయ్ ఫ్రెండ్ బ్రాడ్ పిట్ తో డేటింగ్..  తదుపరి కేన్సర్ బారిన పడటం..ఇలా చెప్పకుంటూ పోతే ఆమె జీవితమే ఒక పుస్తకం మాదిరిగా ఉంటుంది. ప్రస్తుతం నాలుగు పదుల జీవితానికి దగ్గర పడుతున్న జోలీ జీవితంలో అన్నీ మలుపులే. ఆమె జీవితంలో ఎన్ని ఆటుపోట్లును చవిచూసినా.. కేన్సర్ బారిన పడ్డ క్షణాలే ఆమెకు అత్యంత దుర్భరమైనవిగా పేర్కొంటుంది. ' ఆ క్షణంలో నేను శూన్యంలోకి వెళ్లిపోయాను. నాపై నాకే అసహ్యం వేసేది. తరుచు ఎక్కువగా కోప్పడుతూ ఉండేదాన్ని. దాన్ని తలుచుకుంటేనా భయమేస్తోంది. ఆ గతమంతా చీకటే.  ఆ ప్రయాణాన్ని పూర్తిగా అర్ధం చేసుకున్నాను' అని జోలీ తెలిపింది.
 

కొన్ని సందర్భాల్లో చనిపోవడానికి కూడా యత్నించానని తెలిపింది. విమానాల నుంచి దూకాలనిపించడమే కాకుండా, ఇంట్లో ఉన్న సమయంలో జీవితాన్ని అంతం చేసుకోవాలని ఆలోచనలే తనలో తరచు కలిగేవని తెలిపింది. 2007 లో ఆమె తల్లి కూడా కేన్సర్ తోనే చనిపోవడం కూడా తనను తీవ్రంగా కలిచి వేసేదని పేర్కొంది. ఆ చీకటి జీవితం నుంచి బయటకు రావడానికి తనకున్న ఆరుగురు పిల్లలే కారణం అంటోంది. గత సంవత్సరం కేన్సర్ బారిన పడిన తాను తిరిగి కోలుకోవటానికి పిల్లల ఓదార్పే ఆసరా అయ్యిందని తెలిపింది.
 
04:49 - By Unknown 0

0 comments:

ఆపరేషన్‌ ఎన్టీఆర్‌: పవన్‌ సపోర్ట్‌ ఎవరికి..!

ప్రస్తుతం ఆపరేషన్‌ ఎన్టీఆర్‌ అత్యంత జోరుగా సాగుతోంది. ఇప్పటికే నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్‌ కుటుంబాన్ని ఒంటరి చేసే యత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు తెలిసిందే. ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఆయన నటిస్తున్న కొత్త చిత్రం రభస టీజర్‌ విడుదలైంది. అయితే ఈ టీజర్‌ చాలా చెత్తగా ఉందని బాలయ్యబాబు అభిమానులు ఎస్‌ఎంఎస్‌ల ప్రచారం చేస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ ప్రచారం జోరందుకుంది.


కానీ ఇప్పుడు తేదేపాకు సన్నిహితంగా ఉన్న పవన్‌కళ్యాణ్‌ అభిమానులు మాత్రం ఇది మంచి పద్ధతి కాదని జూనియర్‌ ఎన్టీఆర్‌కు సంఘీబావం చెపుతున్నారు. రభస ట్రైలర్‌ అదిరిపోయిందని వారు చెపుతున్నారు. గతంలో ఎన్టీఆర్‌-పవన్‌కళ్యాణ్‌ రాంచరణ్‌ వివాహ సమయంలో కలుసుకుని చాలా సన్నిహితంగా మాట్లాడుకున్నారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య అంతర్గతంగా సత్సంబంధాలే ఉన్నాయి. ప్రస్తుత ఎన్టీయే కూటమి తరపున ఓ ఊపు ఊపుతున్న పవన్‌ మరి ఈ విషయంలో ఎన్టీఆర్‌కు మద్దతు ఇస్తాడా లేదా తటస్థంగా ఉంటాడా అన్నది వేచి చూడాల్సిందే.

         

01:00 - By Unknown 0

0 comments:

ఒకే హీరోతో జీవితం పంచుకుంటామంటున్న ప్రణీత-సమంత


ఆ హీరోయిన్లు ఇద్దరు ఒకే హీరోతో జీవితం పంచుకుంటామంటున్నారు. నిజజీవితంలో కాదండి సినిమాల్లోనే. సమంత-ప్రణీత ఇప్పటికే రెండు సినిమాల్లో కలిసి నటిస్తున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి మరో సినిమాలో నటించేందుకు తమ అంగీకారం తెలిపారు. వీరిద్దరి కాంబినేషన్లో అత్తారింటికి దారేది లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ వచ్చింది. ఆ సినిమా తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ రభసలోను వీరిద్దరు కలిసి ఎన్టీఆర్‌తో స్క్రీన్‌ పంచుకోనున్నారు.
          తాజాగా వీరి కాంబినేషన్‌ ప్రారంభించిన దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అల్లు అర్జున్‌తో తీసే సినిమాలో మరోసారి వీరిద్దరికి కలిసి అవకాశం ఇస్తున్నారు. దీంతో ఈ జంట హ్యాట్రిక్‌ కొట్టినట్లైంది. అలా సమంత-ప్రణీతలిద్దరు సినిమాల్లో ఒకే హీరోతో స్క్రీన్‌ను పంచుకోనున్నారు.
00:52 - By Unknown 0

0 comments:

జగన్‌ వార్నింగ్‌ ..!


వైకాపా అధినేత జగన్‌ అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు వార్నింగ్‌ ఇస్తున్నాడట. అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ నాయకులు తమ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తుండడంతో జగన్‌ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడట.  
జూన్‌ 2వ తేదీ తర్వాత జగన్‌ జిల్లాల పర్యటనలకు వెళుతున్నారు. ఈ పర్యనటల్లో జగన్‌ తమ కార్యకర్తలను వేధించే వారితో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైతే అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలపై పోరాడి వారి అంతుచూస్తానని జగన్‌ తన అనుచరులతో అంటున్నారు.

