Contact

Text

Thursday, 1 May 2014

గడ్డం బాబాల పంజరంలో పవన్ కళ్యాణ్!

06:42 - By Unknown 0

పంజరంలో పెట్టి చిలకతో పలికించడం జోతిష్కుడికి తప్పని పరిస్థితి. ఎందుకంటే జ్యోతిష్కుడి, చిలకకు జీవన్మరణ సమస్య. అలాగే  ప్రస్తుత రాజకీయాల్లో రాష్ట్రంలో ఒకరికి, దేశ స్థాయిలో మరొకరిది కూడా జీవన్మరణ సమస్యతో బాధపడుతున్న ఇదర్దు నేతలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్తగా ఓ చిలుక పట్టారు. తాము చెబితే ప్రజలు విశ్వసించరని, నమ్మరని అనుకున్నారో ఏమో.. ఓ చిలకను పట్టుకొచ్చి ఆటాడిస్తున్నారు. 
 
కారణాలేమై ఉంటాయో, ఎలాంటి పరిస్థితులు అతన్ని చిలుకగా మారడానికి కారణమయ్యాయో ఏమో కాని... ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అస్థిత్వం కోసం తంటాలు పడుతున్న చంద్రబాబు, కార్పోరేట్ సంస్థల రిమోట్ గా మారిన నరేంద్రమోడీ పంజరంలో పవన్ బందీగా మారాడు. లాజిక్కులేని, అవాస్తవ ఆరోపణలతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న పవన్ కళ్యాణ్ తీరుపై అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. విద్యార్ధులు, మహిళలు, వృద్దులు, ఇతర వర్గాల మేలే పరమావధిగా, ప్రజా సంక్షేమే లక్ష్యంగా చివరి శ్వాస వరకు తన జీవితాన్ని రాష్ట్రానికి అంకితమిచ్చిన మహానేతపై బురద జల్లే విధంగా ప్రవర్తిస్తూ.. ఆంధ్రప్రదేశ్ సంక్షేమానికి, అభివృద్దికి అసలు సిసలు 'గబ్బర్ సింగ్'లా మారుతున్నారనేది అత్యధిక వర్గాల అభిప్రాయం.
 
గతంలో యువరాజ్యం పేరుతో కనీసం ఓ వర్గంలోని పిడికెడు మందిని కూడా ఆకర్షించలేకపోవడం పక్కన పెడుదాం. కనీసం పట్టుమని పది సీట్లు గెలుచుకోవడానికి కనీస ప్రభావం చూపలేని వ్యక్తిగా మారి.. ఎన్నికల తర్వాత ముఖానికి రంగేసుకుని.. మళ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో హడావిడిగా జనసేన దుకాణం పెట్టేసి.. ప్రజలను తప్పు దోవ పట్టించడానికి మోడీ, చంద్రబాబు చేతిలో కీలు బొమ్మగా మారిన 'తిక్క'న్నపై తీరు చర్చనీయాంశమైంది. తనకు ఎలాంటి ఆశలు లేవని.. ప్రజలకు మేలు జరగడమే తన ఆశయం అంటున్న పవన్ బాబా ఎజెండాపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
మహానేత అకాల మరణం తర్వాత రాష్ట్ర పరిస్థితి అధ్వాన్నంగా మారిన సమయంలో అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ, ప్రజల కోసమే రాష్ట్రమంతటా పర్యటిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి జననేతపై తప్పుడు విమర్శలు ఎక్కుపెడుతున్న పవన్ దిగజారుడుతనంపై జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైతులు, విద్యార్ధులు, చేనేత దీక్షలతో ప్రజలకు భరోసా కల్పించిన వైఎస్ జగన్ పై అభాండాలు వేయడం తగదని బహిరంగంగానే ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రైతులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపించిన ఓ నేతకు అడుగులకు మడుగులొత్తడం, మత ఘర్షణలను ప్రేరేపించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ఓ వ్యక్తికి తొత్తుగా మారిన పవన్ కళ్యాణ్ ను ప్రజలు క్షమించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రజారాజ్యం పార్టీని 70 కోట్లకు అమ్మకానికి పెట్టిన  'అన్నయ్య' ఊసే వెత్తకపోవడం.. పవన్ తీరు గురువిందను తలపిస్తోందని మెజార్టీ ప్రజలు అంటున్నారు. వాస్తవాలను గ్రహించి..ఇద్దరు బాబాల పంజరం నుంచి పవన్ విముక్తవ్వాలని ఆశిద్దాం!

About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top