

కామారెడ్డి, న్యూస్‌లైన్: పవన్ కళ్యాణ్‌కు పరిటాల రవి సగం గుండు గీయించారని, తాను మాత్రం పూర్తి గుండు గీయిస్తానని తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడు షబ్బీర్‌అలీ హెచ్చరించారు. బుధవారం ఆయన కామారెడ్డిలో నిర్వహిం చిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌కూ హటావో దేశ్‌కూ బచావో అనడం కాదు.. మొదలు నీ ఇంటిని సరిదిద్దుకో’’ అని పవన్‌కళ్యాణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇంట్లో భార్యను కంట్రోల్ చేయనివాడు రాజకీయాలలో ఎలా అభివృద్ధి చేస్తాడో చెప్పాలని ప్రశ్నించారు. గబ్బర్‌సింగ్ నువ్వా, నేనా అని పవన్‌కళ్యాణ్‌కు పంచ్‌ఇచ్చారు.
About the Author

0 comments:
Post a Comment