
అటువంటి వ్యక్తి కుమార్తె దేశంలోని ఓ పార్టీ ఉన్నత స్థానంలో ఉండటం సరికాదని అభిప్రాయపడ్డారు. తాను ప్రత్యక్షరాజకీయాల నుంచి దూరంగా ఉన్నంత మాత్రాన ఇతర పార్టీ నాయకులకు మద్దతు ఇస్తున్నట్లు కాదన్నారు. ఈ విషయంలో కొంతమంది నాయకులు ప్రజలను, కార్యకర్తలను అనవసరంగా గందరగోళానికి గురిచేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
తనకు రాజకీయ జీవితం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ తల్లితో సమానమన్నారు. అందువల్ల రాజకీయాల్లో కొనసాగితే అది బీజేపీతో మాత్రమేనన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర పార్టీల్లో చేరే అవకాశం లేదన్నారు. ఇదిలా ఉండగా సోనియగాంధీపై తన వాఖ్యల పట్ల రాందాస్ విషాదం వ్యక్తం చేశారు. ఆవిధంగా మాట్లాడకుండా ఉండాల్సిందని పేర్కొన్నారు.
About the Author

0 comments:
Post a Comment