*ప్రేమించిన యువతి మోసం చేస్తే..
*మందు బాటిళ్లు ఖాళీ చేసే భగ్నప్రేమికులు తెలుసు.
*మనసు చెదిరి పిచ్చెక్కిన వాళ్లను చూశాం.
*జీవితంపై విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడ్డ వారూ ఉన్నారు.
*కానీ... రొటీన్‌కు భిన్నంగా వ్యవహరించాడో యువకుడు.
బంజారాహిల్స్ : ప్రేమించినన్ని రోజులూ తనతో పెట్టించిన ఖర్చు తిరిగి తనకిప్పించాలని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడో యువకుడు. అవాక్కవడం పోలీసుల వంతైంది. జూబ్లీహిల్స్‌లో నివసించే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. కానీ ప్రేమించిన యువతి అనివార్య కారణాలతో మరో యువకుడిని పెళ్లాడింది. దీంతో ఈ భగ్న ప్రేమికుడు తీవ్ర నిరాశకు గురయ్యాడు.
ప్రేమించిన యువతి ఎలాగూ దక్కలేదు.. ప్రేమించుకున్న రోజుల్లో ఆమెకు ఖర్చు పెట్టిందంతా కక్కించండంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది విన్న పోలీసులు ఔరా... అని ముక్కు మీద వేలేసుకున్నారు. ఇదెక్కడి కేసురా...? దేవుడా అనుకుంటూ నాలుగు నీతి వాక్యాలు చెప్పి ఎలాగోలా ఆ యువకుడికి నచ్చజెప్పి పంపించారు. అయితే ఆ భగ్నప్రేమికుడు మాత్రం కేసు నమోదు చేయాల్సిందేనంటూ ఫిర్యాదును ఇచ్చి వెనుదిరిగాడు.

About the Author

0 comments:
Post a Comment