
'ఎవరే... ఎవరే... ఎవరే సుబ్రమణ్యన్?' అనుకుంటున్నారా. ఆయన అమెరికాలోని మేరీలాండ్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్. లష్కరె తోయబా, ఇండియన్ ముజాహిదీన్ల కార్యకలాపాలను కంప్యూటర్ సాఫ్ట్ వేర్ సాయంతో అధ్యయనం చేసిన సుబ్రమణియన్ మే నెలలోపు ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని అంటున్నారు. తాము తయారుచేసిన కంప్యూటర్ మోడల్స్ ఈ దాడి జరిగే అవకాశం ఉందని చెబుతున్నాయని ఆయన ఢంకా బజాయిస్తున్నారు.
ఇండియన్ ముజాహిదీన్ టెర్రరిస్టులు భారీ సంఖ్యలో అరెస్టయిన కొన్ని రోజులకే ఉగ్రవాద దాడులు జరిగాయని, అదే విధంగా భారత, పాక్ దౌత్య సంబంధాలు కొద్దిగా మెరుగుపడగానే ఈ దాడులు జరుగుతాయని ఆయన లెక్క వేసి మరీ చెబుతున్నారు. కాబట్టి మే నెలలోపు దాడులు జరగడం ఖాయమని ఆయన అంటున్నారు.సరిగ్గా ఎన్నికల వేడి పుంజుకోగానే ఈ దాడులు జరుగుతాయంటున్నారు ఆయన. ఆదివారం నాడు నరేంద్ర మోడీని టార్గెట్ చేయాలని ప్లాన్ వేస్తున్న నలుగురు ఇండియన్ ముజాహిదీన్ టెర్రరిస్టులు అరెస్టు కావడం గమనార్హం.
About the Author

0 comments:
Post a Comment