Contact

Text

Wednesday 30 April 2014

వైఎస్సార్ సీపీకి జనసేన నేతల మద్దతు

కొవ్వూరుటౌన్/ భీమవరం అర్భన్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీకి మద్దతు తెలుపుతున్నట్టు కొవ్వూరు, భీమవరం పట్టణాల్లోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రకటించారు.మంగళవారం పెరవలిలో జనసేన కార్యకర్తలు నిడదవోలు వైఎస్సార్ సీపీ అభ్యర్థి రాజీవ్ కృష్ణకు సంఘీభావం ప్రకటించగా బుధవారం కొవ్వూరు, భీమవరంలో ఆ పార్టీ నేతలు వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు మద్దతు తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గ జనసేన యూత్ వైఎస్సార్ సీపీ పార్లమెంటు, ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నట్టు పవన్ కల్యాణ్ రిజిస్టర్డ్ ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షుడు గంటా చిరంజీవి బుధవారం ప్రకటించారు.


 
ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పరిమి హరిచరణ్ తదితర నాయకుల సమక్షంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో సమాజంలోని అన్ని వర్గాలకు మేలు చేసేదిగా ఉందని చిరంజీవి చెప్పారు. చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండి పట్టాభి రామారావు, జనసేన యూత్ డేగల రాము, అల్లు శ్రీను, నాయుడు బాబ్జి, ఆవుల వాసు, ముత్యాల సాయి, మహరాజు వాసు, కళ్లేపల్లి శ్రీను, మట్టా సతీష్ పాల్గొన్నారు.
23:52 - By Unknown 0

0 comments:

'వైఎస్ఆర్ సీపీకి 135 నుంచి 140 స్థానాలు'

ప్రొద్దుటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి గురువారం ప్రొద్దుటూరులో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారం చేపడుతుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 135 నుంచి 140 స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.



ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతితో పాటు వైఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు, బద్వేల్, కడప నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగనుంది. 1వ తేదీన ప్రొద్దుటూరు, 2వ తేదీ బద్వేల్, 3వ తేదీ కడప నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
23:43 - By Unknown 0

0 comments:

చెన్నై రైల్వేస్టేషన్లో బాంబు పేలుడు

చెన్నై : చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ లో గురువారం బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, పదిమంది గాయపడినట్లు సమాచారం. రైల్వే స్టేషన్ లోని 9వ నెంబర్ ఫ్లాట్ ఫామ్ పై నిలిచి ఉన్న (త్రివేండ్రం నుంచి గౌహతి వెళుతున్న) గౌహతి ఎక్స్ ప్రెస్ ఎస్ -5 బోగీలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు.  ఈ పేలుడు ఉదయం 7.20 నిమిషాలకు జరిగింది.



క్షతగాత్రులను చికిత్స నిమిత్తం  రైల్వే పోలీసులు అంబులెన్స్ లో రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు పేలుడు నేపథ్యంలో తాత్కాలికంగా రైళ్ల సర్వీసులను నిలిపివేశారు. కాగా పేలుడు గల కారణాలు తెలియరాలేదు.
23:39 - By Unknown 0

0 comments:

Hot Heroine says How to use your finger



00:50 - By Unknown 0

0 comments:

Rana Heroine Hot Pics





00:43 - By Unknown 0

0 comments:

Samantha B'Day Celebrations








00:33 - By Unknown 0

0 comments:

Tuesday 29 April 2014

మోస్ట్‌ ఫిట్‌నెస్డ్‌ మ్యాన్‌ సల్మాన్‌ఖాన్‌



బాలీవుడ్‌  కండలవీరుల కాంపిటీన్‌లో సల్మాన్‌ మరోసారి మొదటిస్థానంలో నిలి చాడు. హృతిక్‌, రణవీర్‌, షాహిద్‌, అర్జున్‌ రాంపాల్‌ను వెనక్కినెట్టి తాను ఈ రేసులో  విజేతగా నిలిచాడు. హెల్త్‌ అండ వెల్‌నెస్‌ అనే సంస్థ బాలీవ్ఞడ్‌లో మోస్ట్‌ ఫిట్‌నెస్డ్‌ మ్యాన్‌ ఎవరంటూ ఓ సర్వే నిర్వహించిం ది. ఇందులో మొత్తం 30 వేల మంది పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తంచేశా రు. అయితే సల్మా న్‌కు 43.26 శాతం మంది ఓటేసి విజే తగా నిలిపారు. కొద్ది తేడాలో 42.81 శాతం ఓట్లతో హృతిక్‌ రెండో స్థానంలో నిలిచారు. ఈ కాంపిటీష న్‌లో మిగిలిన వారికి నామమాత్రమైన ఓట్లు మాత్రమే వచ్చాయి. కొత్తగా బాలీవ్ఞ డ్‌లోకి ఎంతో మంది సిక్స్‌ప్యాక్‌ కండల వీరులు వచ్చి నా సల్మాన్‌ మాత్రం తన నెం.1 స్థానం నిలబెట్టుకోవడం గమనార్హం. వయసుమీరుతున్నా సల్మాన్‌్‌ మాత్రం తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం విశేషం.
23:55 - By Unknown 0

0 comments:

టీడీపీపై నాకు ప్రేమలేదు: పవన్ కల్యాణ్


నిజామాబాద్ : తెలుగుదేశం పార్టీపై తనకు ఎలాంటి ప్రేమ లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం నిజామాబాద్ లో మాట్లాడుతూ టీడీపీపై ఎన్నో పోరాటాలు చేశానని, టీడీపీ పాలనలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు.
నరేంద్ర మోడీ కోసమే తాను ప్రచారానికి వచ్చానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బంగారు తెలంగాణ సాధనకు కేంద్రం ఆసరా కావాలని ఆయన అన్నారు.
23:29 - By Unknown 0

0 comments:

మోడీ భార్య అక్రమ నిర్బంధం!


న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ భార్య యశోదాబెన్‌ను గుర్తుతెలియని ప్రదేశంలో అక్రమంగా నిర్బంధించారనే తీవ్ర ఆందోళనతో కూడిన అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఆమె ప్రాణాలకు ముప్పు పొంచివుందని, ఆమె అసలు జీవించి ఉందో లేదో దర్యాప్తు జరిపించాలని కోరుతూ మీరట్‌కు చెందిన హరిశంకర్ అనే న్యాయవాది భారత ప్రధాన న్యాయమూర్తి, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలకు లేఖ రాశారు. శంకర్ రాసిన లేఖ ఈ నెల 25వ తేదీన తమకు అందిందని ఢిల్లీ హైకోర్టు వర్గాలు ధృవీకరించాయి.‘‘కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు గుజరాత్‌కు చెందిన ఉన్నతస్థాయి భద్రతా సిబ్బందితో కుమ్మక్కై యశోదాబెన్‌ను అపహరించి, గుర్తుతెలియని ప్రదేశంలో అక్రమంగా నిర్బంధించినట్లు కనిపిస్తోంది.

ఆమె ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. యశోదాబెన్ ప్రాణం, స్వేచ్ఛ, భద్రత, రక్షణ అంశాలపై తక్షణం జోక్యం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం.లోధా, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణిలకు రాసిన లేఖలో శంకర్ కోరారు. యశోదాబెన్‌ను నరేంద్రమోడీ వివాహమాడారని తొలిసారిగా బయటకు తెలిసిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ‘‘ఆమె గుజ రాత్‌లోని రాజోస్నా గ్రామంలో ఉండగా కొన్ని చానళ్లు చూపించాయి. ఆమె ఇంటర్వ్యూను కూడా రికార్డు చేశాయి. కానీ అకస్మాత్తుగా ఆమె అదృశ్యమయ్యారు. ఆమె ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అనే విషయాలు చాలా రోజులుగా తెలియటం లేదు’’ అని పేర్కొన్నారు.

 మోడీ గత కొద్ది రోజుల వరకూ తన వైవాహిక స్థితిపై మౌనంగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల వదోదర లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేయటానికి నామినేషన్లు సమర్పిస్తూ తన అఫిడవిట్‌లో తాను వివాహితుడినని, తన భార్య పేరు యశోదాబెన్ అని వెల్లడించిన విషయం విదితమే.
 
23:22 - By Unknown 0

0 comments:

నేనున్నాగా.. కొట్టండి.. చెప్పుతో కొట్టండి

 
 హనుమాన్ జంక్షన్ నేను ఉన్నాగా.. కొట్టండి... చెప్పుతో కొట్టండి...’అంటూ కృష్ణా జిల్లాలోని గన్నవరం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ బాహాటంగానే పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. నియోజకవర్గ పరిధిలోని కొత్త మల్లవల్లిలో మంగళవారం టీడీపీ కార్యకర్తలు చేసిన ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నలుగురు, ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. కొత్త మల్లవల్లిలో వంశీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా అదే గ్రామానికి చెందిన కొందరు గన్నవరంలో జరిగిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ సభకు హాజరై ఆటోలో తిరిగివస్తున్నారు.

