టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ నిప్పులు చెరిగారు. కేసీఆర్, జగన్ అవినీతి అవిభక్త కవలలని, కేసీఆర్ ఒకవైపు, జగన్ మరో వైపు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడానికి సిద్దమవుతున్నారని ఆరోపించారు. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ చార్మినార్ వద్ద చిలక జోస్యం చెప్పుకుంటారని, జగన్ చంచల్ గూడ జైలుకు వెళతారని, చంద్రబాబు మాత్రం సచివాలయానికి వెళ్లి చక్రం తిప్పుతారని చెప్పుకొచ్చారు.
రాజేంద్రప్రసాద్ శనివారం మీడియాతో మాట్లాడుతూ గత రెండుసార్లు మాదిరిగానే ఈసారి కూడా టీఆర్ఎస్ ఓటమి చెందుతుందని అన్నారు. ఆ నిరాశతోనే టీడీపీపై విమర్శలు చేస్తున్నారని, ద్వేషంతో మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్, జగన్‌లది కాంగ్రెస్ డీఎన్ఏనే అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత హరీష్ రావు నేతృత్వంలో పార్టీ చీలే అవకాశం ఉన్నందున కేసీఆర్ కాంగ్రెస్ కు మద్దతిస్తానని చెబుతున్నాడని ఆరోపించారు.
0 comments:
Post a Comment