Contact

Text

Tuesday 8 April 2014

రామోజీ.. నీ పేపర్ జనం కోసమా.. జగన్ కోసమా?

20:56 - By Unknown 0

రామోజీ.. నీ పేపర్ జనం కోసమా.. జగన్ కోసమా?
 ఎన్నికలొస్తే చాలు ఈనాడు అధినేత రామోజీరావుకు ఎక్కడలేని పూనకం వచ్చేస్తుంది.  వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తండ్రి రాజారెడ్డి మొదలు కుటుంబం మొత్తం మీద ఈనాడులో పేజీలకు పేజీలు విషం చిమ్మేస్తారు. దుర్మార్గమైన రామోజీ కుయుక్తులను ప్రజలు ఇప్పటికే రెండు ఎన్నికల్లో తిప్పికొట్టినా ఇంకా ఆయన తీరు మారలేదని ప్రముఖ సినీరచయిత, నటుడు, దర్శక నిర్మాత పోసాని కృష్ణమురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డే లక్ష్యంగా ఈనాడు తప్పుడు కథనాలతో బరితెగిస్తోందన్నారు.. పోసాని కృష్ణమురళి మాటలివీ...
 
తప్పుగా రాశాం అని క్షమాపణ చెప్పాలి
రామోజీ.. నువ్వు సపోర్ట్ చేసే తెలుగుదేశం పార్టీలో డబ్బుతో ఓట్లు కొనకుండా, మందుతో ఓట్లు కొనకుండా కులం కార్డు వాడకుండా కేవలం ప్రజల ప్రేమతో ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలను చూపించు.. అదీ చంద్రబాబు అధ్యక్షుడిగా ఉన్న టీడీపీలోనే...  ఇలా చూపిస్తే నా ఒంటిమీద బట్టలన్నీ తీసి తెలుగుదేశం జెండాతో బట్టలు కుట్టించుకుని, మెడలో చంద్రబాబు బొమ్మ పెట్టుకుని రాష్ర్టమంతా తిరుగుతా.. నీ కిష్టమైన పదం జై చంద్రబాబు అని కూడా అంటా...నేను చనిపోయేవరకు.. తెలుగుదేశం జెండా నా భుజం మీద వేసుకుని తిరుగుతా... కానీ అలా చూపించలేనిపక్షంలో నువ్వు నీ మెడలో జగన్ బొమ్మ పెట్టుకుని తిరగాలి.. నీకొడుకు కూడా మెడలో జగన్ బొమ్మ వేలాడేసుకోవాలి... ఇన్నాళ్లూ తప్పుగా రాశాం... వాగాం అని క్షమాపణ చెప్పాలి...

జగన్‌ను తిట్టడానికి పేపర్ కావాలా..
ప్రపంచం మొత్తం మీద జగన్ కోసం నిద్రలేని రాత్రులు గడుపుతున్నది రామోజీ... ఆయన కొడుకే. రామోజీ.. నీ పేపర్ జనం కోసమా... జగన్ కోసమా...  ప్రజలకోసం పెట్టిన పేపర్‌లో రోజూ రెండు పేజీలు జగన్ కోసం కేటాయిస్తావా...  అంతనిద్ర లేకుండా చేస్తున్నాడా జగన్ నీకు..  కోర్టులు ప్రూవ్ చేయకుండా ఏవో  ఆరోపణలంటూ బురదజల్లేందుకు నానాకష్టాలు పడుతున్నారు.. మీరే క్వొశ్చన్ వేసుకుంటారు... మీరే ఆన్సరేసుకుంటారు... మీరే ఆనందపడిపోతుంటారు... రాజశేఖరరరెడ్డి ఉన్నప్పుడూ ఇలానే చేశారు... ఆయన మీద లేనిపోని రాతలు రాశారు.. ఫ్రంట్ పేజీలో బొమ్మలేసి 2004, 2009 ఎన్నికలప్పుడు విషం చిమ్మారు. కానీ ఏమైంది... ప్రజలు వైఎస్ వెంటే నిలిచారు.. ఇప్పుడు నువ్వు జగన్ మీద పడుతున్నావ్... పెద్ద అవినీతి, బురద, రొచ్చు నీ కళ్లముందు పెట్టుకుని ఎందుకయ్యా 24గంటలూ జగన్ మీద పడతారు..

