Contact

Text

Tuesday 1 April 2014

వేసవి సౌందర్యానికి కొబ్బరి..

10:22 - By Unknown 0


వేసవి కాలంలో దాహార్తిని తీర్చే కొబ్బరి బోండాలు సౌందర్య పోషణలోను బాగా పనిచేస్తాయి. చర్మాన్ని, శిరోజాలను మెరిపించే సుగుణం కొబ్బరి బోండాం నీళ్లలో మెండుగా ఉంది. ఈ నీళ్లతో పాటు కొబ్బరి పాలను కూడా సౌందర్య పోషణలో వాడొచ్చు.
4 వేసవిలో ప్రతిరోజూ కొబ్బరి నీళ్లలో దూదిని ముంచి ముఖానికి రాసుకుని మూడు నిమిషాల పాటు నెమ్మదిగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల భానుడి ప్రతాపానికి నల్లగా మారిన చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
4 ముదురు కొబ్బరి నుంచి తీసిన పాలతో చర్మానికి మర్దనా చేసి ఆరిన తరువాత కడిగేస్తే చర్మం సున్నితంగా కోమలంగా తయారవుతుంది.
4 అరకప్పు కొబ్బరి పాలలో కొన్ని గులాబి రేకులు, స్పూన్ తేనె కలిపి ఒక బకెట్ గోరువెచ్చటి నీళ్లలో వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి తగిన తేమ అంది చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
4 వేసవిలో చెమటతో పాటు చర్మంపై పేరుకుపోయే మురికి వల్ల మొటిమలు, కురుపులు ఏర్పడుతుంటాయి. దీన్నుంచి బయటపడాలంటే కొబ్బరి పాలలో రెండు చుక్కల నిమ్మరసం కలిపి పదినిమిషాల తరువాత అందులో దూదిని ముంచి ముఖమంతా అద్దాలి. కాసేపటి తరువాత చల్లటి నీళ్లతో కడిగేస్తే ముఖంపై పేరుకున్న దుమ్ము పోయి చర్మం తాజాగా ఉంటుంది.
4 చర్మంపై ఉండే మృతకణాలు పోకపోతే చర్మం గరుకుగా తయారవుతుంది. ఇలాంటప్పుడు ఒక కప్పు కొబ్బరి పాలలో, బాదం, తులసి పొడులు ఒక్కో స్పూన్ చొప్పున, రెండు చుక్కల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంటయ్యాక కాసిని నీళ్లతో తడిపి నలుగులా రుద్దాలి. ఆ తరువాత గోరు వెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేస్తుంటే మృతకణాలు తొలగి చర్మం మృదువుగా తయారవుతుంది.
4 లేత కొబ్బరితో ముఖానికి ప్యాక్ వేసుకుంటే మెరుపు వస్తుంది.
4 ఒక కప్పు కొబ్బరి పాలలో కొద్దిగా అరటిపండు గుజ్జు, ముల్తాని మట్టి, గుడ్డు తెల్లసొన కలిపి తలకు పట్టించి కాసేపు ఉంచుకుని తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు మెరవడమే కాకుండా వేడి తగ్గి తల చల్లగా ఉంటుంది.
4 చిక్కటి కొబ్బరి పాలలో కొన్ని తేనె చుక్కలు, రెండు టేబుల్ సూన్‌ల బియ్యపు రవ్వ, బాదం నూనె కలిపి పాదాలకు పూతలా పట్టించి పదినిమిషాలు మృదువుగా మర్దనా చేయాలి. ఆ తరువాత చల్లటి నీళ్లతో కడిగి మాయిశ్చరైజర్ రాస్తే మృదువైన పాదాలు సొంతమవుతాయి.

Tags:
About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top