తన సోదరుడు కమల్ కు శివప్రసాద్ మంచి మిత్రుడని, ఆయన తనకు బంధువులాంటి వాడని ఊర్వశి తెలిపారు. తమ కుటుంబం గురించి ఆయనకు బాగా తెలుసునని చెప్పారు. మలయాళ నటుడు మనోజ్ కె జయన్ ను 2000లో ఊర్వశి వివాహం చేసుకున్నారు. 2008లో వీరిద్దరూ వీడిపోయారు. అప్పటినుంచి మళ్లీ సినిమాలు, సీరియళ్లలో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో ఆమె నటించారు. కమల్ హాసన్ తో ఆమె నటించిన సతీ లీలావతి తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందింది.
0 comments:
Post a Comment