Contact

Text

Friday 4 April 2014

కర్నాటకలో పవన్‌ ప్రచారం

22:27 - By Unknown 0


Pawan-Speech-Poll1-415x260
జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రకటించిన పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ సారథ్యంలోని ఎన్నికలకు ఆపార్టీ తరపున ప్రచారం చేయనున్నారు. ఈమేరకు మోడీ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చినట్లు తెలిసింది. పవన్‌ కర్నాటకలోని చిక్కబళ్లాపురం నుంచి తన మొదటి ప్రచార పర్వాన్ని ప్రారంభించనున్నారు. పైగా ఇక్కడ పవన్‌ అభిమానులు ఎక్కువగా ఉన్నారు.
వారి ఒత్తిడి మేరకు పవన్‌ అక్కడి నుంచె బిజెపి తరపున ప్రచారపర్వాన్ని మొదలు పెట్టనున్నారు. విశాఖ వేదికగా పవన్‌ తన జనసేన రెండవ సభలో నరేంధ్రమోడీకే ఓటేయండి అని బహిరంగంగా ప్రకటించారు. ఆయన అయితేనే ధైర్యంగా పోరాడగలరు అని చెప్పారు. నేను ఆయనకే మద్దతునిస్తానని కూడా ప్రకటించారు. పవన్‌ ప్రచారం చేస్తున్న విషయాన్ని బిజెపి సీనియర్‌ నాయకుడు కర్నాటక చిక్కబళ్లాపురం అభ్యర్థి అయిన బచ్చెగౌడ తెలిపారు. పవన్‌తో పాటు బిజెపి సీనియర్‌ నాయకుడు వెంకయ్యనాయుడుతో కలిసి పవన్‌ కర్నాటక ప్రచారంలో పాల్గోననున్నారు.

Tags:
About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top