'తూనీగ తూనీగ' సినిమాతో వెండితెరకు పరిచయమైన హీరోయిన్ రియా చక్రవర్తి. ఈ ముద్దుగుమ్మకు తాజాగా ఓ చేదు అనుభవం ఎదురైందట. లిఫ్ట్‌లో ఎవరో గుర్తితెలియని వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె వాపోతోంది. ఈ విషయంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని రియా ట్విట్టర్ అకౌంట్‌లో కూడా పోస్ట్ చేసింది. మంగళవారం సాయంత్రం తాను ఉండే అపార్ట్‌మెంట్‌కి వచ్చిన రియా, ఫ్లాట్‌కి వెళ్లడానికి లిఫ్ట్‌లోకి వెళ్లిందట. అదేసమయంలో ఆ పక్కనే మెట్లదారిలో పై అంతస్తుకి వెళ్తున్న ఓ వ్యక్తి వెంటనే పరుగున లిఫ్ట్‌లోకి వచ్చి, ఒంటరిగా ఉన్న తనని బయటకు చెప్పలేని శరీరభాగాలను తాకినట్టు పేర్కొంది.
పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించి మరో అంతస్తులో లిఫ్టును ఆపి.. అతన్ని లిఫ్ట్‌లోంచి బయటకు తోసేశానని చెప్పి ఆమె వాపోయింది. పట్టపగలే అది కూడా ఇద్దరు వాచ్‌మెన్లు వున్న అపార్ట్‌మెంట్‌లోకి వచ్చి తన ఇష్టానుసారం అసభ్యంగా ప్రవర్తించి వెళ్లాడంటే తాము నివశించే కాంపౌండ్‌లోనూ భద్రత లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
About the Author

0 comments:
Post a Comment