వంశీ ప్రచారాన్ని గమనించి.. ఆ ఆటోను మరో మార్గంలోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తుండగా టీడీపీ కార్యకర్తలు వారిని దూషించారు. దీంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రచార వాహనంపై ఉన్న వంశీ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ... ‘నేనున్నానుగా.. కొట్టండి.. చెప్పుతో కొట్టండి’ అంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. ఇదే అదనుగా వారు రాళ్లతో దాడి చేశారు.
23:20 - By Unknown 0

0 comments:

Monday 28 April 2014

సినిమాల్లో ఓకే - నెట్




హీరోయిన్  శృతిహాసన్ ఈ మధ్య ఏదో ఒక విషయమై వివాదాలలో చిక్కుకుంటోంది. అందాలను ఆరబోయడంలో శృతి మించుతున్నారని, గ్లామర్ విషయంలో హద్దులు మీరుతున్నారని ఆమెపై విమర్శలు కూడా  వస్తున్నాయి. ఈ భామ బాలీవుడ్ లో ప్రవేశించడం ప్రవేశించడమే తొలి చిత్రం లక్ (హిందీ)లో బికినీ అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది.  ఆ తరువాత 'డిడే' హిందీ చిత్రంలో వేశ్య పాత్రలో హద్దులుమీరి శంగారాన్ని ఒలకబోసింది.  ఇక తెలుగు చిత్రం రేసుగుర్రంలో అయితే  ఒక పాటలో  హాట్ హాట్ డ్యాన్స్ తో  కుర్రకారుకు గుబులు పుట్టించ్చింది. ఆ ఫోటోలతో కూడిన పోస్టర్ల వల్ల చెన్నైలో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.   దాంతో  మహిళా సంఘాల వారు ఆందోళనకు దిగారు.  గ్లామర్‌కు కూడా ఒక హద్దు ఉంటుందని వారు కొన్ని చోట్ల ఆ వాల్ పోస్టర్లను చింపేశారు.

ఒక్కో చిత్రంలో ఒక్కో రకంగా తన అందాలను ఆరబోస్తున్న ఈ ముద్దుగుమ్మ  తన అశ్లీల ఫోటోలను ఇంటర్నెట్‌లో ప్రచారం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలలో  అశ్లీలంగా నటించడానికి అభ్యంతరం తెలపని శృతిహాసన్, ఇప్పుడు తన ఫొటోలను ఇంటర్నెట్ లో పెట్టినవారిపై కేసు వేస్తానని హెచ్చరిస్తున్నారు. ఈ భామ తెలుగులో ఇంతకు ముందు రామ్ చరణ్ సరసన ఎవడు చిత్రంలో నటించారు. ఈ చిత్రంలోని ఆమె గ్లామరస్ ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. దీనికి కారణం ఆ చిత్ర నిర్మాతగానీ, స్టిల్ ఫోటో గ్రాఫర్‌గానీ అయి ఉంటారని ఆమె అనుమానిస్తున్నట్లు సమాచారం.  ఇటువంటి చిత్రాలను ప్రచురించే ముందు తన అనుమతి తీసుకోవాలన్నది ఆమె అభిప్రాయం.
07:52 - By Unknown 0

0 comments:

Sunday 27 April 2014

తెరపై మళ్లీ మహేశ్‌, నమ్రత జోడీ..?


పెళ్లయిన ఆడవాళ్లు కెరీర్‌ని త్యాగం చేయాల్సిందేనా? అంటే.. ‘అవసరం లేదు’ అని చాలామంది అంటారు. కాకపోతే, కుటుంబం కోసం ఇష్టపూర్వకంగానే ఇంటికి పరిమితమయ్యే ఆడవాళ్లు ఉంటారు. నమ్రత ఆ జాబితాలోకే వస్తారు. సినిమాల్లోకి రాకముందు ఆమె మోడలింగ్ కూడా చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి రావడంతో మోడలింగ్‌కి దూరమయ్యారు. ఇక, మహేశ్‌బాబుని ప్రేమించి, పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కూడా దూరమయ్యారు.

  ఇప్పుడీ దంపతులకు ఒక బాబు (గౌతమ్), పాప (సితార) ఉన్న విషయం తెలిసిందే. గౌతమ్‌కి ఎనిమిదేళ్లు. త్వరలో సితారకు రెండేళ్లు నిండుతాయి. దాంతో నమ్రత మళ్లీ మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నారట. బహుశా అందుకేనేమో మునుపటిలా చక్కగా నాజూగ్గా తయారయ్యారు. ఓ ప్రముఖ పత్రికకు సంబంధించిన ఫొటోషూట్‌లో కూడా పాల్గొన్నారు నమ్రత. ఆ పత్రిక ముఖచిత్రంపై ఆమెను చూసినవాళ్లు ఆశ్చర్యపోతున్నారు. అంత బాగున్నారామె.

 త్వరలో ఓ ప్రముఖ నగల దుకాణానికి ప్రచారకర్తగా చేయనున్నారట నమ్రత. అది మాత్రమే కాదు.. మరికొన్ని ఉత్పత్తులకు అవకాశం వస్తే, చేయాలనుకుంటున్నారట. ఇప్పటికే వ్యాపార ప్రకటనల పరంగా మహేష్ దూసుకెళుతున్నారు. ఇప్పుడు నమ్రత కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నారు. అంటే, భవిష్యత్తులో ఈ భార్యాభర్తలిద్దరూ కలిసి ఏదైనా ఉత్పత్తికి ప్రచారకర్తలుగా చేసినా ఆశ్చర్యపోవడానికి లేదు. ఒకవేళ ఈ ఇద్దరూ జంటగా చేస్తానంటే ఏ ఉత్పత్తిదారు మాత్రం వదులుకుంటాడు. ఎంచక్కా క్యాష్ చేసుకోడూ!
00:50 - By Unknown 0

0 comments:

సింగిల్ ఇంజినా.. అయితే నేనెక్కను!


హైదరాబాద్: కొద్దిరోజులుగా హెలికాప్టర్‌లో తిరుగుతూ తెలంగాణ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేస్తున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్.. శనివారం మాత్రం హెలికాప్టర్ ఎక్కడానికి నిరాకరించారు. అవసరమైతే రోడ్డు మార్గాన వెళ్తాను కానీ, అందులో మాత్రం ప్రయాణించేది లేదని స్పష్టంచేశారు. పైలట్ ధైర్యం చెప్పినా సరే.. వినకుండా చివరకు కారులో ప్రచారానికి వెళ్లిపోయారు. ఎన్నికల ప్రచారం కోసం ప్రస్తుతం బీజేపీ రెండు హెలికాప్టర్లను ఉపయోగిస్తోంది. వీటిలో ఒకదాన్ని పవన్ కల్యాణ్‌కు కేటాయించింది. శనివారం ఉదయం కరీంనగర్ జిల్లా గోదావరిఖని, రామగుండం నియోజకవర్గాల్లో ఆయన ప్రచారానికి వె ళ్లాల్సి ఉంది. దీంతో ఉదయమే పవన్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ తనకోసం కేటాయించిన హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని, మరో హెలికాప్టర్‌లో ఎక్కాలని సిబ్బంది సూచించారు.

అది సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ అని తెలియడంతో, అందులో ఎక్కబోనని పవన్ స్పష్టంచేశారు. ఒకే ఇంజిన్ ఉన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదని, అకస్మాత్తుగా ఇంజిన్ మొరాయించే పరిస్థితి తలెత్తదని, అది పూర్తి కండిషన్‌లో ఉన్న హెలికాప్టరేనని పైలట్ ధైర్యం చెప్పినా ఆయన వినిపించుకోలేదు. డబుల్ ఇంజిన్‌దైతేనే ఎక్కుతానని భీష్మించారు. అది మరమ్మతు కావడానికి సమయం పడుతుందని చెప్పడంతో ఆయన కారులోనే ప్రచారానికి వెళ్లిపోయారు. అయితే, ముందుగా అనుకున్న సమయానికి రోడ్డుమార్గంలో గోదావరిఖని చేరుకునే అవకాశం లేకపోవడంతో ఫోన్ ద్వారా తన సందేశాన్ని వినిపించి ఆ సభలు రద్దు చేసుకున్నారు.
00:47 - By Unknown 0

0 comments:

'ఆగడు' నుంచి కావాలనే తప్పించారు: ప్రకాశ్ రాజ్


మహేష్ బాబు- శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న 'ఆగడు' చిత్రం నుంచి తనను ఉద్దేశపూర్వకంగానే తప్పించారని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. ఇదంతా ఒక్కడే చేస్తున్నాడని, దీనిపై తాను త్వరలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు. అంతేకాదు.. ఆ ఒక్కరి పేరు కూడా త్వరలో బయటపెడతానని ప్రకాశ్‌రాజ్‌ చెప్పారు.

