తాను చేపట్టిన సొంత సర్వేలో వందకు పైగా సీట్లు గెలుచుకుని సీమాంధ్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, నారా చంద్రబాబు నాయుడు చాప్టర్ క్లోజ్ అని ప్రకటించి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇచ్చిన షాక్ తో టీడీపీలో దుమారం రేగుతోంది. దీనినుంచి తేరుకున్న తెలుగుతమ్ముళ్ళు కేసీఆర్, జగన్ లపై ఎదురుదాడికి దిగారు. కేసీఆర్, జగన్ ల మధ్య రహస్య ఒప్పందం ఉందని మేం ఎప్పటినుంచో నెత్తీనోరూ కొట్టుకుని చెబుతున్నామని, తమ తరుపున ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్నీ సీమాంధ్రలో విస్తృతంగా ‘ప్రశ్నించారని’ అది ఇప్పుడు అక్షరాల నిజమైందని ఆరోపిస్తున్నారు. సీమాంధ్ర ముఖ్యమంత్రిని నిర్ణయించడానికి కేసీఆర్ ఎవరని ప్రశ్నిస్తున్నారు.
కేసీఆర్, జగన్ లు ఎప్పుడూ తిట్టుకోరని వారి మధ్య రహస్య ఒప్పందం ఉందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని, తెలంగాణాను దోచుకున్న వైఎస్ కుటుంబాన్ని కేసీఆర్ వెనకేసుకు రావడం గర్హనీయమని మండిపడ్డారు. ఈ కుట్రను ప్రజలు అర్ధం చేసుకుంటారని చెప్పుకొచ్చారు. నిజానికి ఇంటెలిజెన్స్ వర్గాల అంతర్గత సర్వే ప్రకారం టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని తమకు సమాచారముందని, సీమాంధ్రలో వాస్తవ పరిస్తితి ఇలా ఉంటే కేసీఆర్ మాత్రం జగన్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పడం అయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కాగా ఇంటెలిజెన్స్ వర్గాల అంతర్గత సర్వే టీడీపీకే అనుకూలంగా ఉందని చెప్పిన సదరు నాయకులు, ఫలితాలు వచ్చేవరకు మెజారిటీ ఎవరికీ వస్తుందో చెప్పలేమని ఒప్పుకోవడం గమనార్హం!!

About the Author

0 comments:
Post a Comment