హైదరాబాద్: సినీ నటుడు నందమూరి బాలకృష్ణను రాజకీ యంగా అడ్డు తొలగించుకునేందుకు టీడీపీఅధ్యక్షుడు చంద్రబాబు మరో కొత్త పథక రచన చేస్తున్నారు. ఇటు సీమాంధ్రలోనూ అటు తెలంగాణలోనూ పార్టీ బలంగా ఉండాలంటే కుటుంబంలోని ఒకరు తెలంగాణలో పోటీచేయాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నా రు. అయితే బాలకృష్ణ మాత్రం అందుకు ససేమిరా అంటున్నట్లు సమాచారం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని బాలకృష్ణ ఎంతో కాలం నుంచి ఆసక్తిగా ఉన్నారు. ఆయన కోరిక తీరకుండా ఎప్పటికపుడు చంద్రబాబు మోకాలడ్డుతున్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందూపురం నుంచి పోటీచేయాలని బాలకృష్ణ భావిస్తున్నారు.శుక్రవారం కర్నూలు జిల్లాలో ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు.
అక్కడినుంచి అవకాశం లేకపోతే కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి బరిలోకి దిగుతానని ఆయన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. అయితే బాబు మాత్రం బాలకృష్ణను అడుగు ముందుకు వేయనివ్వటం లేదు. రెండు రాష్ట్రాల్లో పార్టీని బలంగా ఉండాలి కాబట్టి చెరో ప్రాంతంలో పోటీ చేద్దామని ప్రతిపాదించినట్టు తెలిసింది. తాను చిత్తూరుజిల్లా కుప్పం నుంచి పోటీచేస్తున్నాను కాబట్టి మీరు అనంతపురం జిల్లా హిందూపురానికి బదులు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో పోటీ చేయాల్సిందిగా సూచించారు.
0 comments:
Post a Comment