00:43 - By Unknown 0

0 comments:

Thursday 29 May 2014

మహానాడులోనూ పవన్‌ జపమే


‘కాస్త ప్రచారం చేసి పెట్టరాదా..’ అని స్వయంగా సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ వద్దకు వెళ్ళి మరీ, ప్రచారానికి రప్పించుకున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. మల్కాజిగిరి సహా కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీని పోటీలోకి దింపాలనుకున్నా, చంద్రబాబు వద్దని వారించడంతోనే పవన్‌ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారన్న ప్రచారం అప్పట్లో జరిగింది. ఇక, ఎన్నికల్లో పవన్‌ ప్రచారం ఇటు టీడీపీకీ, అటు బీజేపీకీ బాగా కలిసొచ్చింది తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌లలో. ఆ విషయం చంద్రబాబుకీ తెలుసు. అందుకే ఎన్నికల ఫలితాలొచ్చాక పవన్‌కి ప్రత్యేకంగా చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని పీఠమెక్కిన నరేంద్ర మోడీ కూడా, పవన్‌ని ప్రత్యేకంగా అభినందించారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ‘మహానాడు’ వేదికగా పవన్‌ని అభినందించారు. పవన్‌ విజ్ఞతను ప్రదర్శించారనీ, టీడీపీ - బీజేపీ కూటమికి మద్దతివ్వడం మంచి నిర్ణయమనీ కొనియాడారు చంద్రబాబు. ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అవుతోన్న చంద్రబాబు, ముఖ్యమంత్రి అయ్యాక కూడా పరిపాలనలో పవన్‌ విధానాల్ని పరిగణలోకి తీసుకుంటే మంచిదని పవన్‌ అభిమానులు భావిస్తున్నారు. మరి, చంద్రబాబు రానున్న రోజుల్లో కూడా పవన్‌ని  ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటారా.? వేచి చూడాల్సిందే.
23:57 - By Unknown 0

0 comments:

జంతు ప్రేమికురాలీ హాట్‌ ఆంటీ.!


పెళ్ళయ్యాక, తల్లయ్యాక ఆంటీ అనాల్సిందే కదా హీరోయిన్‌ని అయినాసరే. బాలీవుడ్‌ భామ సెలీనా జైట్లీ కూడా పెళ్ళి చేసుకుని, ఇద్దరు కవలలకు జన్మనిచ్చి తల్లయ్యింది గనుక, ఆమె కూడా ఆంటీనే. అయినాసరే.. అందాల ప్రదర్శనలు తనకు ఎవరూ సాటి రారంటూ.. పిల్లలు, భర్తతో కలిసి బికినీలో స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద ఫొటోకి పోజులిచ్చేసింది ఈ అందాల భామ.

సినిమాలు మానేసిన సెలీనా జైట్లీ, తాజాగా ఓ ఎమ్మెల్యేపై కేసు పెట్టి వార్తల్లోకెక్కింది. వినయ్‌ కోర్‌ అనే ఎమ్మెల్యే ఒకరు ఏనుగును పెంచుకుంటున్నాడట. అయితే ఆ ఏనుగు ఆలనా పాలనా చూడటంలేదంటూ, ‘పెటా’ సభ్యురాలి హోదాలో కోర్టుకెక్కింది సెలీనా జైట్లీ. సెలీనా ఫిర్యాదుపై స్పందించిన న్యాయస్థానం సదరు ఎమ్మెల్యేగారికి నోటీసులు కూడా పంపిందట.

అన్నట్టు సెలీనా స్వలింగ సంపర్కుల హక్కులకోసమంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొంది గతంలో. స్వలింగ సంపర్కులూ సామాన్య మానవులే.. వారికీ సమాజంలో అన్ని హక్కులూ వుంటాయంటూ అప్పట్లో సెలీనా ఓ రేంజ్‌లో హల్‌చల్‌ చేసింది. ఇప్పుడిలా ‘పెటా’ పేరుతో ఏకంగా ఎమ్మెల్యేపై కోర్టుకెక్కడంతో సెలీనా జైట్లీ వార్తల్లో వ్యక్తిగా మారింది
23:54 - By Unknown 0

0 comments:

శృతితోనూ ముద్దు లాగించేసాడా?


యాక్షన్‌ హీరో విశాల్‌ ఇప్పుడు రొమాంటిక్‌ హీరో అనిపించుకోడానికి తపిస్తున్నాడు. అతని గత చిత్రం ఇంద్రుడులో లక్ష్మి మీనన్‌తో ఇంగ్లీష్‌ ముద్దు లాగించిన విశాల్‌ తన తదుపరి చిత్రం పూజైలో శృతిహాసన్‌తోను లిప్‌లాక్‌ సీన్‌ చేస్తున్నాడనే టాక్‌ వినిపిస్తోంది. హాట్‌గా కనిపించడానికి మొహమాటాలు లేని శృతి లిప్‌ లాక్‌కి కూడా ఓకే చెప్పిందా? ఈ పుకారు మరీ శృతి మించకముందే విశాల్‌ మీడియా ముందుకి వచ్చేసి క్లారిటీ ఇచ్చేసాడు. ఈ సినిమాలో అలాంటి సీన్లు ఏమీ లేవని, తానేమి సీరియల్‌ కిస్సర్‌ని కాదని, ప్రతి సినిమాలోను ముద్దులు పెట్టడం తనకి కూడా ఇబ్బందేనని చెప్పాడు. అయితే ఈ చిత్రంలో శృతితో తనకి చాలా మంచి రొమాంటిక్‌ సీన్స్‌ ఉంటాయని అన్నాడు.  ఈ చిత్రంతో తనకి రొమాంటిక్‌ హీరోగా మరింత మంచి పేరు వస్తుందని, శృతితో తన కెమిస్ట్రీ బాగుందని యూనిట్‌ సభ్యులు ప్రశంసిస్తున్నారని విశాల్‌ చెప్పాడు. కానీ ఇందులో లిప్‌లాక్స్‌ లాంటివి ఉండవని పదే పదే క్లారిటీ ఇస్తున్నాడు. శృతి తనకంటే పెద్ద స్టార్‌ కాబట్టి ఎక్కడ అఫెండ్‌ అవుద్దోనని విశాల్‌ కంగారు పడుతున్నట్టున్నాడు.  - 
23:52 - By Unknown 0

0 comments:

రంజుగా రెజీనా ముద్దు సీను


రెజీనా మాంచి జోరుమీదుంది. టప టపా అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటపుడు తన స్థానం పదిలం చేసుకోవాలనుకుంటోంది. అందుకే కాస్త అటు ఇటు రూల్సు సడలించుకోక తప్పదని డిసైడైపోయింది. దీంతో, రారా కృష్ణయ్యా సినిమాలో సందీప్ కిషన్ పంట పండింది.  అతగాడికి రెజీనా తన పెదాలు దాదాపు 15 సెకండ్ల పాటు, నీ ఇష్టం అన్నట్లు అప్పగించేసిందని యూనిట్ వర్గాల బోగట్టా.  
ఆనందాన్ని, రెజీనా పెదాలను ఒకేసారి సందీప్ కిషన్ జుర్రేసుకోవడంతో, సీను మాంచి 'జబర్దస్త్' గా వచ్చిందని దర్శకనిర్మాతలు తెగ సంబరపడుతున్నారట. నిజానికి ముందు రెజీనా ఇలాంటి సీన్ కు ససేమిరా అందిట. సినిమాకు మైలేజీ వస్తుందని, ఆమె కెరియర్ కు బూస్ట్ అవుతుందని వివరిస్తే, సరే అందిట. దాంతో కెమేరా ఆన్,,సీన్ సూపర్.
23:50 - By Unknown 0

0 comments:

పవన్ డబ్బిచ్చాడా?


