కొందరు తారలు ఏం చేసినా అవి కలకలం రేపుతాయి. అలాంటి వారిలో సినిమా రంగానికి సంబంధించి శింబు, నయనతార ముందుం టారు. అందుకే వాళ్లు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. శింబు, నయనతార ఒకప్పుడు ప్రేమికులన్న విషయం తెలిసిం దే. వారలా గాఢంగా ప్రేమలో లీనమై ఫొటోలు అప్పట్లో ఇంటర్నెట్లో హల్చల్ చేసి కలకలం సృష్టించారుు. నయనతార జీవితంలో కల్లోలం పుట్టించింది కూడా ఈ ఫొటో ఉదంతమే. ఆ ఫొటోను శింబునే కావాలని ఇంటర్నెట్లో ప్రచారం చేశారన్న భావనతో నయనతార ఆయనకు దూరం అయ్యారు. ఆ తరువాత ఆమె ప్రభుదేవా ప్రేమలో, శింబు హన్సిక లవ్లో పడ్డారు. ఈ ప్రేమ కథలు కంచికే చేరాయి.
ప్రస్తుతం శింబు మాజీ ప్రేయసి నయనతారతో మళ్లీ కలిసి నటించడం విశేషం. ఎవరినయినా ప్రేమిస్తానుగానీ శింబును మాత్రం జీవితంలో క్షమించనన్న నయనతార ప్రస్తుతం ఆయనతో సన్నిహితంగా ఉండడం సినీ వర్గాలకే షాక్ కలిగిస్తున్న అంశం. ప్రస్తుతం ఇదు నమ్మ ఆళు చిత్రంలో నటిస్తున్న ఈ సంచలన జంటపై కోడంబాక్కంలో రకరకాల ప్రచారం జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే శింబు ఇటీవల నయనతారతో సన్నిహితంగా ఉండే ఫొటోను తన సెల్ఫోన్లో బంధించి దాన్ని మరోసారి ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం నెట్లో హల్చల్ చేస్తున్న ఈ ఫొటో కథ ఎటు దారి తీస్తుందోనంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.

About the Author

1 comments:
Its common in general, whats wrong in it....
Post a Comment