Contact

Text

Thursday 22 May 2014

నాజర్ కుమారుడికి తీవ్ర గాయాలు

06:08 - By Unknown 0

చెన్నై : ప్రముఖ సినీ నటుడు నాజర్ కుమారుడు ఎన్. అబ్దులు అసన్ ఫైజల్ (23) గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఫైజల్ అతడి  నలుగురు స్నేహితులు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ఫైజల్ స్నేహితులు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఫైజల్ తోపాటు మరో స్నేహితుడు కూడా ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అదే రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.
 

పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఫైజల్ తోపాటు అతడి స్నేహితుడిని నగరంలోని చెట్టినాడు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారిద్దరికి శస్త్ర చికిత్స నిర్వహిస్తున్నారు. ఫైజల్ ప్రమాదంపై సమాచారం అందుకుకున్న నాజర్ కుటుంబ సభ్యులు చెట్టినాడు ఆసుపత్రికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top