సంపత్ నంది నిర్మాతగా మారాడు. మొదటి సినిమా వదిలేస్తే, రెండో సినిమాకే కాస్త పైసలు ఇచ్చి వుంటారన్నది వాస్తవం. ఎంత అమెరికా కంపెనీ ఫైనాన్సు చేసినా, కాస్తయినా పెట్టుబడి కావాలి కదా? దాని వెనుక గమ్మత్తయిన వదంతి వినిపిస్తోంది. పవన్ తన కారణంగా సంపత్ నంది అలా రెండేళ్ల పాటు వుండిపోయాడన్న దృష్టితో, కొంత సాయం చేసాడని తెలుస్తోంది.  కాదు, గబ్బర్ సింగ్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమై, ఎప్పుడు ముగుస్తుందో తెలియదు కనుక, అనుకున్న మొత్తం ముందే ఇచ్చేసాడని మరో రూమర్. ఏది నిజమో తెలియదు కానీ, గాలిపటం సినిమాకు వేరే పేరు దర్శకుడిగా వున్నా, సంపత్ నందే అన్నీ నిర్వహించాడని మాత్రం రూఢిగా వినిపిస్తోంది. పోనీ ఈ సినిమాతో అయినా సంపత్ నంది, కాస్త సంపద చేసుకుంటే మంచిదే.
23:48 - By Unknown 0

0 comments:

అలసి పోయిన పవన్ కళ్యాణ్- మూడో భార్యతో ?



హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా రాజకీయాల బాట పట్టి బిజీ బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. జన సేన పార్టీ స్థాపన, ఆ తర్వాత ఎన్నికల సమయంలో బీజేపీ, తెలుగు దేశం పార్టీల తరుపున ప్రచారం చేస్తూ గడిపారు. ఆ రెండు పార్టీలు అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ కష్టానికి తగిన ఫలితం లభించిందనే చెప్పొచ్చు. ఇలా వరుస పొలిటికల్ షెడ్యూల్స్‌‍తో అలిసి పోయిన పవన్ కళ్యాణ్ మళ్లీ....సినిమాల్లో బిజీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కాస్త రిలాక్స్ అయ్యేందుకు ఆయన ప్యారిస్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన వెంట మూడో భార్య అన్న, పిల్లలు కూడా వెళ్లినట్లు సమాచారం. అందుకే నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా హాజరు కాలేకపోయాడని టాక్. త్వరలో ఆయన ‘ఓ మై గాడ్' తెలుగు రీమేక్ షూటింగులో పాల్గొనబోతున్నారు. ‘ఓ మై గాడ్' తెలుగు వెర్షన్‌కు ‘దేవ దేవం భజే' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. గతంలో ‘జల్సా' చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చినట్లుగానే ‘దేవ దేవం భజే'చిత్రానికి కూడా మహేష్ బాబుతో వాయిస్ ఓవర్ ఇప్పించేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట. ఇలా చేస్తే సెంటిమెంటు కలిసొస్తుందని, జల్సా మాదిరిగా ఈ చిత్రం కూడా పెద్ద హిట్టవుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు మహేష్ బాబును ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. తెలుగు నేటివిటికి తగినట్లు ఈచిత్రాన్ని మార్పులు చేస్తున్నారు. అందులో భాగంగా ఒరిజనల్ లో ఉన్న పరేష్ రావెల్ పాత్ర కు ఇద్దరు పిల్లలు ఉంటే..ఇక్కడ వెంకటేష్ కి ఇద్దరు చెల్లెళ్లు ఉండేలా మార్చారని తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ గెటప్ సైతం పూర్తి మార్పుతో ఉంటుందని,దానిపై కసరత్తు జరిగిందని చెప్తున్నారు. మొదట వెంకటేష్ తో షూటింగ్ మొదలు పెట్టి తర్వాత పవన్ తో ఫినిష్ చేస్తారు. ఈ మేరకు ప్రత్యేకమైన వీధి సెట్ ని వేసారు. 'ఓ మై గాడ్‌'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.

20:38 - By Unknown 0

0 comments:

మంత్రి పదవే లక్ష్యంగా ఉదయభాను! కేసీఆర్, బాబులపై..



హైదరాబాద్: ఏంటి? ఇంకా యాంకర్ ఉదయభాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వలేనేలేదు అప్పుడే మంత్రి పదవి ఏమిటా? అని ఆలోచిస్తున్నారు. మీరు విన్నది నిజమే....అయితే ఆమె మంత్రి పదవి విషయం డైరెక్టుగా చెప్పలేదు కానీ, ఇండైరెక్టుగా వెల్లడించింది. భవిష్యత్‌లో మంత్రి స్థాయికి ఎదుగుతానని, ఎప్పటికైనా మంత్రి పదవి చేపడతాననే భావం ఆమె వ్యాఖ్యల్లో వ్యక్తమైంది. టీవీ నటి స్థాయి నుండి కేంద్ర మంత్రిగా ఎదిగిన స్మృతి ఇరానీ తన రోల్ మోడల్ అని ఉదయభాను అంటోంది. ‘ఎప్పటికైనా తాను ఆమె స్థాయికి ఎదుగుతాను, ఇది నా మనసులోని కోరిక. ఇటీవల నేను కేసీఆర్ గారిని కలిసాను. ఆయన నా యాంకరింగ్ ఎంతో బాగుంటుందని మెచ్చుకున్నారు. ఆయన మెచ్చుకోవడం గౌరవంగా భావిస్తున్నాను' అని ఉదయభాను వ్యాఖ్యానించారు. అదే విధంగా చంద్రబాబుపై కూడా ప్రశంసలు కురిపించారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. పలు హిందీ సీరియల్స్‌లో నటించిన స్మృతి ఇరానీ బుల్లితెరపై మంచి పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత బీజేపీలో చేరింది. తన టాలెంటుతో బీజేపీలో కీలక నేతగా ఎదిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీకి గట్టి పోటీ ఇచ్చింది. ఆమె ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ...నరేంద్ర మోడీ కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు. బుల్లితెరపై పాపులారిటీ సంపాదించిన ఉదయభాను కూడా అదే తరహాలో రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలని, మంత్రి పదవి చేపట్టే స్థాయికి ఎదగాలనే ఆశతో ఉన్నట్లు ఆమె వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆమె తన రాజకీయ బాటకు ఏ పార్టీని ఎంచుకుంటుంది? ప్రాంతీయ పార్టీలను ఎంచుకుంటుందా? లేక జాతీయ పార్టీలను ఎంచుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.


20:35 - By Unknown 0

0 comments:

రుణాలపై హామీలు అలా.. నోటీసులు ఇలా!


