Contact

Text

Wednesday 21 May 2014

ఈ వ్యక్తే మన దేశ ప్రధాని

06:39 - By Unknown 0


ఈ ఫోటోలో కనిపించే వ్యక్తిని గుర్తుపట్టారా.ఇంకా ఆలోచిస్తున్నారా...ఎవరో కాదు...భారతదేశ ప్రధానిమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్రమోడి.ఒకనాడు చీపురుపట్టి ఊడ్చిన వ్యక్తి నేడు దేశానికి దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగాడు. ఆర్‌ఎస్ఎస్ ప్రచారకర్తగా ఉన్న నరేంద్రమోడీ.. ఆ సంస్థ కార్యాలయాన్నిచీపురుతో శుభ్రపరిచాడు.  అదే మోదీ ఇప్పుడు బీజేపీలో తిరుగులేని ‘ శక్తి ’గా, ఎదిగి ఆపార్టీని ప్రధాని పీఠం పై కుర్చోబెట్టాడు.125 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీని మట్టి కరిపించాడు. చాయ్ అమ్ముకుంటూ  సామాన్య జీవితాన్ని గడిపిన మోదీ ఈ రోజు అత్యంత శక్తివంతుల జాబితాలో చేరిపోయాడు.ఎక్కడ చూసినా మోడీ నామమే వినిపిస్తుంది.సోషల్ మీడియా లో కూడా మోడీ జపమే చేస్తున్నారు. జాతీయ,అంతర్జాతీయ ప్రముఖులు సైతం ఆయన పరిపాలనా కోసం ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు దేశానికి రావద్దంటూ అవమానించిన అగ్రరాజ్యం అమోరికా...ఈ రోజు మా దేశానికి రమ్మంటూ ఆహ్వానిస్తోంది. సామాన్యుడి నుండి అగ్రనేతల వరకు అందరి చూపు తన వైపే. ఏ నలుగురు కలిసినా మోడీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇదంతా కేవలం ఒక్క రోజులో జరిగిపోలేదు. ఎన్నో రోజులు శ్రమించి తన కలను సాకారం చేసుకున్నారు. ఒక  ప్రక్కన ప్రత్యర్ధుల మాటలను ఎదుర్కొంటూ మరో ప్రక్క తన ఆలోచనలను అమలు చేస్తూ గుజరాత్ ను ఆదర్శ రాష్ట్రంగా మలిచారు.ఎన్నో పరిశ్రమలను నెలకొల్పి,ప్రజలకు జీవనోపాధిని కల్పించడంలో సఫలమయ్యారు. ప్రకృతి వనరులను ఉపయోగించుకొని సోలార్ పవర్ ను ఉత్పతి చేయడంలో ఆదర్శంగా నిలిచారు.ఇవన్నీ ఈరోజు దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించడానికి బాటలు వేశాయి. ఇంతటి కీర్తి ప్రతిష్ఠలు వచ్చినా తాను  మాత్రం ఇంకా పేద వ్యక్తిగానే అభివర్ణించుకోవడం ఆయన నిరాడంబరతకు నిదర్శనం.

About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top