
న్యూఢిల్లీ: మళ్లీ భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటానని, తన బెస్ట్ పాట్నర్ గౌతమ్ గంభీర్‌తో జాతీయ జట్టుకు ఓపెనర్‌గా తిరిగి వస్తానని డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. గంభీర్‌తో టెస్టుల్లో చాలా కాలం ఓపెనింగ్ చేశానన్నాడు. తొలుత ఐపిఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో కూడా ఇద్దరం కలిసే ఆడామని చెప్పాడు. తాను భారత జాతీయ జట్టుకు ఆడుతూ మళ్లీ గంభీర్‌తో ఓపెనింగ్ చేయాలని అశిస్తున్నట్లు తెలిపాడు. తాను తిరిగి టీమిండియా జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సెహ్వాగ్ అన్నాడు. ఆటగాళ్లందరికీ వేలం ఉంచడం వల్ల కలిస్, యువరాజ్ సింగ్ లాంటి మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఫ్రాంచైజీలకు దక్కిందన్నాడు. అయితే అన్ని ఫార్మెట్‌లలోనూ గౌతమ్ గంభీర్‌తో కలిసి ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడు. తాను రిటై ర్మెంట్ ప్రకటించే ముందు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుందని సెహ్వాగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
|
About the Author

0 comments:
Post a Comment