* రుణాలు రెన్యూవల్ చేసుకోవాలంటూ రైతులపై బ్యాంకుల ఒత్తిడి
బంగారం వేలం వేస్తామని ప్రకటనలు


అనంతపురం: చంద్రబాబు వచ్చారు... పంట రుణా లు మాఫీ చేస్తారని అన్నదాతలు ఎదురు చూస్తుంటే బ్యాంకర్లు మాత్రం రుణాలు రెన్యూవల్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏకంగా బ్యాంకుల వద్ద బోర్డులే పెడుతున్నారు. రుణాలు చెల్లించకపోతే బంగా రం వేలం వేస్తామంటూ నోటీసులిస్తున్నారు. అనంతపురం జిల్లా పుట్లూరులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ వద్ద ‘పంట రుణాలు రెన్యూవల్ చేయబడును’ అని నోటీస్ బోర్డులో అతికించారు. రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పారు కదా... మరీ నోటీస్ బోర్డులేమిటని రైతులు అడిగితే బ్యాంకు అధికారులనుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. రెన్యూవల్ చేసుకున్న రైతులకు రుణమాఫీ వర్తించకపోతే ఎలా? అని అడిగినా సమాధానంలేదు.
20:24 - By Unknown 0

0 comments:

హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు


 పోలవరం ఆర్డినెన్స్ వివాదాస్పదమేమీ కాదు
*  గత ప్రభుత్వ హామీనే అమలుచేశాం
*  కేంద్ర మంత్రి అశోక్‌గజపతి రాజు


సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును ఎన్టీయార్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చే విషయాన్ని పరిశీలిస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతి రాజు వెల్లడించారు. ప్రస్తుత డిమాండ్‌ను పరిశీలిస్తామని, అవకాశం ఉంటే మార్చేస్తామని చెప్పారు. ఆయన గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఉదయం, మళ్లీ సాయంత్రం మీడియాతో మాట్లాడారు.

ఆయనేమన్నారంటే...
బేగంపేట్ ఎయిర్‌పోర్టులో ఉన్నప్పుడు అంతర్జాతీయ టెర్మినల్‌కు రాజీవ్‌గాంధీ పేరు, దేశీయ టర్మినల్‌కు ఎన్టీఆర్ పేరుండేది. టీడీపీ హయాంలో శంషాబాద్‌లో కొత్త విమానాశ్రయం ఏర్పాటుచేసింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దానికి రాజీవ్‌గాంధీ పేరు పెట్టింది. పేరు మార్చాలని మహానాడులో డిమాండ్ వచ్చింది. డిమాండ్‌ను పరిశీలించి, అవకాశం ఉంటే మార్చేస్తాం.
   
పోలవరం ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌లో వివాదమేమీ లేదు. కొత్త విషయం అంతకన్నా లేదు.  పోల వరం స్వాతంత్య్రంనాటి నుంచి పెండింగ్‌లో ఉంది.
   
ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతామని గత ప్రభుత్వం పార్లమెంట్‌లో హామీ ఇచ్చింది. బీజేపీ కూడా దానికి మద్దతు ఇచ్చింది. అయితే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి ఆపేసి ఉండొచ్చు. తొలి కేబినెట్ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకున్నాం. దీన్ని కొందరు రాద్ధాంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇరు రాష్ట్రాలకు కాబోయే(డిజిగ్నేటెడ్) ముఖ్యమంత్రులను  పిలిచి చర్చ పెట్టాలంటే.. అపాయింటెడ్ డేను పోస్ట్‌పోన్ చేయాలి. కానీ అందుకు ప్రజలు ఇష్టపడకపోవచ్చు.


20:22 - By Unknown 0

0 comments:

Wednesday 28 May 2014

20 ఏళ్లలో గ్రహాంతరవాసుల జాడ


భూమికి ఆవల జీవం ఉందా? ఈ ప్రశ్నకు మీరు జవాబు తెలుసుకోవాలంటే మరో 20 ఏళ్లు ఆగాలంటున్నారు శాస్త్రవేత్తలు. భూమి కాకుండా కనీసం మరో ఆరు ప్రపంచాల్లో జీవరాశి ఉనికి ఉండే అవకాశం ఉందని, వాటిని కనుగొనేందుకు మహా అరుుతే మరో రెండు దశాబ్దాల సమయం మాత్రమే పట్టవచ్చునని చెబుతున్నారు. భూమికి ఆవల జీవానికి సంబంధించి శాస్త్రవేత్తలు మొత్తం మూడు పద్ధతుల్లో పరిశోధనలు కొనసాగిస్తున్నట్టు కాలిఫోర్నియూలోని ఓ సంస్థకు చెందిన సీనియర్ ఖగోళ శాస్త్రవేత్త సేథ్ షోస్టక్ తెలిపారు.

ఏమైనా ఇప్పటివరకు జరిగిన ప్రయత్నాలన్నీ అంగారకుడితో పాటు సౌరవ్యవస్థకు ఆవల జీవానికి అవకాశం ఉన్న చంద్రులపై మాత్రమే గ్రహాంతర వాసానికి సంబంధించిన అన్వేషణ కొనసాగిందని ‘డిస్కవరీ న్యూస్’ పేర్కొంది. అరుుతే మన సౌరవ్యవస్థలోనే జీవానికి అవకాశం ఉన్న కనీసం అర డజను ప్రపంచాలు ఉన్నాయని షోస్టక్ వివరించారు. వాటిని కనుగొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఒకవేళ అదే జరిగితే.. మరో 20 ఏళ్లలోగానే సాధ్యమయ్యే అవకాశం ఉందని వివరించారు.
 
20:06 - By Unknown 0

0 comments:

మోడీ అంకుల్.. మీ గిఫ్టు అదుర్స్!!


చాలాకాలం తర్వాత భారత్, పాక్ ప్రధానమంత్రులు కలిశారు. చేతులు కలుపుకొన్నారు. మనసు విప్పి మాట్లాడుకున్నారు. పర్యటన ముగించుకుని, తేలికపడ్డ మనసుతో నవాజ్ షరీఫ్ సొంత దేశానికి పయనమయ్యారు. అయితే.. ఇంటికి వచ్చిన అతిథులను ఉత్త చేతులతో పంపడం మన దేశ సంప్రదాయం కాదు. అందుకే నరేంద్రమోడీ ఆయనకు ఓ మంచి బహుమతి ఇచ్చారు. (చదవండి: మోడీని చూసి నవాజ్ షరీఫ్ భావోద్వేగం)

ఇద్దరి మధ్య తల్లికి సంబంధించిన విషయాల గురించి చర్చ వచ్చింది కాబట్టి, నవాజ్ షరీఫ్ తల్లికి ఓ మంచి శాలువాను మోడీ బహూకరించారు. తన తరఫున ఆమెకు ఇవ్వాలని కోరారు. ఆ గిఫ్టు చూసి నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం షరీఫ్ చాలా ఆనందపడిపోయింది. గిఫ్టు చాలా బాగుందని, తన తండ్రి ఆ అందమైన శాలువాను స్వయంగా తీసుకెళ్లి నాయనమ్మకు ఇచ్చారని ట్విట్టర్ ద్వారా తెలిపింది. అంతేకాదు, తన కామెంట్ తో పాటు ఆ బహుమతి ఫొటోను కూడా పెట్టింది.
 