ఆ సినిమాకు సంబంధించిన హీరోతో గానీ, నిర్మాతతో గానీ, అసిస్టెంట్ డైరెక్టర్లతో గానీ తనకు ఏమాత్రం గొడవల్లేవని స్పష్టం చేశారు. దర్శకత్వశాఖలో ఒకరితో ప్రకాశ్ రాజ్ కు గొడవ అయ్యిందని, దానిపై ఫిర్యాదులు వెళ్లడంతో ఆయనను తప్పించి, ఆ స్థానంలో సోనూసూద్ ను తీసుకున్నారని సమాచారం. ఇంతకుముందు కూడా ఒకసారి ప్రకాశ్ రాజ్ ను టాలీవుడ్ సినిమాల నుంచి కొన్నాళ్ల పాటు బహిష్కరించి తర్వాత మళ్లీ తీసుకున్నారు.
00:43 - By Unknown 0

0 comments:

Health Alert: Aerial Yoga


Move over Bikram yoga and power yoga, the latest trend in yoga, that’s become an overnight sensation the world over is the anti-gravity (aerial) yoga. if you’re bored of monotonous exercise routines, this form of yoga has been developed especially for you!

What is anti-gravity yoga?
Mickey Mehta, India’s leading holistic health guru explains, “It is a new form of yoga that involves performing a series of exercises inspired by yoga, dance, pilates, calisthenics and aerial acrobatics in order to achieve a total-body workout, while being suspended from a hammock-like apparatus that is about two to three feet off the ground.” If you’re wondering what the key difference between your regular yoga and this form, it is the hammock. In anti-gravity yoga, this fabric acts like a swing or soft trapeze, allowing flexibility and easy movement. It is used to change one’s dynamic relationship to the ground, allowing the user to  understand their body better and its relationship to being suspended.

Is it beneficial?
This form of yoga encompasses major health benefits. It provides a workout that allows one to stretch and strengthen the body, without overstressing the joints or compressing the vertebrae. “It is recommended for people suffering from back issues, as the hammock acts as a support system,” 
say Mehta. 
 
Warning!
If you suffer from medical conditions, such as arthritis, glaucoma and high blood pressure, it’s advisable not to take up anti-gravity yoga. It’s best to always consult your physician before undertaking any new physical activity.
00:35 - By Unknown 0

0 comments:

Saturday 19 April 2014

అది తెలిసినవాళ్లెవరూ నన్ను ప్రేమించరు! శ్రుతీహాసన్



 ‘‘భారతదేశంలో పుట్టడం నా అదృష్టం’’ అంటున్నారు శ్రుతీహాసన్. ఆమె అలా అనడానికి కారణం ఉంది. విదేశాల్లో పుట్టి, ఏ హాలీవుడ్ సినిమాలోనో చేస్తే ఆంగ్ల భాషకు మాత్రమే పరిమితం అవ్వాల్సి వచ్చేదని, భారతదేశంలో పుట్టడం వల్ల పలు భాషల్లో నటించడానికి కుదురు తోందని అంటున్నారు శ్రుతి. తెలుగు, తమిళ, హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ.

 ఇంకా అంగీకరించాల్సిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. వాటిల్లో మణిరత్నం దర్శకత్వం వహించనున్న భారీ మల్టీస్టారర్ ఒకటి. ఇందులో తనను నాయికగా అడిగారని శ్రుతి పేర్కొన్నారు. కానీ, ఇంకా డేట్స్ కేటాయించలేదని, ఇలాంటి ఓ భారీ అవకాశానికి అడగడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ చిత్రానికి డేట్స్ కేటాయించడానికి డైరీ తిరగేస్తున్నారట. అది సరే.. సినిమాల్లో హీరోలతో ప్రేమలో పడుతుంటారు కదా.. మరి, నిజజీవితం సంగతేంటి? అనే ప్రశ్న శ్రుతీహాసన్ ముందుంచితే -‘‘నేను సింగిల్‌గానే ఉన్నా.
 సినిమాల పరంగా నా బిజీ షెడ్యూల్ గురించి తెలిసినవాళ్లెవరూ నన్ను ప్రేమించరు. ప్రస్తుతం సినిమాల మీదే పూర్తి దృష్టి సారించాను. కష్టపడి పని చేయాలన్నదే నా ధ్యేయం. ప్రతి శుక్రవారం ఏదో ఓ సినిమా వస్తుంది.. పోతుంది. కానీ, చేసిన కృషి మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతుంది’’ అని చెప్పారు.
02:03 - By Unknown 0

0 comments:

నేనిప్పుడు ఆంటీని అయ్యాను : ప్రియమణి




నేనిప్పుడు ఆంటీని అయ్యాను అంటూ తెగ సంబరపడిపోతున్నారు నటి ప్రియమణి. సాధారణంగా హీరోయిన్లు ఏ విషయం గురించి ఓపెన్‌గా మాట్లాడినా తమ వయసు గురించి మాత్రం నోరు మెదపరు అన్నది ఒకప్పటి మాట. శ్రుతిహాసన్, శ్రీయ వంటి వారు తమ వయసును దాచుకునే ప్రయత్నం చేయడం లేదు. అదే విధంగా ప్రియమణి కూడా ఏ విషయాన్ని అయినా నిర్భయంగా చెబుతారు. చక్కని అభినయ తార అయిన ఈమె ఎందుకనో రెండు మూడేళ్లుగా తమిళ తెరకు దూరం అయ్యారు. అయితే కన్నడం, మలయాళం, తెలుగు భాషల్లో నటిస్తూ బిజీగానే ఉన్నారు. ప్రస్తుతం కన్నడంలో అంబరీష్ అనే చిత్రంలో నటిస్తున్న ప్రియమణి తన ట్విట్టర్‌లో పేర్కొంటూ తాను ఆంటీని అయ్యానని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ప్రియమణి సోదరుడు విశాక్ దేవ్, ప్రార్థన దంపతులకు ఇటీవలే పండంటి ఆడబిడ్డ జన్మించిందట. దీంతో షూటింగ్‌కు కూడా విరామం ఇచ్చి ప్రియమణి తన సోదరుడి కూతురిని లాలిస్తూ గడిపేస్తున్నారట. దీంతో ఆమె తల్లి తన కూతురికి పెళ్లి ఆశ కలిగిందంటున్నారట. దీనిపై ప్రియమణి మాట్లాడుతూ, వయసు పెరుగుతుందన్నది నిజమేనని, దాని కోసం వివాహం చేసుకోవాలని లేదుగా అన్నారు. నిజం చెప్పాలంటే వివాహం చేసుకోవాలనే ఆలోచన తనకింత వరకు రాలేదన్నారు. అలాంటి ఆశ కలిగినప్పుడు ఆ విషయం గురించి ఆలోచిస్తానని అంటున్నారు.
 
01:59 - By Unknown 0

0 comments:

పూజై ఫస్ట్‌లుక్‌కు విశేష ఆదరణ ;శ్రుతిహాసన్

                                       
పూజై చిత్ర ఫస్ట్‌లుక్ ఫొటోలకు విశేష ఆదరణ లభించింది. విశాల్, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న చిత్రం పూజై. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న మూడవ చిత్రం ఇది. దీనికి కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమైన ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ దేశంలోని ముఖ్యమైన సమస్యపై హీరో చేసే పోరాటమే ఈ చిత్ర ప్రధానాంశమన్నారు. దాన్ని కుటుంబ నేపథ్యంలో చక్కని ప్రేమ సన్నివేశాలను జోడించి చిత్రీకరిస్తున్నామని చెప్పారు.
 
ముక్కోణపు ప్రేమ కథలా ఇది ముక్కోణపు యాక్షన్ కథా చిత్రమని తెలిపారు. గత చిత్రాల మాది రిగానే ఈ పూజైలోను జనరంజక అంశాలు ఉంటాయని వివరించారు. ఇంతకుముందు విశాల్ హీరోగా చేసిన తామరభరణి చిత్రం పూర్తిగా యాక్షన్ ఓరియంటెండ్ కథా చిత్రం కాదన్నారు. పూజై మాత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కథా చిత్రమన్నారు.
 
