ముంబై : దేశ ఆర్థిక రాజధాని, బాలీవుడ్ ప్రధాన కేంద్రం ముంబై శివార్లలోని గోరెగావ్ ప్రాంతంలో వివాహితపై అత్యాచారం చేసిన 22 ఏళ్ల స్పాట్ బోయ్ ని పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి ఆరే కాలనీలో ఓ మురికివాడలో ఉండే సద్దాం ఖాన్, అదే ప్రాంతంలో ఉండే ఓ వివాహితపై అత్యాచారానికి పాల్ప్డడ్డాడు. తాను ఒంటరిగా ఉన్న సమయం చూసి ఇంట్లోకి చొరబడి, నోరు నొక్కి అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని అతడు బెదిరించినట్లు కూడా వాపోయింది.
తీవ్రంగా భయాందోళనలకు గురైన బాధితురాలు.. ఫిలిం సిటీలోనే పనిచేసే తన భర్తకు ఈ విషయం చెప్పడానికి చాలా భయపడింది. ఎట్టకేలకు మూడు రోజుల తర్వాత ధైర్యం తెచ్చుకుని జరిగిన సంఘటనను అతడికి తెలిపింది. నిందితుడు సద్దాం ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకుముందు కూడా ఆరే పోలీసు స్టేషన్ లో అతడిపై ఓ అత్యాచారం కేసు నమోదైంది.
|
0 comments:
Post a Comment