బాలకృష్ణ లెజెండ్ వచ్చేలోగా ఈవారం వచ్చిన సినిమాలేమైనా కాస్త సందడి చేస్తాయేమో, బోసిపోతున్న బాక్సాఫీస్‌కి కాస్త కాసుల కళ తెస్తాయేమో అనుకుంటే లాభం లేదని తేలిపోయింది. కొత్తగా వచ్చిన సినిమాల్లో అనువాదాలే ఎక్కువ. వాటిలో ఏదీ కాస్తంత బలంగా ముద్ర వేసేట్టు కనిపించడం లేదు. అజిత్ సినిమా ‘వీరుడొక్కడే’ మాస్‌కి నచ్చే విధంగా ఉన్నా కానీ ముసలాడిలా కనిపిస్తున్న అజిత్‌కి గ్లామర్ ఫ్యాక్టర్ ప్రతిబంధకం అవుతోంది.
అతను ఎలా కనిపించినా తమిళ ప్రేక్షకులు చూసేస్తారు కానీ మరీ అలా ముసలాడిలా కనిపిస్తూ తమన్నాతో డాన్సులు కడుతుంటే చూసి తట్టుకోవడం మనవాళ్లకి కాస్త కష్టమే. ఇక తమిళనాడులో బాగా ఆడిన చిన్న సినిమా ‘భద్రమ్’ ఇక్కడ పెద్దగా టాక్ తెచ్చుకోలేకపోయింది. తొందరపడి సక్సెస్‌మీట్లు గట్రా చేసేస్తున్నారు కానీ సినిమాలో అంత మేటర్ లేదు. సోమవారం నుంచి ఈ సినిమాలన్నీ కూడా నామమాత్రపు వసూళ్లు తెచ్చుకోవడం కష్టమే అంటున్నారు. దీంతో మరోసారి ఫోకస్ బాలయ్య మీదకే షిఫ్ట్ అయింది. ఇక ఈ స్లంప్‌లోంచి తెలుగు సినిమాని బయటపడేసే బాధ్యత లెజెండ్‌దే. బాలయ్య ఏం చేస్తాడో కానీ చాలా వారాల తర్వాత మళ్లీ కోట్ల కుంభవృష్టి ఈ సినిమాతోనే చూస్తామనే అంచనాలున్నాయి.
About the Author

0 comments:
Post a Comment