ఈ చిత్ర కథ కోయంబత్తూరు నేపథ్యంలో సాగుతుందన్నారు. పూజై చిత్రానికి అందమైన హీరోయిన్ అవసరం అయ్యారని చెప్పారు. అలాంటి మోడ్రన్ లుక్, ఫ్రెష్‌నెస్ టచ్‌కు శ్రుతిహాసన్ కరెక్టుగా ఉంటుందని భావించి, ఆమెను ఎంపిక చేశామని చెప్పారు. చిత్రంలో శ్రుతిహాసన్ పాత్ర ఆరంభం నుంచి చివరి వరకు ఉంటుందని దర్శకుడు హరి పేర్కొన్నారు.


01:55 - By Unknown 0

0 comments:

'తెలంగాణ ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ పదిలం'


వరంగల్ : వైఎస్ఆర్ ఆశయాలను స్పూర్తిగా తీసుకుని సంక్షేమ పథకాలు అమలు చేసే సత్తా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల స్సష్టం చేశారు. శనివారం వరంగల్ జిల్లా మరిపెడలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో షర్మిల ప్రసంగించారు. వైఎస్ఆర్ పాలన సువర్ణయుగమన్ని తెలిపారు. మహానేత పరిపాలనలో ప్రవేశ పెట్టిన ఏ పథకాన్నైనా అద్భుతంగా అమలు పరిచారన్నారు. ఆయన హయాంలో ఆర్టీసీ, కరెంట్... ఇలా ఏ ఒక్క ఛార్జీ పెరగలేదని గుర్తు చేశారు.

వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన అన్ని సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ పార్టీ తూట్లు పోడిచిందని ఆరోపించారు. వైఎస్ఆర్ హయాంలో మంజూరైన ఇళ్లకు కనీసం బిల్లులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించలేదని... అలాగే కరెంట్ ఛార్జీలు పెంచి రూ. 32 వేల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతుందని అన్నారు. వైఎస్ఆర్ ఆకస్మిక మరణంతో ఆయన అభిమానులు ఎక్కువ మంది తెలంగాణలోనే చనిపోయారన్నారు. తెలంగాణలో 60 శాతం మంది ప్రజలు ఇంకా వైఎస్ ఆర్ ను గుండెల్లోనే పెట్టుకున్నారని తెలిపారు. ఏ పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టిన లోను కాకుండా... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వెయ్యాలని తెలంగాణ ప్రజలకు సూచించారు.
01:52 - By Unknown 0

0 comments:

టీచర్లకు బడితెపూజ చేసిన విద్యార్థినులు


శ్రీకాకుళం : దారి తప్పిన గురువులకు విద్యార్థినులు బడితెపూజ చేశారు. అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ పట్టలేని ఆవేశంతో ఊగిపోయారు. అంతే చేతికందిన వాటితో ఉపాధ్యాయులను చితక్కొట్టి వదిలారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని ప్రభుత్వ  పాఠశాలలో జరిగింది. గత కొంతకాలంగా డ్రాయింగ్‌ టీచర్‌, ఇంగ్లీష్‌ టీచర్‌ తమను లైంగికంగా వేధిస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.

వారి ఆగడాలు ఎక్కువ కావటంతో, ఈ విషయాన్ని  ఎవరూ పట్టించుకోకపోడంతో తామే రంగంలోకి దిగి ఇద్దరినీ చిత్తుగా కొట్టారు. విద్యార్థినులకు తోడు వారి కుటుంబ సభ్యులు కూడా ఉపాధ్యాయులకు దేహశుద్ధి చేశారు. కాగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి కీచక టీచర్లను అదుపులోకి తీసుకున్నారు.
 
01:40 - By Unknown 0

0 comments:

'కేసీఆర్... హైదరాబాద్ సెటిలర్లకు క్షమాపణలు చెప్పు'



హైదరాబాద్
 : తెలంగాణలో సెటిలర్ల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఏనాడు వెంపర్లాడలేదని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. శనివారం హైదరాబాద్ లో మాట్లాడుతూ... తెలంగాణలో నివసిస్తున్న ఇతర ప్రాంతాలవారిని రెచ్చగొట్టింది....వారిలో అభద్రతభావం కల్పించింది కేసీఆరే అని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం పేరుతో ఆందోళన పరిస్థితులు కల్పించి... రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా అడ్డుకుంది కేసీఆర్ ఆని పొన్నాల విమర్శించారు.
 
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో సెటిలర్ల ఓట్లు తమ పార్టీకి పడవని కేసీఆర్ కు అర్థమైందని... అందుకే ఆయనలో ఓ విధమైన దుగ్థతో మొదలైందన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ విమర్శిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ లో సెటిలర్లకు క్షమాపణలు చెప్పాలని ఈ సందర్బంగా కేసీఆర్ ను పొన్నాల డిమాండ్ చేశారు.
01:37 - By Unknown 0

0 comments:

మండపేట అసెంబ్లీ బరిలో సినీ నటి : హేమ



సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆమె పొలిటికల్ పాత్రలోకి ప్రవేశిస్తున్నారు. తన సొంత జిల్లా తూర్పుగోదావరి నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించి అభిమానుల్లో ఆసక్తి రేపారు హేమ.


తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జన్మించిన హేమ అసలు పేరు కృష్ణవేణి. సినిమాల్లోకి వచ్చాక ఆమె పేరు మార్చుకున్నారు. చిన్ననాటి నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తి ఆమెను ఈ రంగంలోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు 250 పైగా సినిమాల్లో నటించిన హేమ మంచి నటిగా గుర్తింపు పొందారు. బుల్లి తెరపై కూడా అడుగుపెట్టి రాణిస్తున్నారు. ఈ ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు.



మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ తరపున ఎన్నికల  బరిలోకి దిగుతున్నట్టు హేమ వెల్లడించారు. మండపేట అసెంబ్లీ జేఎస్పీ అభ్యర్థిగా తాను ఏప్రిల్ 19న నామినేషన్ దాఖలు చేస్తున్నట్టు చెప్పారు. కాకతాళీయంగానో, కాలక్షేపం కోసమో తాను పోటీ చేయడంలేదని, ప్రజలకు నిబద్ధతతో సేవ చేయాలన్న స్థిర సంకల్పంతోనే రాజకీయాల్లోకి వస్తున్నట్టు స్పష్టం చేశారు. మండపేటలో హేమ ఏ మేరకు ప్రభావం చూపుతారో చూడాలి. సొంత జిల్లా వాసులు ఆమెను ఏ మేరకు ఆదరిస్తారో?
01:34 - By Unknown 0

0 comments:

అరుణను కంటతడి పెట్టించిన 'బాబు'










గజపతినగరం
 : పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. రాష్ట్రం లో శిశు సంక్షేమ శాఖ మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించిన ఓ ఆడపడుచు..‘తెలుగుదేశం’ తీరుతో కన్నీరు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో కీలకనేతగా ఉన్న పడాల అరుణ.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏకపక్ష ధోరణితో కన్నీటిపర్యంతమయ్యారు. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నియోజకవర్గంలో తనకు జరుగుతున్న అవమానాలను కొంతకాలంగా పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని వాపోయారు.
 
 మూడు పార్టీలు మారిన వ్యక్తికి ప్రాధాన్యం ఇచ్చారని, ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తన ప్రమేయం లేకుండా అతనికి బీ ఫారాలు ఇవ్వడం దారుణమని అన్నారు. పార్టీ అధినేత గజపతినగరంలో సభ పెడుతున్న విషయం కూడా తనకు తెలియజేయకపోవడం బాధాకరమన్నారు. రెండున్నర దశాబ్దాలుగా పార్టీలో ఉంటూ.. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని, క్రమశిక్షణ గల కార్యకర్తగా పని చేశానని, అటువంటి తనకు ఇదేనా ఇచ్చిన గుర్తింపు అంటూ ప్రశ్నించారు. గుర్తింపులేని చోట పని చేయడం కష్టంగా భావించి జిల్లా, రాష్ట్ర పార్టీ కార్యాలయాలకు తన రాజీనామాను పంపిస్తున్నట్లు ప్రకటించారు. అనుచరులతో  సమావేశమై భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని వెల్లడించారు.
01:32 - By Unknown 0

0 comments:

మామ లాలింపు.. కోడలి తాలింపు..