రామోజీ...  అంత దమ్ముందా నీకు...
అవినీతి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు..  రామోజీ అవినీతి గురించి మాట్లాడుతుంటే జనం నవ్వుతున్నారు... బహుశా రామోజీకి కమ్మ వారే సీఎం కావాలని కోరికున్నట్టుంది. రెడ్లు, కాపులు, బీసీలు, దళితులు..  మరే ఇతర కులం రాకూడదని నీ ఫీలింగ్...  ఏమిటంత కులం పిచ్చి... బాబు తప్ప మరెవరినీ సీఎంగా ఊహించుకోలేని భావదారిద్య్రం నుంచి ముందు బయటపడు.

మళ్లీ రిపీట్ చేయగలవా
ఎన్నికలు రాగానే నీకు ఎక్కడ లేని పూనకం వస్తుంది... వైఎస్ కుటుంబం మొత్తం మీద విషం చిమ్మేస్తారు. పేజీలకు పేజీలు రాస్తారు... మరి అదే ఈనాడు ఫ్రంట్ పేజీలో నీవు సపోర్ట్ చేసే టీడీపీ నేతల గురించి ఎందుకు రాయవు.. కొత్తగా ఏమీ రాయక్కరలేదు.. గతంలో నీవు రాసిన కథనాలే మళ్లీ ఎన్నికల సమయంలో పునర్ముద్రించగలవా?

*   ఫ్రంట్ పేజీలో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కోట్లు నొక్కేశారని గతంలో రాశావ్.. మళ్లీ రిపీట్ చేయగలవా?
*    చంద్రబాబు కారణంగా బషీర్‌బాగ్ కాల్పుల్లో మృతి చెందిన వారి ఫొటోలు ఇప్పుడేయగలరా?
*    బాబు అవినీతి జమానా గురించి రాయగలవా?
*    ఇక్కడ  జై తెలంగాణా... అక్కడ జై సమైక్యాంధ్ర ఉన్న  చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతం ఏవిధంగా కరెక్టో రాయగలవా?
*  బాబును గురించి ఎన్టీఆర్ మాట్లాడిన జామాతా దశమగ్రహ క్యాసెట్‌లోని అంశాలను వివరించగలవా?
 
కొత్త రాష్ట్రానికి జగనే సీఎం కావాలి
సమైక్యాంధ్రప్రదేశ్ రెండు ముక్కలైంది. పాలకుల్లో సమర్థులు లేకపోవడం వల్లనే ఇలా జరిగింది. కనీసం కొత్త ఆంధ్రప్రదేశ్‌కైనా ఓ సమర్థ నాయకుడు కావాలి... ఆ నాయకుడు జగనే అని నా నమ్మకం.. నేనే కాదు.. సీమాంధ్రప్రజల విశ్వాసం కూడా అదే. సమైక్య రాష్ట్రానికి ఎందరు ముఖ్యమంత్రులు చేసినా రాష్ట్రంపై బలమైన ముద్ర వేసింది. ఎన్టీఆర్... వైఎస్ రాజశేఖరరెడ్డిలే...  వీరిలో జనంతో బాగా మమేకమైంది వైఎస్సే.. ఆయన నిజమైన వారసుడిగా జగన్‌ను జనం గుర్తించారు.. ధైర్యం, నిజాయితీగా ముందుకెళ్లడం, మంచిపని చేయాలనుక్నుప్పుడు, నమ్మినవారికోసం ఎంతదూరమైనా ముందుకెళ్లడం... ప్రజలకు ఎప్పుడూ దగ్గరగా ఉండాలను కోవడం... ఇవన్నీ జనం జగన్‌లో చూశారు. నాయకుడు కులం నుంచి కాదు జనం నుంచి పుట్టాలి... వైఎస్ ఇదే అనేవారు.. జగన్ శక్తివంతమైన నాయకుడిగా జనం నుంచి పుట్టారు..
 
