
ఏ ఫీలింగైనా శరీర తత్వం, మనస్తత్వాన్ని బట్టే ఉంటాయి. ఇక, హాలీవుడ్ హాట్ లేడీ జెన్నిఫర్ లోపెజ్ గురించి చెప్పాలంటే... ఆమె వయసు 44. కానీ, మనసు వయసు మాత్రం 28 అంటారామె. ప్రస్తుతం జెన్నీ ఓ ధారావాహికలో నటిస్తున్నారు. అలాగే ఓ ఆల్బమ్ రూపొందిస్తున్నారు. ఓ వస్త్ర దుకాణానికి అధినేత కూడా.
ఆరేళ్ల కవలలకు తల్లి. ఇన్ని బాధ్యతలను సునాయాసంగా మోసేస్తున్నారు జెన్నిఫర్. కుర్ర తారలు సైతం పోటీపడలేనంత ఎనర్జీ ఆమె సొంతం. ఎందుకంటే, తన వంటి మీదకు వయసు పెరుగుతున్నట్లు ఎప్పుడూ ఫీలవలేదట జెన్నిఫర్. ఏళ్లు గడిచే కొద్దీ వయసు పెరగడం సహజం అని, దాంతోపాటే తన ఎనర్జీ కూడా పెరుగుతోందని ఆమె పేర్కొన్నారు.
About the Author

0 comments:
Post a Comment