 ‘మగాళ్లు మగాళ్లే... కుర్రాళ్లు తప్పులు చేస్తారు... అంతమాత్రాన ఉరితీసేస్తారా..?’ అంటూ సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ రేపిస్టులను వెనకేసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆయన చిన్న కోడలు అపర్ణా యాదవ్ మాత్రం ఈ అంశంలో మామగారితో విభేదిస్తూ, భిన్నస్వరం వినిపిస్తున్నారు. అత్యాచారాల కేసుల్లో నిందితుల నేరం రుజువైతే, వారిని ఉరితీయాల్సిందేనని, మహిళగా తన అభిప్రాయం ఇదేనని ఆమె ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే, మరణ శిక్షపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, తన మామగారి మాటలు వక్రీకరణకు గురయ్యాయని ఆమె ముక్తాయించడం కొసమెరుపు.
01:29 - By Unknown 0

0 comments:

‘ఆ’ సన్నివేశాల్లో ఉన్నది నేను కాదు


సాక్షి, బెంగళూరు : ప్రముఖ శాండల్‌వుడ్ నటుడు జగ్గేష్ నటించిన అగ్రజ సినిమా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైంది. అయితే విడుదలైన రోజునే సినిమా వివాదం సృష్టించింది. అగ్రజ సినిమాలోని కొన్ని అశ్లీల సన్నివేశాల్లో ఉన్నది తానే అన్నట్లుగా చిత్ర యూనిట్ చూపించిందని, అయితే ఆ సన్నివేశాల్లో ఉన్నది తాను కాదని హీరోయిన్‌గా కనిపించిన సంజన పేర్కొన్నారు. 
వేరొకరితో ఆ సన్నివేశాలు చిత్రీకరించి, అందులో ఉన్నది తానేనన్నట్లుగా చూపించడం ఎంతగానో బాధించిందంటూ తన ట్విట్టర్ అకౌంట్‌లో సంజన పేర్కొన్నారు. ఇక సంజన ఆరోపణలపై అగ్రజ సినిమా దర్శకుడు శ్రీనందన్ స్పందిస్తూ...‘చిత్రకథ, ఇందులో సంజనపై చిత్రించనున్న దృశ్యాలు తదితర అన్ని వివరాలు చెప్పే చిత్రీకరించాం. ఇందులో మేం ఎలాంటి మోసానికి పాల్పడలేదు’ అని పేర్కొన్నారు.
 
01:27 - By Unknown 0

0 comments:

Tuesday 15 April 2014

యువీతో గ్యాంగ్నమ్ డాన్స్:గేల్


బెంగళూరు: ఐపీఎల్ లో యువరాజ్ సింగ్ తో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ తెలిపారు. బుధవారం యూఏఈలో ఐపీఎల్ ప్రారంభకానున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇతర అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిసి ఆడటమనేది తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అధికారిక వెబ్ సైట్ లో గేల్ తెలిపారు.యువీతో కలిసి గ్యాంగ్నమ్ డాన్స్ చేయడానికి ఎదురు చూస్తున్నాని గేల్ అన్నారు. 
మైదానంలో ఫ్యాన్స్ కు పూర్తి స్థాయి వినోదాన్ని పంచుతామని గేల్ తెలిపారు. గత రెండు సీజన్లలో ట్రోఫిని గెలుచుకోలేకపోయామని.. ఈసారి ఎలాగైనా ఐపీఎల్ విజేతలుగా నిలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. ఆల్ రౌండర్ విరాట్ కోహ్లీ అద్బుతమైన ఫామ్ లో ఉండటం సానుకూల అంశమని క్రిస్ గేల్ తెలిపారు. 
04:21 - By Unknown 0

0 comments:

ప్రేమకు అడ్డుగోడగా కులం


వింజమూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే కులం పేరుతో తనను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడంటూ ఓ యువతి నిరసనకు దిగింది. భర్త ఇంటి ముందు బైఠాయించి తనకు న్యాయం చేయాలని పట్టుబట్టింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని వీరి పెళ్లిని రిజిస్ట్రేషన్ చేసేందుకు ఒప్పించ డంతో కథ సుఖాంతమైంది. వివరాలు...

అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన శైలజాకుమారి 2004లో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులోని తన పెద్దమ్మ ఇంట్లో ఉంటూ స్థానిక ఎంఎస్‌ఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదివింది. అదే కళాశాలలో చదువుతున్న సూరా భాస్కర్‌రెడ్డి, శైలజాకుమారి ప్రేమించుకున్నారు. డిగ్రీ అనంతరం ఉన్నత చదువుల కోసం శైలజ తిరుపతికి, భాస్కర్‌రె డ్డి హైదరాబాద్ వెళ్లారు. మధ్యమధ్యలో భాస్కర్‌రెడ్డి తిరుపతికి వె ళ్లి ఆమెతో మాట్లాడివస్తుండే వాడు. 2010లో శైలజ ప్రాజెక్ట్ వర్క్ కోసం హైదరాబాద్ వెళ్లడంతో ఇద్దరూ మరింత దగ్గరయ్యారు.

ఈ క్రమంలో ఆమె పెళ్లి ప్రస్తావన తేవడంతో కులాలు వేరయినందున తల్లిదండ్రులను నెమ్మదిగా ఒప్పించి చేసుకుంటానని నమ్మించాడు. మరోవైపు అదే ఏడాది తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ సమయంలో భాస్కర్‌రెడ్డి ఖర్చులు భరించి ఆమెకు హైదరాబాద్‌లో వైద్యం చేయించాడు. చివరకు 2013 జూన్‌లో తిరుపతిలోని శ్రీనివాసమంగాపురంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మొదట హిందూపురం, తర్వాత నెల్లూరులో కాపురం పెట్టారు. అనంతరం క్రమేణా ఆమెను దూరం పెడుతూ వచ్చాడు.

అదే సమయంలో భాస్కర్‌రెడ్డికి మరోపెళ్లి చేసేందుకు అతని తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న శైలజకుమారి తల్లిదండ్రులు, బంధువులతో కలిసి వింజమూరు చేరుకుంది. తనకు న్యాయం చేయాలంటూ మహిళా సంఘాల నేతలతో కలిసి ఆదివారం రాత్రి నుంచి భాస్కర్‌రెడ్డి ఇంటి ఎదుట బైఠాయించింది. సోమవారం ఉదయం అక్కడకు చేరుకున్న భాస్కర్‌రెడ్డిని నిలదీసి, తనకు చేస్తున్న అన్యాయంపై ప్రశ్నించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాల వారిని పోలీసుస్టేషన్‌కు పిలిపించి చర్చలు జరిపారు. చివరకు వీరి వివాహాన్ని మంగళవారం రిజిస్టర్ చేసేందుకు ఒప్పించారు.
04:18 - By Unknown 0

0 comments:

చిరంజీవి వర్సెస్ పవన్ కళ్యాణ్!


తమ్ముడు తమ్ముడే.. రాజకీయాలు రాజకీయాలే అని కర్నాటకలో మెగా బ్రదర్స్ సవాల్ విసురుకుంటున్నారు. గత ఎన్నికల్లో మెగా బ్రదర్ కు బాసటగా నిలిచిన పవర్ స్టార్.. 2014 ఎన్నికల సమయం వచ్చే సరికి పరిస్థితులు తారుమారయ్యాయి. అన్నయ్య కాంగ్రెస్ ప్రచారం చేస్తుంటే.. తమ్ముడిని బీజేపీ బరిలోకి దించింది. సొంత రాష్ట్రంలో ప్రభావం చూపలేకపోయిన మెగాస్టార్ ప్రస్తుతం కర్నాటక ఎన్నికల ప్రచారంలో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సీన్ ప్రస్తుతం పక్క రాష్ట్రంలో కనిపిస్తుంటే.. అదే వేడి సీమాంధ్ర, తెలంగాణలో రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ తరపున కర్నాటకలో చిరంజీవి ఇప్పటికే ప్రచారం చేపట్టారు. దాంతో బీజేపీ పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించాలని భావించిందే తడవుగా ఎన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 
 
మోడీ కార్యాలయం నుంచి సమాచారం అందగానే సోమవారం హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ను బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కలిశారు. కర్నాటకలో ప్రచారాన్ని నిర్వహించాలని పవన్ కు కిషన్ రెడ్డి విజ్క్షప్తి చేశారు. దాంతో మంగళవారం ఉదయం కర్నాటకలో ప్రచారం నిర్వహించడానికి బేగంపేటలో ఓ ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేశారు. 
 
అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ కు ఓటు వేయాలని పిలుపుస్తుండగా, పవన్ పూర్తి వ్యతిరేకంగా బీజేపీ ప్రచారం నిర్వహించడంతో మెగా అభిమానుల్లో గందరగోళానికి కారణమవుతోంది. కర్నాటకలో తెలుగు ప్రజలు అత్యధికంగా నివసించే కోలార్, రాయ్ చూర్, గుల్బర్గా ప్రాంతాల్లోని మూడు సభల్లో పవన్ కళ్యాణ్ మంగళవారం పాల్గొంటారు. లోక్‌సభ ఎన్నికల సందర్బంగా ప్రచారంలో చివరి రోజు అయిన మంగళవారం పవన్ కళ్యాణ్‌తో ప్రచారం చేయించి ఇంతో అంతో ఓట్లు సంపాదించాలని బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు రాయచూరులో, మద్యాహ్నం 12.30 గంటలకు కోలారులో, 3.30 గంటల సమయంలో గుల్బర్గాలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని సోమవారం రాత్రి బీజేపీ నాయకులు తెలిపారు. 
 