06:59 - By Unknown 0

0 comments:

అక్కడ చంద్రబాబుపై జగన్‌దే విజయం

సీమాంధ్రలో తేదేపా ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీమాంధ్రకు ముఖ్యమంత్రి అవనున్నారు. అయితే మూడు విషయాల్లో మాత్రం చంద్రబాబుపై జగన్‌దే పై చేయి అయ్యింది. ఆ మూడు విషయాల్లో మాత్రం జగన్‌ చంద్రబాబుపై తన ఆధిపత్యం సాధించారు.

 

పులివెందుల అసెంబ్లీ నుంచి జగన్‌ 75 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కాగా చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం నుంచి పాత మెజార్టీ కంటే తక్కువగా కేవలం 47 వేల ఓట్ల ఆధిక్యంతో మాత్రమే విజయం సాధించారు. ఇక్కడ చంద్రబాబు కంటే జగన్‌దే పై చేయి అయ్యింది. అలాగే జగన్‌ తన సొంత జిల్లా కడపలో రెండు పార్లమెంటు స్థానాలతో పాటు పది అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది గెలిపించుకున్నాడు. ఇక్కడ కూడా చంద్రబాబుపై జగన్‌దే పైచేయి అయ్యింది.

 

ఇక చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో 14 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు చెరో ఎంపీ గెలుచుకోగా వైకాపా 9 ఎమ్మెల్యే స్థానాలు వస్తే, తేదేపా కేవలం 5 స్థానాలకే పరిమితమైంది. ఇక్కడ కూడా జగన్‌దే పైచేయి అయ్యింది. ఇలా సీమాంధ్రలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నా తన సొంత జిల్లాతో పాటు, జగన్‌ సొంత జిల్లాలోను, వ్యక్తిగతంగా సొంత నియోజకవర్గంలోను జగన్‌ కంటే వెనుకపడే ఉన్నారు. ఇలా మూడు సార్లు కూడా చంద్రబాబుపై జగన్‌ తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు.

 

02:33 - By Unknown 0

0 comments:

Tuesday 27 May 2014

బాలయ్యే స్వయంగా రంగంలోకి దిగి ఒప్పించాడా?


 హైదరాబాద్: తన సినిమాకు సంభందించిన విషయాల్లో బాలకృష్ణ ఎప్పుడూ తనవంతు సాయిం చేయటానికి ముందుంటారు. ఆయన తన ప్రక్కన హీరోయిన్ గా చేయటానికి స్వయంగా త్రిషకు ఫోన్ చేసి ఒప్పించారని ఫిల్మ్ నగర్ సమాచారం. త్రిష మొదట రెమ్యునేషన్ విషయంలో పేచి పెట్టిందని, బాలకృష్ణ కలగచేసుకుని ఫైనల్ చేసారని చెప్తున్నారు. త్రిష...ఈ మధ్య కాలంలో తెలుగులో నటించలేదు. అయితే ఈ చిత్రంలో చేస్తున్నానని త్రిష ...ట్విట్టర్ ద్వారా ఖరారు చేసింది. త్రిష ట్వీట్ చేస్తూ... లెజండ్ తో తెర పంచుకుంటున్నందకు చాలా ఆనందంగా ఉంది అన్నదామె.  గతకొంతకాలంగా ఎన్నికల హడావుడిలో ఉన్న నందమూరి బాలకృష్ణ త్వరలో ముఖానికి రంగేసుకోవడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నూతన దర్శకుడు సత్యదేవా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది.ఈ సినిమాను వచ్చే నెల 2న హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభిస్తారు. రుద్రపాటి రమణారావు నిర్మాతగా వ్యవహరిస్తారు. ఇందులో బాలకృష్ణ సరసన త్రిషను ఎంపిక చేశారు. ''బాలకృష్ణ నుంచి రాబోతున్న మరో పవర్‌ఫుల్‌ చిత్రమిది. దర్శకుడు మంచి కథను సిద్ధం చేశారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి'' అంటున్నారు నిర్మాతలు. తొలుత ఈ పాత్రలో అంజలిని అనుకున్నా తర్వాత నిర్ణయం మారింది. సత్యదేవ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు. బాలకృష్ణ జన్మదినం సందర్భంగా జూన్‌ 10న సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో మణిశర్మ,బాలకృష్ణ కాంబినేషన్ లో నరసింహనాయుడు, సమరసింహా రెడ్డి, లక్ష్మీ నరసింహా వంటి చిత్రాలు వచ్చి మ్యూజికల్ గానూ విజయవంతమయ్యాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ తో ఈ చిత్రం రెడీ అవుతోందని సమాచారం. ''బాలకృష్ణ శైలికి తగ్గ కథ ఇది. కుటుంబ అనుబంధాలతోపాటు అభిమానుల్ని అలరించే అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి. సాంకేతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ భారీ వ్యయంతో రూపొందించబోతున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే తెలియజేస్తాము''అని నిర్మాతలు తెలిపారు.
22:50 - By Unknown 0

0 comments:

చంద్రబాబు మంచి రాజధాని నిర్మిస్తారు


హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నానని, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు మంచి రాజధానిని నిర్మించగలరని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు అన్నారు. తెలుగు ప్రజలు అభివృద్ధిలో పోటీపడాలని, విద్వేషాలు పెంచుకోవడం ఏ ఒక్కరికీ మంచిది కాదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన వేళ గిల్లికజ్జాలు పెట్టుకొనే సమయం, ఆసక్తి తమకు లేవని చెప్పారు. తమది బిజినెస్ ఫ్రెండ్లీ సర్కారు అని తెలిపారు. తెలంగాణ బిల్డర్ల సమాఖ్య(టీబీఎఫ్) ఆధ్వర్యంలో మంగళవారమిక్కడ జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమాఖ్య రిజిస్ట్రేషన్ బాండ్‌ను ఆవిష్కరించారు. ఇది సంధికాలమని, విభజన నేపథ్యంలో ఏమవుతుందో అన్న ఆందోళన బిల్డర్లతో పాటు తమకూ ఉందని ఆయన అన్నారు. కొత్తగా పెళ్లయినప్పటి మనఃస్థితి ఇదని, అయితే కొన్ని రోజుల్లో సమస్యలు సద్దుమణుగుతాయని కెటిఆర్ అన్నారు. మునుపటి కంటే పది రెట్ల అభివృద్ధిని, అంతకంటే ఎక్కువ స్వేచ్ఛని హైదరాబాద్ అనుభవిస్తుందన్నారు. ఈ పరిస్థితుల్లో ఇళ్లు కొనుక్కోవాలనుకుంటే మూడు నెలల్లో ఆ పని చేయాలని, ఆ తరువాత కొనాలన్నా దొరకవని వ్యాఖ్యానించారు. ప్రణాళికాబద్ధంగా రాజధానిని విస్తరిస్తామని, అడ్డగోలు అనుమతుల వల్ల ప్రజలు నరకాన్ని అనుభవిస్తున్నారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వంలో పట్ణణాభివృద్ధి, పురపాలక శాఖలే కీలకమని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు. అన్ని ప్రాంతాల ప్రజల భద్రత ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామంటే 'హైదరాబాద్ సిర్ఫ్ హమారా' నినాదం ఇచ్చామని, కానీ, రాజధాని అందరిదని, ఇది విశ్వనగరమని చెప్పారు. తెలంగాణలోని ఐదు జిల్లాలకు విస్తరించిన హైదరాబాద్ అభివృద్ధి చెందితే సగం రాష్ట్రం వెలిగిపోయినట్టేనని వివరించారు. కావేరి జలాలపై కర్ణాటక-తమిళనాడుల మధ్య గొడవ జరుగుతున్నట్లే, తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాల మధ్య పోలవరం వివాదం కానుందని చెప్పారు. అయితే, ఈ సమస్య ప్రభుత్వాలకే పరిమితమని స్పష్టం చేశారు.
22:42 - By Unknown 0

