సినిమాల గురించి, అందులో తమ హీరోల గురించి గంటల తరబడి గుక్క తిప్పుకోకుండా మాట్లాడే కథానాయికలు.. రాజకీయాల విషయానికొచ్చేసరికి సైలెంట్ అయిపోతారు. రాజకీయాలా..? ఆ సంగతులు మాకెందుకండీ..? అనేస్తారు. ఇప్పుడు తమన్నా కూడా అదే.. అంది. రాజకీయాల గురించి మాట్లాడేంత పెద్దదాన్ని కాదు. నన్నొదిలేయండి ప్లీజ్ - అంటోంది.
మీ హీరో పవన్ కల్యాణ్ పార్టీ పెట్టాడు కదా? మరి మరి మీ స్పందనేంటి?? అని అడిగితే ''నాకు రాజకీయాల గురించి అస్సలు తెలీదు. జీరో నాలెడ్జ్. తెలియని విషయం గురించి మాట్లాడితే బాగోదు.. అందుకే నన్నొదిలేయండి. కావాలంటే సినిమాల గురించి ఏమైనా అడగండి. చెబుతా..'' అని మీడియాని రిక్వస్ట్ చేసింది.
పవన్ - తమన్నా కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో కలసి నటించారు. ఆ సమయంలో పవన్ సిన్సియారిటీ గురించి తెగ కబుర్లు చెప్పిన తమ్మూ.. ఈసారి ఎందుకు సైలెంట్ అయిపోయింది. ఏం మాట్లాడితే ఏమవుతుందో..? ఏ హీరో చిన్నబుచ్చుకొంటాడో అన్న భయం ఏమో..??

About the Author

0 comments:
Post a Comment