సోమవారం మెగాస్టార్ చిరంజీవి ఇక్కడి యలహంక, చిక్క బళ్లాపురం, బాగేపల్లి, గౌరిబిదనూరులో ప్రచారం చేసిన వెంటనే పవన్ కళ్యాణ్ మరసటి రోజు ప్రచారానికి వస్తారని ప్రకటించడం కొసమెరుపు.  అవినీతి కాంగ్రెస్ ను ఓడించాలని..దేశాన్ని రక్షించాలని (కాంగ్రెస్ హటావో.. దేశ్ బచావో) పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.  చిరంజీవికి వ్యతిరేకంగా వెళ్లడానికి నిర్ణయం తీసుకోవడం ఇబ్బందే అయినా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తప్పదని గత రెండు సభలో తెలిపారు. ఏది ఏమైనా అన్నదమ్ముల సవాల్ మధ్య తెలుగు ప్రజలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. 
04:15 - By Unknown 0

0 comments:

ఇలాగైతే ‘ఫ్యాన్’దే హవా


* సీఎం రమేష్‌తో జేసీ దివాకర్‌రెడ్డి వాగ్వాదం
 
అనంతపురం : మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డికి, టీడీపీ రాయలసీమ ఇన్‌చార్జ్ సీఎం రమేష్ మధ్య సోమవారం హైదరాబాద్‌లో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. గుంతకల్లు అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించారని వార్తలు రాగానే జేసీ దివాకర్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌కు చేరుకుని సీఎం రమేష్ వద్దకు వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘నేను కోట్ల రూపాయలు కుమ్మరించి టికె ట్ సంపాదిస్తే.. మీరు బీజేపీకి గుంతకల్లు అసెంబ్లీ టికెట్ కేటాయించడంవల్ల అనంతపురం పార్లమెంటులో టీడీపీ అడ్రస్సు గల్లంతవుతుందయ్యా.. అనంతపురం లోక్‌సభ పరిధిలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది.. అనంత వెంకట్రామిరెడ్డి కచ్చితంగా గట్టిపోటీ ఇస్తారు.. గుంతకల్లు టీడీపీ టికెట్ మధుసూదన్‌గుప్తాకు ఇవ్వండని చెబితే ఇలా చేశారేంటి? ఈ పరిస్థితిలో గుంతకల్లు అసెంబ్లీ స్థానం బీజేపీకి ఇస్తే ఆయన ఈజీగా గెలిచేస్తారు. నన్ను మీరే ఓడగొట్టేట్టున్నారు.. అనంతపురం లోక్‌సభ పరిధిలో బీజేపీకి ఏ అసెంబ్లీ కేటాయించవద్దు. వాళ్లకు మడకశిర ఇచ్చుకోండ’ని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నిర్ణయం అధిష్టానం తీసుకుందని, ఇందులో తన ప్రమేయం లేదని సీఎం రమేష్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారని తెలిసింది.
04:14 - By Unknown 0

0 comments:

జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ?

గత ఎన్నికల్లో సందడి చేసిన చిన్న ఎన్టీఆర్ ఇప్పుడు సినిమాలకే పరిమితమయ్యారు. ఎన్నికల హడావుడి తారాస్థాయి చేరినా బుల్లి తారక రాముడు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఎన్నికల గురించి ఎక్కడా మాట్లాడినట్టు కూడా లేదు. తాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ తరపున గత ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసిన జూనియర్ జాడ లేకపోవడంతో అభిమానులు అసంతృప్తికి గురవుతున్నారు.

2009 ఎన్నికల్లో స్టార్ కాంపైనర్ గా టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. తన వాళ్లకు కూడా టిక్కెట్లు ఇప్పించుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగు తమ్ముళ్లు బుల్లి ఎన్టీఆర్ వైపు కనీసం కన్నెత్తి చూడడం లేదు. పలకరించే సాహసం కూడా చేయడం లేదు. నారా వారసుడికి పోటీ వస్తాయన్న భయంతో చంద్రబాబు జూనియర్ ను పక్కనపెట్టారు. అటు హరికృష్ణ కూడా సమయం దొరికినప్పుడల్లా బావపై విమర్శనాస్త్రాలు సంధిస్తుండడంతో ఆ ప్రభావం జూనియర్ పై పడింది.

లోకేష్ ను తెర ముందుకు తేవాలన్న ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు సహజంగానే చిన్న ఎన్టీఆర్ పై శీతకన్నేశారు. ఇక పవన్ కళ్యాణ్ అడగకుండానే ఆయాచితంగా మద్దతు ప్రకటించడంతో చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేకుండా పోయింది. గత ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రచారం చేసినా పెద్దగా ఫలితం లేకపోవడం, అతడి సినిమాలు ఈమధ్య ఆడకపోవడంతో జూనియర్ కు టీడీపీ అధినేత ఈసారి చేయి ఇచ్చారు. మామయ్య నుంచి పిలుపు రాకపోవడంతో ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. మరోవైపు తమ హీరోను చంద్రబాబు పట్టించుకోకపోవడాన్ని ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేపోతున్నారు. తమ అభిమాన కథానాయకుడికి మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆశాభావంతో ఉన్నారు.
04:11 - By Unknown 0

0 comments:

బెల్లు తప్ప అన్నీ మోగుతున్న 'సైకిల్'


తెలంగాణలో సైకిల్ మూలనబడిపోతోందా? సైకిల్ సారధికి చుక్కలు కనిపిస్తున్నాయా? తెలుగుదేశం అధినేత ప్రసంగాల పట్ల జనం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇది ఆ పార్టీ నేతలకు, క్యాడర్ కు చెమటలు పట్టిస్తోంది. ఆయన సభలకు కొద్దిమంది వీరాభిమానుల్ని వదిలేస్తే జనస్పందన కరువవుతోందన్న రిపోర్టులు వస్తూండటం ఆ పార్టీని కలవరపెడుతోంది.

పార్టీ కేడర్‌లో జోష్ పుట్టించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌లో రోడ్ షో చేపట్టారు. బంజారాహిల్స్‌లోని తన ఇంటి నుంచి సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బాలంరాయి, కంటోన్మెంట్‌ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి, బోడుప్పల్, ఎల్బీ నగర్, మేడ్చల్‌ మీదుగా పర్యటించిన చంద్రబాబుకు... పెద్దగా జనస్పందన లకనిపించలేదు.  ప్రజలు కూర్చోవడానికి వేసిన కుర్చీల్లో చాలా వరకు ఖాళీగా కనిపించగా... వచ్చిన జనంలోనూ చాలా మంది సభ పూర్తయేంతవరకు కూడా ఉండకుండా తిరుగుముఖం పట్టారు.

చాలా నియోజకవర్గాల్లో పార్టీ సీనియర్ కార్యకర్తలే చంద్రబాబుకు హ్యాండిచ్చారు. ఎల్బీ నగర్ అసెంబ్లీ టికెట్‌ కృష్ణయ్యకు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న టీడీపీ నాయకులు సామ రంగారెడ్డి, కృష్ణప్రసాద్ సహా ఐదుగురు కార్పొరేటర్లు బాబు సభకు డుమ్మా కొట్టారు.

ఇటు టీడీపీ, బిజెపి పొత్తు కూడా పొడిచేలా కనిపించడం లేదని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. పలు చోట్ల బిజెపి, టీడీపీ కార్యకర్తలు కలిసి పనిచేయడం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో భాగ్యనగరం, రంగారెడ్డిలో బిజెపితో కలయిక వల్ల ఎలాంటి బెనిఫిట్ లేదని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. మొత్తం మీద తెలుగుదేశం ఖాతాలో తెలంగాణ క్రెడిట్ అకౌంట్ కన్నా డెబిట్ ఎకౌంట్ లో పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కార్యకర్తలే అంగీకరిస్తున్నారు.
04:10 - By Unknown 0

0 comments:

26 వేల మంది కార్మికులను రోడ్డున పడేసిన చంద్రబాబు: వాసిరెడ్డి పద్మ


హైదారాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హయాంలో ప్రభుత్వరంగ సంస్థలన్నీ ప్రైవేట్‌పరం చేశారని తాము ముందు నుంచి చెబుతున్నట్లు వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు. పరాఖ్‌ కూడా ఇదే అంశాన్ని తన పుస్తకంలో ప్రస్తావించారన్నారు.  ప్రపంచ బ్యాంకు షరతులకు చంద్రబాబు పాదక్రాంతమయ్యారన్నారు.  కేవలం ఆ బ్యాంకు చెప్పిందని చంద్రబాబు చేసిన పనుల వల్ల వేల మంది కార్మికులు వీధులపాలయ్యారని తెలిపారు. 54 ప్రభుత్వరంగ సంస్థలను మూసేసి 26వేల మంది కార్మికులను రోడ్డున పడేశారని చెప్పారు.