0 comments:

అఖిల్ నాకు పోటీ అవుతాడు..అవ్వాలి కూడా : నాగ చైతన్య

‘నిజంగా ‘మనం’ సినిమా తాతయ్యకు ఘనమైన నివాళి. అవార్డుల కోసమో, రివార్డుల కోసమో మేమీ సినిమా చేయలేదు. తాతయ్య చివరి సినిమా అక్కినేని వంశాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనే తలంపుతో ఈ సినిమా చేశాం. అమెరికాలో అయితే.. ఇప్పటికే మిలియన్ (పది లక్షల) డాలర్ల వసూళ్లు వచ్చాయి. మా కుటుంబ హీరోల చిత్రాల్లో ఇంతటి వసూళ్లను రాబట్టిన సినిమా ఇదే’’ అని నాగ చైతన్య సంతోషం వెలిబుచ్చారు. మంగళవారం విలేకర్లతో ముచ్చటించారు.
 

 మీ తాతయ్యతో, మీ నాన్నతో తొలిసారి కలిసి నటించారు కదా. ఆ అనుభూతి ఎలా ఉంది?
 నాకు వంద ఫ్లాపులొచ్చినా, వంద విజయాలొచ్చినా.. ‘మనం’ మాత్రం నా కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా. తాతయ్యతో నటించే భాగ్యం ఈ సినిమాతో నాకు దక్కింది. ఆ మధుర క్షణాలు నా గుండెలో నిలిచిపోతాయి. భవిష్యత్తులో నా ఉన్నతికి అవి మరింత దోహదం చేస్తాయి. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యేంత వరకూ నాన్నతో, తాతయ్యతో కలిసి నటించడానికి తడబడుతూనే ఉన్నాను. తలబిరుసుగా నటించాలి, తాగుబోతుగా నటించాలి. పైగా కొన్ని సన్నివేశాల్లో తాతయ్యను ‘ముసలోడా’ అని సంబోధించడానికి ఇబ్బంది పడ్డా. తాతయ్య, నాన్న నా రోల్ మోడల్స్. వారి ముందు అలా నటించడం చాలా కష్టంగా అనిపించింది. కానీ వారిద్దరి సహకారం అద్భుతం.
 
 పవన్‌కల్యాణ్‌కి ‘ఖుషి’, మహేశ్‌కి ‘ఒక్కడు’, ఎన్టీఆర్‌కి ‘సింహాద్రి’, బన్నీకి ‘దేశముదురు’... మీకేమో ‘మనం’... ఇలా స్టార్ హీరోలందరికీ ఏడో సినిమా బ్రేక్ ఇచ్చింది. మీరేమంటారు?
 అది యాదృచ్ఛికమే. నాక్కూడా అదే రిపీట్ అవ్వడం ఆనందంగా ఉంది.
 
 తాత ‘మూగ మనసులు’, నాన్న ‘జానకిరాముడు’, మీరేమో ‘మనం’... ముగ్గురూ పునర్జన్మల నేపథ్యంతో కూడిన సినిమాలు చేయడం కూడా యాదృచ్ఛికమే కదా!
 అవును... అది కూడా కావాలని చేసిందేం కాదు. అయితే.. ‘మనం’ చేశాక పునర్జన్మ విషయంలో కొంత నిజం ఉందనిపిస్తోంది. గత జన్మలో తీరని కోర్కెలు ఏమైనా ఉంటే...మళ్లీ పుట్టి ఆ కోర్కెలను తీర్చుకుంటారని కొన్ని కథలు కూడా వెలువడ్డాయి.
 
 ప్రయోగాల్నిమన హీరోలు దరిచేరనీయరు. ఓ హీరోగా ఈ విషయంపై మీ దృక్కోణం ఏంటి?
 నా మైండ్‌సెట్‌లో కొంత మార్పు వచ్చిందండీ. ప్రయోగాల్ని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. సరైన కథ, కథనాలు, ఆసక్తిని గొలిపే అంశాలు, పుష్కలంగా వినోదం ఉంటే.. ప్రయోగాలు కూడా సఫలం అవుతాయని ‘మనం’ రుజువు చేసింది. ఇక నుంచి కూడా ప్రయోగాత్మక చిత్రాలు చేయాలని ఉంది. కెరీర్ మొదట్లో తాతయ్య, నాన్న కూడా ప్రయోగాత్మక చిత్రాల్లో నటించారు. పాత్రల పరంగా కూడా భిన్నంగా వెళ్ళారు. వారితో పోల్చి చూస్తే... నేను జీరో. కెరీర్ మొదట్లో నేను కమర్షియల్ సినిమాలే ఎక్కువగా చేశా. ఇక నుంచి వారి దారిలోనే పయనించాలని నిర్ణయించుకున్నాను.
 
 ‘ఆటోనగర్ సూర్య’ సంగతేంటి?
 ఆ సినిమా జాప్యం విషయంలో నా ప్రమేయం లేదు. కొన్ని కారణాల వల్ల అది ఆలస్యమవుతోంది. అయితే... ఒకటి మాత్రం నిజం. ఆ సినిమా ఎప్పుడు విడుదలైనా హిట్టే.
 
 మీరు చేస్తున్న ‘ఒక లైలా కోసం’ సినిమా ప్రొడక్షన్ పనులు కూడా మీరే చూసుకుంటున్నారట?
 సినీ నిర్మాణంలో కూడా అనుభవం అవసరమని నాన్న చెప్పారు. అందుకే.. ఆ సినిమా ప్రొడక్షన్ పనులు దగ్గరుండి చూసుకుంటున్నా. టాకీ పూర్తయ్యింది. పాటల చిత్రీకరణకు విదేశాలకు వెళ్తున్నాం. జూలై లేదా ఆగస్ట్‌లో విడుదల చేస్తాం. భవిష్యత్తులో సినిమాలు నిర్మించాలని కూడా ఉంది.
 