జగన్‌కు డ్రామాలు తెలియవు
జగన్‌కు  కులం డ్రామాలు ఆడడు.. మతం డ్రామాలు తెలియవు.. నాటకాలు ఆడటం రాదు.. ఏదైనా మొహం మీద చెప్పేస్తాడు.. నమ్మితే వైఎస్ లాగే కష్టమొచ్చినా అంటిపెట్టుకుంటాడు..  వేల కోట్లున్న వారితో ఎలా ఉంటాడో కటిక నిరుపేదతోకూడా అంతే ప్రేమగా ఉంటాడు.. ఎన్టీఆర్ పెద్దవయస్సులో జనం వద్దకు వెళ్లి దగ్గరకు తీసున్నాడు.. కానీ జగన్ 36ఏళ్ల వయస్సులో పేదవాళ్ల వద్దకు వెళ్లి అమ్మ అని, అక్కని, అవ్వని, చెల్లె, పిన్ని, బాబాయి తాత అని దగ్గరకు తీసుకున్నాడు.. వాళ్ల కూడా జగన్‌ను సొంతమనిషిగా భావిస్తున్నారు కాబట్టే అంత దగ్గరయ్యారు. ఇదంతా నేను స్వయంగా ఓదార్పు యాత్రల్లో చూశా.. ఈయనకు ఓట్లేస్తే మన జీవితాలు బాగుపడతాయి.. మన బతుకులు చల్లగా ఉంటాయి అని జగన్‌ను చూసి జనం అనుకుంటున్నారు.
 
ఇదీ జగన్‌కు, బాబుకు తేడా...
తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదు... జెండా, ఎజెండా బాబువి కావు.. సైకిల్ గుర్తు చంద్రబాబుది కాదు.. అన్న ఎన్టీఆర్ కష్టార్జితాన్ని వెన్నుపోటుతో నొక్కేసిన చరిత్ర చంద్రబాబుది.. రామారావు నచ్చలేదు.... లక్ష్మీపార్వతి నచ్చలేదు బయటకు వచ్చేసి బాబు సొంత పార్టీ పెట్టుకుని జనంలోకి వెళ్లాలి.. కానీ చంద్రబాబు ఏం చేశారో అందరికీ తెలుసు. కానీ జగన్ అలా కాదు.. కాంగ్రెస్ పార్టీ వద్దనుకున్నాడు.. కేంద్రమంత్రి ఇస్తానన్నా,, భవిష్యత్తులో సీఎం చేస్తానన్నా వినలేదు.. వైఎస్ చనిపోయిన తర్వాత పార్టీ తీరు నచ్చక బయటకు వచ్చేశాడు.. సొంత పార్టీ పెట్టుకుని సత్తా చూపించాడు. అదీ మగతనం.. నాయకత్వం.. అందుకే నేనంటాను జగన్ రైట్ రాయల్.
 
నీ 420 కేసులు గురించి ఎందుకురాసుకోవు
పేపర్‌లో చాలా నీతులు చెబుతావు...... చాలా సుద్దులు చెబుతావు కదా.. మరీ నీ మీద కేసులు ఎందుకు రాసుకోవు.. విశాఖ సీతమ్మధారలో ఈనాడు ఆఫీసు  స్థలం కబ్జా మొదలు ఎన్నో 420కేసులు ఉన్నాయి కదా వాటి గురించి రాసుకోవెందుకుని... నీ మోసపూరిత చరిత్ర చాలా ఉంది కదా... మనకు వంద బొక్కలు ఉన్నాయి.... కింద నుంచి పైదాకా  బొక్కలే... వాటి గురించి మాత్రం రాసుకోకు. ప్రజాస్వామ్యంలో కారణాలు లేకుండా పార్టీలు జంప్ చేయడం, డబ్బు-మందు పారించి ఓట్లను కొనుక్కోవడం, కులం కార్డు వాడటం రాజకీయ వ్యభిచారం, ప్రజాస్వామ్యాన్ని రేప్ చేయడం. వీటి గురించి మీ ఈనాడు పత్రికలో ఎందుకు రాయవు?
 
సీ అంటే చెరుకూరిఎందుకు కాదు..
టైటానియం కుంభకోణంలో  సీ అంటే  జగన్ అని నువ్వే రాశావు.. ఇంకోరోజు కాదు వేరెవరి పేరో రాశావు... అసలు సీ అంచే చంద్రబాబే ఎందుకు కాకూడదు.. రేపు బాబుతో గొడవైతే సీ అంటే కచ్చి తంగా చంద్రబాబే అని రాస్తావు...  నేనైతే సీ అంటే చెరుకూరి రామోజీరావు అని అనే అనుకుంటున్నా... ఎందుకు కాకూడదు. అమెరికా వాళ్లు ఏమీ చెప్పకుండానే ఇష్టమొచ్చినట్లు ఎలా రాస్తావు.

Tags:
About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top