వైఎస్ జగన్మోహన రెడ్డిని  ఎవరు విమర్శించినా ఈనాడు రాస్తుందన్నారు. సొంత నియోజకవర్గంలో గెలుస్తారో? లేదో? చెప్పలేని సబ్బం హరి మాట్లాడితే ఈనాడు పేజీలకు పేజీలు రాసిందన్నారు. ఇలాంటి పిచ్చిరాతలు మానుకోవాలని వాసిరెడ్డి పద్మ సలహా ఇచ్చారు.
04:08 - By Unknown 0

0 comments:

Sunday 13 April 2014

మీరెంత అభిమానులైతే మాత్రం . . .? రేణూ దేశాయ్



సెలబ్రిటీలూ మనుషులే అని, వాళ్లకీ మనసు ఉంటుందని గ్రహించాలని, ఇష్టం వచ్చినట్లు నోరుపారేసుకోకూడదని అంటున్నారు రేణూ దేశాయ్. ఎంత బాధపడి ఉంటే ఆమె ఇలా అని ఉంటారో ఊహించవచ్చు. పవన్ కల్యాణ్‌ని పెళ్లి చేసుకుని, రేణు ఇద్దరు బిడ్డలకు తల్లయిన విషయం తెలిసిందే. తెలుగులో తొలి సినిమా ‘బద్రి’ చేసినప్పుడు, పవన్‌తో ఆమె ప్రేమలో పడటం, ఆ తర్వాత సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టడం కూడా విదితమే. ఇద్దరూ సహజీవనం చేయడం మొదలుపెట్టిన తర్వాత ‘జానీ’ చిత్రంలో నటించిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక, పరిస్థితుల వల్ల రేణూ మెడలో పవన్ మూడు ముళ్లు వేయడం, ఈ మధ్యే ఇద్దరూ విడిపోవడం కూడా కొత్త విషయాలు కాదు.
 ప్రస్తుతం పుణేలో ఉంటున్న రేణూ దేశాయ్ మరాఠీ భాషలో ‘మంగలాష్టక్ వన్స్ మోర్’ అనే చిత్రం నిర్మించారు. ఈ చిత్రవిశేషాలను తన ఫేస్‌బుక్ ద్వారా వివరించేవారు రేణు. అయితే ఈ ఫేస్‌బుక్కే తన మనసుని బాధపెడుతుందని ఊహించి ఉండరు. ఆమె ఫేస్‌బుక్‌కి ఎవరో అభ్యంతరకర మెసేజ్‌లు పంపిస్తున్నారట. వాటి గురించి రేణు స్పందిస్తూ -‘‘నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి వస్తున్న ఈ మెసేజ్‌లతో నేను విసుగెత్తిపోయాను. ఇకనుంచి, నేను ఇన్‌బాక్స్ మెసేజ్ ఆప్షన్‌ని ఆఫ్ చేసేస్తున్నా. నాకు తెలుసు మీ అందరూ వీరాభిమానులని (పవన్ కల్యాణ్ అభిమానులను ఉద్దేశించి అని ఊహించవచ్చు). కానీ, సెలబ్రిటీలు కూడా మనుషులని గ్రహించండి. అందరిలానే మాక్కూడా భావోద్వేగాలుంటాయని, మా మనసులూ బాధపడతాయని తెలుసుకోండి. కొంచెం ఎదగండి’’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

blogger
02:34 - By Unknown 0

0 comments:

Saturday 12 April 2014

ప్రాణం తీసిన డైటింగ్


ప్రాణం తీసిన డైటింగ్
నాజూగ్గా అవ్వాలని ఎవరికి ఉండదు చెప్పండి. సన్నబడాలనే కోరిక మంచిదే గాని...దాని కోసం చేసే ప్రయత్నాలే ప్రాణం మీదికి తెస్తున్నాయి. పీచెస్ గెడాఫ్... బ్రిటన్‌కి చెందిన ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, పాత్రికేయురాలు. ఈ నెల ఏప్రిల్ 7వ తేదీన మరణించింది. కొందరు ఆత్మహత్య అనుకున్నారు. ఇంకొందరు హత్య అనుకున్నారు. పాతికేళ్ల గెడాఫ్ ఆకస్మిక మరణం అందరికీ ప్రశ్నార్థకంగా మారిన సమయంలో పోస్టుమార్టం రిపోర్టు వివరాలు బయటికొచ్చాయి. కేవలం ఆమె పాటించిన ఆహారనియమాలే ఆమె ప్రాణాన్ని బలిగొన్నాయని చెప్పగానే ప్రపంచం మొత్తం నోరెళ్లబెట్టింది.  

ఇది నిజమా! అంటూ చాలామంది వైద్యుల్ని సంప్రదించడం కూడా మొదలుపెట్టారు. ఇంతకీ గెడాఫ్ చేసిన పొరపాటేమిటంటే... రోజు మూడు గ్లాసుల పళ్లరసాలు తాగుతూ బతికేద్దామనుకోవడం.  గత ఏడాది ఇదే సమయానికి గెడాఫ్ ఒక ట్వీట్ చేసింది. ‘నేను రోజురోజుకీ బరువు పెరుగుతున్నాను... వైద్యుల్ని సంప్రదిస్తే కారణం నేను ఇష్టంగా తినే  ‘జంక్‌ఫుడ్’ అన్నారు. ఇక నుంచి నా ఆహారనియమాలను మార్చేసుకుంటున్నాను...’ అని చెప్పింది. కేవలం పళ్ల్లరసాలు...మధ్యలో చిప్స్‌వంటివి తింటూ గడిపేస్తున్న గెడాఫ్ చూస్తుండగానే బరువు తగ్గిపోయింది.  

ఇద్దరు పిల్లల తల్లయిన గెడాఫ్ రెండో అమ్మాయి పుట్టినపుడు బాగా బరువు పెరిగింది. బాలింతగా వున్న సమయంలో తల్లి బరువుగా ఉండడం సహజమని స్నేహితులు చెప్పినా వినిపించుకోకుండా కఠిన నియమాలకు సిద్ధ్దమైపోయింది గెడాఫ్. పూర్తిగా ఘనపదార్థాలకు దూరంగా ఉండడం వల్ల ఆమె శరీరంలో పోషకాలు పూర్తిగా లోపించాయి. దాంతో రక్తహీనత, ఐరన్ లోపం ఏర్పడిందని వైద్యులు చెబుతున్నారు.

ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్ల గెడాఫ్ మరణించిందని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ‘గెడాఫ్ మరణం ఓ పాఠం’ అంటున్నారు పోషకాహార నిపుణులు. నిజమే... ఆరోగ్యాన్ని నిర్ణయించేది బరువొక్కటే కాదు... మన అవయవాల పనితీరు కూడా. మన ఆరోగ్య పరిస్థితి కూడా. బరువు తగ్గాలనుకునేవారు తగినంత వ్యాయామం చేస్తూ...వైద్యుల పర్యవేక్షణలో బరువుతగ్గే ప్రయత్నాలు చేస్తే మంచిది.
 
 సొంతనిర్ణయాలు ప్రమాదం...

 బరువు తగ్గాలనుకోవడం ఆరోగ్యకరమైన విషయమే కానీ, అకస్మాత్తుగా తగ్గిపోవాలని కోరుకోవడం, సొంత నిర్ణయాలతో అద్భుతాలు సృష్టించాలనుకోవడం మాత్రం ప్రాణాలతో చెలగాటమాడడమే. ఒక్క గెడాఫ్ విషయమనే కాదు....అలాంటివాళ్లు మన చుట్టూ చాలామంది ఉన్నారు. అకస్మాత్తుగా బరువు తగ్గిపోవాలనుకోవడం కూడా ఒక మానసిక జబ్బే.  

పళ్ల రసాలు, అల్పాహారాలు తిని కూడా బతకొచ్చు. అవి కేవలం తాత్కాలిక శక్తిని ఇస్తాయి. దీర్ఘకాలంలో వచ్చే దుష్పలితాలు చాలా భయంకరంగా ఉంటాయి. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో తగినంత ఘనపదార్థం లేకపోతే కొంతకాలం తర్వాత మన శరీరంలోని అవయవాల పనితీరులో మార్పు వచ్చేస్తుంది. రక్తహీనత, నీటిశాతం తగ్గిపోవడం, ఆక్సిజన్ లోపం, ఐరన్ లోపం... మొదలవుతాయి.