 ‘మనం’లో అఖిల్ ఇంట్రడక్షన్ అదిరిపోయింది అంటున్నారు అందరూ. మరి, మీ అభిప్రాయం ఏమిటి?
 నిజమే.. అఖిల్ ఎంట్రీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. నిజానికి స్క్రిప్ట్ టైమ్‌లో ఆ సీన్ లేదు. అఖిల్ కూడా ఉంటే బావుంటుందని విక్రమ్‌కుమార్ అనడంతో అందరం ‘ఓకే’ చేశాం. కథలో ఆ సీన్‌కి మంచి ప్రాముఖ్యత ఉంది. మా అందర్నీ అఖిలే రక్షిస్తాడు. నిజంగా తనకు అది గ్రేట్ ఇంట్రడక్షన్. అలాంటి పరిచయం లభించడం చాలా లక్కీ అని నేనే అఖిల్‌తో చెప్పా.
 
 అంటే భవిష్యత్తులో అఖిల్ మీకు పోటీ అవ్వబోతున్నాడన్నమాట?
 అవుతాడండీ... ఎందుకవడు? అవ్వాలి కూడా. అసలు సినిమా అంటేనే పోటీ. అయితే ఆ పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి. మీరన్నట్టు మా కుటుంబంలోనే నాకు కావాల్సినంత పోటీ ఉంది.
 
 కెరీర్ విషయంలో అఖిల్‌కు ఏమైనా సలహాలిస్తుంటారా?
 నేను సలహాలివ్వడం కాదు, తనే నాకు సలహాలిస్తుంటాడు (నవ్వుతూ).
 
 సుధీర్‌వర్మ దర్శకత్వంలో సినిమా ఎప్పుడు?
 జూలైలో మొదలవుతుంది. కొత్త పంథాలో సాగే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అది. సుధీర్ ‘స్వామి రారా’ సినిమా నాకు నచ్చింది. అదే పంథాలో సినిమా చేయడం ఆనందంగా ఉంది.
 
22:28 - By Unknown 0

0 comments:

ఇప్పుడేమంటారు తమ్ముళ్లూ!


కర్నూలు: టీడీపీ వ్యూహం బెడిసికొట్టింది. ఆ పార్టీ నేతలు సాగిస్తున్న మైండ్‌గేమ్‌కు తెరపడింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదంటూ ఆ పార్టీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, కేంద్ర కమిటీ సభ్యుడు ఎదురూరు విష్ణువర్దన్‌రెడ్డితో పాటు కొందరు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు మంగళవారం తేల్చి చెప్పారు. వీరి ప్రకటనలో తమ్ముళ్ల నోళ్లకు తాళం పడినట్లయింది. జిల్లాలో ఓటమిని జీర్ణించుకోలేక టీడీపీ నేతలు కొందరు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు సరికొత్త డ్రామాకు తెరతీశారు. అందులో భాగంగానే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వారి మాయలో పడ్డారు. ఆ పార్టీ ప్రలోభాలకు తలొగ్గి పచ్చకండువా కప్పుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.

 ప్రజా తీర్పును అగౌరవపరిచారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుకను సైతం పార్టీ మారాలంటూ గందరగోళానికి గురిచేశారు. రాజకీయాలకు కొత్త కావడంతో ఆమె కూడా తడబడ్డారు. తప్పు చేసినట్లు తెలుసుకునే లోపు టీడీపీలో చేరిపోయినట్లు ప్రచారం జరిగిపోయింది. ఇదంతా కుట్రపూరితమేనని బుట్టా రేణుక ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ డ్రామాకు శుభం కార్డు వేశారు. రాజకీయ ఎదుగుదలకు అవకాశం కల్పించిన వైఎస్‌ఆర్‌సీపీలోనే కొనసాగుతానని ఆమె తేల్చి చెప్పారు. పార్టీ కోసం పనిచేస్తూ.. కర్నూలు పార్లమెంట్ పరిధిలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు.

 తప్పుడు ప్రచారం మానుకోవాలి: తనపై టీడీపీ శ్రేణులు సాగిస్తున్న తప్పుడు ప్రచారాన్ని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు విష్ణువర్దన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వారెళ్లారు.. వీరెళ్తున్నారంటూ తమ్ముళ్లు సాగిస్తున్న తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదన్నారు. కర్నూలు, గూడూరు, సి.బెళగల్ మండలాల జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో మంగళవారం కర్నూలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తామంతా వైఎస్‌ఆర్‌సీపీలోనే కొనసాగుతామంటూ స్పష్టం చేశారు. అదేవిధంగా జిల్లాలోని పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు సైతం ఆయా ప్రాంతాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పార్టీ వీడబోమంటూ ప్రకటించారు. టీడీపీ నేతల అసత్య ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.జిల్లాలో అపరిష్కృత సమస్యలపై పోరుకు అధికార టీడీపీ నేతలు కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు పిలుపునిచ్చారు. మైండ్‌గేమ్‌ను పక్కనపెట్టి ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని వారు హితవు పలికారు.
22:26 - By Unknown 0

0 comments:

ఏడాదిలోపే టీడీపీకి అధికారం గల్లంతు


నెల్లూరు : తెలుగుదేశం పార్టీ ఏడాదిలోపే అధికారం కోల్పోవడం ఖాయమని కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు.  2015 ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరులోపు టీడీపీ ప్రభుత్వం పతనం కాయమన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు అవి నెరవేర్చే అవకాశం లేదన్నారు. బాబుకు ఓట్లు ఎందుకు వేశామా... అని ప్రజలు ఇప్పటికే బాధపడుతున్నారన్నారు. చంద్రబాబు జిత్తులమారి నక్క అని ఎద్దేవా చేశారు.

 ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రసక్తే లేకపోవడంతో గ్రామాల్లోకి వచ్చే ఎమ్మెల్యేలపై ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తారని నల్లపరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. మధ్యంతర ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
22:24 - By Unknown 0

0 comments:

Friday 23 May 2014

కేసీఆర్... ప్రేలాపనలు మానుకో!

