
నాగ్‌కి కూడా బుల్లితెరపై ఓ ప్రత్యేక అభిమానం ఉంది. ఆయన సారథ్యంలో పలు టీవీ సీరియల్స్ కూడా రూపొందాయి. అయితే ఆయన అక్కడితోనే ఆగిపోవాలనుకోవడం లేదు. ‘‘ఓ టీవీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించాలని ఉంద’’ని ఫేస్ బుక్‌లో పేర్కొన్నారు. ‘‘ప్రస్తుత కాలంలో టీవీ ఓ ముఖ్యమైన మాధ్యమం అయిపోయింది. ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ కావడానికి ఇదొక మంచి సాధనం’’ అని నాగ్ వ్యాఖ్యానించారు. ఈ మాటలను బట్టి చూస్తే త్వరలో నాగ్ బుల్లితెరపై ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లాంటి స్పెషల్ ప్రోగ్రామ్‌లో కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు.
About the Author

0 comments:
Post a Comment