ఒక్కసారి అవయవాల పనితీరులో మార్పు వచ్చిందంటే మళ్లీ వాటిని బాగుచేసుకోవడం చాలా కష్టం. కాబట్టి...మీరు బరువు తగ్గాలనుకుంటే వైద్యుల్ని సంప్రదించండి. మీ వయసు, శరీరతత్వం... వంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకుని ఆహారనియమాలను సూచిస్తారు. దానికి తగ్గట్టుగా బరువుతగ్గే ప్రయత్నాలు వికటించే అవకాశం ఉండదు.

 - సుజాత, చీఫ్ న్యూట్రిషనిస్ట్, కేర్ ఆసుపత్రి, హైదరాబాద్.
22:59 - By Unknown 0

0 comments:

ప్రేమ పేరుతో వంచన


ప్రేమ పేరుతో వంచనమల్లయ్యపల్లిలో బైఠాయించిన దివ్య, పెళ్లి ఆధారాలు చూపిస్తున్న స్వరూప
ముప్పిరితోట(ఎలిగేడు) : పెళ్లై భర్త, కుమారుడు ఉన్న ఓ మహిళను ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడో ప్రబుద్ధుడు. ముప్పిరితోట పరిధి మల్లయ్యపల్లికి చెందిన పూరెల్ల దివ్యకు మేనబావతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. దివ్య తరుచూ మప్పిరితోటలోని పుట్టింటికి వచ్చిపోతున్న క్రమంలో అనుబంధ గ్రామమైన మల్లయ్యపల్లికి చెందిన ఆటోడ్రైవర్ జాతరగొండ మహిపాల్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఈ క్రమంలో మహిపాల్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి భర్తకు విడాకులిప్పించాడు. అనంతరం ఇరువురు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఏడాది తర్వాత దివ్యను కట్నం కోసం శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేయడంతో బాధితురాలు జూలపల్లి పోలీసులను ఆశ్రయించింది. అయినా ఫలితం లేకపోవడంతో మహిళా సంఘాల సహకారంతో శనివారం మహిపాల్ ఇంటిఎదుట ఆందోళన చేపట్టింది. తనకు న్యాయం జరిగేంత వరకూ పోరాటం చేస్తానంది. లేదంటే ఆత్మహత్యే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
 
 ప్రేమించి పెళ్లికి నిరాకరించాడని....
సారంగాపూర్ : నాలుగేళ్లుగా ప్రేమించానని మాయమాటలు చెప్పి నమ్మించిన ప్రబుద్ధుడు తీరా పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందో యువతి. కోనాపూర్‌కు గ్రామానికి చెందిన గంగధరి నవీన్‌కుమార్ వరంగల్ జిల్లా ఎనిమాలకు చెందిన చేల స్వరూప రెండున్నరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నవీన్‌కుమార్ డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే స్వరూప ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తుంది. 2011 డిసెంబర్‌లో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారింది.
 
 కాగా, నవీన్‌కుమార్ ఆరు నెలలుగా మొహం చాటేశాడు. స్వరూపను పట్టించుకోవడం ఏలదు. నెల క్రితం ఆతడి తల్లితండ్రులు వివాహం చేసేందుకు అతడికి నిశ్చితార్థం కూడా పూర్తి చేశారు. విషయం తెలుసుకున్న స్వరూప ఫోన్‌లో అతడిని నిలదీయగా కులాలు వేరైనందున ఇంట్లో పెద్దలు పెళ్లికి అంగీకరించడం లేదని పేర్కొన్నాడు. దీంతో ఆమె తన బంధువులను పది రోజుల క్రితం సారంగాపూర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సమస్య వివరించగా వారు ఎన్నికల నేపథ్యంలో 12వ తేదీన రావాలని సూచించారు. ఇద్దరిని స్థానిక ఎస్సై నరేశ్‌రెడ్డి విచారించి కౌన్సెలింగ్ చేశారు. ప్రత్యేకంగా మాట్లాడుకోవాలని సూచించారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన స్వరూప నవీన్‌కుమార్‌పై చేయిచేసుకుంది. వెంటనే నిద్రమాత్రలు మింగింది. విషయాన్ని గమనించిన అక్కడివారు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై ఆమెను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.
 
22:57 - By Unknown 0

0 comments:

జగన్ మామయ్యే సీఎం



జగన్ మామయ్యే సీఎం

హైదరాబాద్: ‘జగన్ మామయ్య సీఎం కావాలి. ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. కర్నూలు, నందికొట్కూరు వస్తే జగన్ మామయ్యతో కలిసి ప్రచార రథం ఎక్కి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా’ అని ‘వైఎస్సార్‌సీపీ లక్కీ బేబీ’ చెల్లా కుందనసాయి తెలిపింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004, 2009 ఎన్నికల్లో చేవెళ్ల నుంచి ప్రచారం ప్రారంభించి కర్నూలు జిల్లా నందికొట్కూరులో ముగిం చారు. ఆ సమయంలో సీసీ కృష్ణారెడ్డి, మంజుల దంపతుల కుమార్తె కుందనసాయిని వైఎస్ తన వద్ద కూర్చోబెట్టుకుని ప్రచారం సాగించారు. రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ‘నువ్వు వచ్చావంటే.. లక్కీ అమ్మా’ అంటూ వైఎస్ తాతయ్య తనను ప్రచారానికి పిలిచేవారని గుర్తు చేసుకుంది. నువ్వు వచ్చావంటే లక్కీ అమ్మా... ప్రభుత్వం మనదేన మ్మా.. వచ్చే ఎన్నికల్లో నువ్వు జగన్ మామయ్యతో కలసి ప్రచారం చేయాలంటూ అప్పట్లో వైఎస్ తనతో అనేవారని కుందనసాయి ‘సాక్షి’కి తెలిపింది.

అప్పటి నుంచి కుందనసాయికి లక్కీబేబీగా గుర్తింపు వచ్చింది. కుందనసాయి వైఎస్ ప్రచార రథంపైకి ఎక్కి బుల్లిబుల్లి మాటలతో అందర్నీ అకట్టుకునేది. ప్రస్తుతం కర్నూలు సెయింట్ జోసెఫ్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న కుందనసాయి శనివారం తల్లిదండ్రులతో పాటు లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసింది. వైఎస్ తాతయ్య జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంది. ‘ఈసారి కూడా తప్పకుండా నిన్ను రథంపై ఎక్కించి ప్రచారం చేస్తా’ అని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని కుందనసాయి తెలిపింది.

 తాతయ్య మృతిని తట్టుకోలేకపోయా...

 వైఎస్ తాతయ్య మృతిచెందారని తెలిసి తట్టుకోలేకపోయానని కుందనసాయి కన్నీటి పర్యంతమైంది. తాను ఇడుపులపాయ వెళ్లి నివాళులర్పించానని చెప్పింది. జగన్ మామయ్య జైల్లో ఉన్నప్పుడు మాత్రం కలవలేకపోయానని బాధ పడింది. వైఎస్ అంటే తమకు మొదటి నుంచి అభిమానం అని కుందనసాయి తల్లిదండ్రులు కృష్ణారెడ్డి, మంజుల తెలిపారు. తమ బిడ్డ కర్నూలులోని పలు ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తూ వైఎస్ అమలు చేసిన పథకాలను వివరిస్తోందని చెప్పారు.
22:54 - By Unknown 0

0 comments:

'పవన్ కళ్యాణ్, మోడీలను చంద్రబాబు వాడుకుంటున్నాడు'


'పవన్ కళ్యాణ్, మోడీలను చంద్రబాబు వాడుకుంటున్నాడు'
కర్నూలు: పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ సీపీవే అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శోభానాగిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కర్నూల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై శోభానాగిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో టీడీపీ, బీజేపీ పొత్తు చరిత్రాత్మక తప్పు అన్న చంద్రబాబు..ప్రస్తుత పొత్తుపై  మైనారిటీలకు ఏం సమాధానం చెప్తారని శోభానాగిరెడ్డి నిలదీశారు. 
 
ఎన్నికల్లో పొత్తు కోసం చంద్రబాబు బీజేపీ నేతల కాళ్లు పట్టుకుంటున్నారని ఆమె విమర్శించారు. చంద్రబాబు ఓ పరాన్నజీవి అని వ్యాఖ్యలు చేశారు. ఎలాగైనా గెలువాలని చంద్రబాబు కేఏ పాల్‌, పవన్‌ కళ్యాణ్, మోడీలను వాడుకుంటున్నారని శోభానాగిరెడ్డి ఆరోపించారు. ఐనా అన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని శోభానాగిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. 
22:37 - By Unknown 0

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top