చెప్పుడు మాటలు విని తప్పుడు మాటలు
వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదు
ఉద్యోగులకు అండగా ఉంటాం: చంద్రబాబు



హైదరాబాద్, మే 23: 'కేసీఆర్ అసందర్భ ప్రేలాపనలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చెప్పుడు మాటలు విని తప్పుడు మాటలు మాట్లాడటం రాష్ట్రానికి సీఎం అయ్యే వ్యక్తికి తగదు' అని టీడీపీ అధినేత, సీమాంధ్ర కాబోయే సీఎం చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల విభజన విషయమై తెలంగాణకు కాబోయే సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సీమాంధ్ర ఉద్యోగులను సచివాలయం గేటు దాటనివ్వం.. కాలు దువ్వితే కొట్లాటకైనా రెడీ వంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఉద్యమాన్ని భావోద్వేగాలతో ముడిపెట్టి సీట్లు, ఓట్లు సంపాదించుకున్నది చాలక అన్నదమ్ముల మధ్య కీచులాటలు, శాశ్వత వైరుధ్యం సృష్టించే విధంగా కేసీఆర్ వ్యవహరించడం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ఉద్యోగుల విభజన జరుగుతున్నప్పుడు సమగ్ర సమాచారం లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. సీఎం స్థాయి వ్యక్తి శాంతిభద్రతల సమస్య తలెత్తేలా మాట్లాడటం సరైనది కాదన్నారు. ఉద్యోగులందరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆయన ప్రకటించారు.
కాగా, శుక్రవారం ఉదయం సీఎస్ పీకే మహంతి నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం చంద్రబాబు నాయుడిని కలిసింది. రాష్ట్ర విభజనను దృష్టిలో పెట్టుకొని ఇరు రాష్ట్రాలకు చేసిన ఉద్యోగుల కేటాయింపులన్నీ పూర్తిగా తాత్కాలికమేనని వివరించింది. విభజనకు సంబంధించి జరుగుతున్న కసరత్తు, ఆర్థికఅంశాలను ఈ సందర్భంగా వారు వివరించారు. 'రెండు ప్రభుత్వాలు ఏర్పాటై పూర్తి స్థాయిలో పనిచేసేంత వరకూ తాత్కాలిక ఏర్పాటుగా మాత్రమే ప్రస్తుతం ఉద్యోగుల కేటాయింపులు జరిపాం. ఇరు ప్రభుత్వాలు తర్వాత ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసుకొని ఈ కేటాయింపులు మార్చుకోవచ్చు. ఉదాహరణకు న్యాయ శాఖలో తెలంగాణ ప్రాంత ఉద్యోగులు మరీ తక్కువ ఉన్నారు. పని నడవడం కోసం అక్కడ సీమాంధ్ర ప్రాంతం వారిని తెలంగాణకు తాత్కాలికంగా కేటాయించాం. మరో శాఖలో సీమాంధ్ర ప్రాంతం వారు చాలినంత మంది లేకపోతే తెలంగాణవారిని వేశాం. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా తెలంగాణ ప్రాంత వాసి ఉన్నారు. మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా ఆంధ్ర ప్రాంత వాసి ఉన్నారు. త్వరలో ఏర్పడనున్న ప్రభుత్వాలు వారిని మార్చుకోవచ్చు. ఇది కూడా ఉద్యోగ సంఘాలకు ముందుగా చెప్పే చేశాం. మేం రహస్యంగా చేసిందేమీ లేదు' అని ఒక అధికారి బాబుకు చెప్పారు.
ఉద్యోగుల స్థానికత నిర్ణయించే ముందు అన్నీ చూసుకొనే చేశామని, ఇది తెలిసి కూడా కొందరు నాయకులు కావాలని బురద చల్లుతున్నారని మరో అధికారి చెప్పారు. 'రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 11 లక్షల మంది ఉద్యోగుల వివరాలు అన్నీ పూర్తి స్థాయిలో కంఫ్యూటర్లలో ఉన్నాయి. వాటిని ఎవరూ మార్చలేరు. ఉద్యోగుల సర్వీస్ రిజిష్టర్లపై గతంలో గిర్‌గ్లానీ కమిషన్ పరిశీలన జరిపి ఎవరు ఏ ప్రాంతమో స్టాంపు కూడా వేసింది. ఆ వివరాలన్నీ కంప్యూటర్లలో ఎక్కించాం. దాని ప్రకారమే మేం నిర్ణయాలు తీసుకొంటున్నాం' అని ఆయన చెప్పారు. ఏ వివరాలైనా పారదర్శకంగా అందరికీ అందించి బహిరంగంగా చేయాలని, వివాదాలు వద్దని బాబు వారికి సూచించారు. 'ఎవరో ఏదో కమిటీలు వేసి పరిశీలన జరిపి వివరాలు బయట పెడతామంటున్నారు. వారికి ఎవరికో ఆ అవకాశం ఇవ్వడం ఎందుకు? మీ వద్ద ఉన్న వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పెట్టండి. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు చేయండి. వివాదాలకు తావివ్వవద్దు' అని బాబు అధికారులకు స్పష్టం చేశారు.

15:37 - By Unknown 0

0 comments:

ఆరేళ్లప్పుడు వేధింపులకు...పన్నెండేళ్లప్పుడు అత్యాచారానికి గురయ్యా!

‘లైంగిక వేధింపులు చేసేవాళ్లను క్షమించకూడదు. అలాంటివాళ్లు మనిషి రూపంలో ఉన్న మృగాలు’’ అని ఘాటుగా స్పందించారు పమేలా ఆండర్‌సన్. ఈ హాలీవుడ్ హాట్ లేడీ ఇటీవల ఓ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన గతాన్ని గుర్తు చేసుకుంటూ, ఆరేళ్ల వయసులోనే తాను లైంగిక వేధింపులకు గురయ్యానని పేర్కొన్నారు. ఇంకా అనేక విషయాలను పంచుకుంటూ - ‘‘నా చిన్నప్పుడు నన్ను చూసుకోవడానికి ఒకావిడ ఉండేది. మావాళ్లు లేని సమయంలో తను ఏదో చేసేది. నాకేమీ అర్థమయ్యేది కాదు. పెద్దయిన తర్వాతే ఆమె చేష్టలకు అర్థం తెలిసింది.
 

 ఇక, పన్నెండేళ్ల వయసులో జరిగిన రెండు ఘోరాలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.  ఒకరోజు నా స్నేహితురాలి బోయ్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లాను. అతని అన్నయ్య ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. అదను చూసి అతను నా మీద అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఓ సందర్భంలో కొంతమంది నాపై సామూహిక అత్యాచారం జరిపారు. ఆ వయసులో ఆ విషయాన్ని బయటకు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాను... భయపడ్డాను కూడా. ఎక్కడ నన్ను తప్పుపడతారోనని నా సందేహం. కానీ, అప్పుడు మౌనం వహించడం తప్పు అని ఇప్పటికీ పశ్చాత్తాపపడుతున్నా. అందుకే, అంటున్నా అత్యాచారానికి గురైనవాళ్లు మౌనంగా ఉండకూడదు. న్యాయం కోసం ఏ స్థాయికైనా వెళ్లి, పోరాడాలి. సరైన శిక్ష పడేలా చేస్తే, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడాలనుకునేవారి సంఖ్య తగ్గుతుంది’’ అన్నారు పమేలా ఆండర్సన్.
 
15:23 - By Unknown 0

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top