తెలుగుదేశం పార్టీ, బీజేపీ తరుపున తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీల గెలుగుపుపై ఆయనకున్న అభిప్రాయమిదే అని వెలువడుతున్న వార్తలు టీడీపీలో అంతకు మించి పవన్ అభిమానుల్లో దుమారం రేగుతోంది. టీడీపీ-బీజేపీ కూటమికి మెజారిటీ వచ్చే సీన్ లేదని తేలిపోయిందని, రాష్ట్రంలో టీడీపీ ఓడిపోయినా కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ అధికారంలో రావడం ఖాయమని పవన్ విశ్వసిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
ఒకవైపు ఈ వార్తలపట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు ఇదంతా ప్రత్యర్థ పార్టీల కుట్ర అని కొట్టిపారేస్తున్నారు. పుండుమీద కారం చల్లిన విధంగా, టీడీపీ అధికారంలోకి వచ్చే పరిస్తితి లేదని పవన్ కు ముందే తెలుసనీ కానీ ‘ఇతరత్రా’ కారణాల వల్లనే ప్రచారం చేయవలసి వచ్చిందని అనుకున్నారని ఒక ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. ఇటువంటి ప్రచారంపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పవన్ ప్రచారం చేసిన పార్టీలు ఓడిపోతే ‘పవనిజం’ ప్రశ్నార్ధకం అవుతుందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు అయన అభిమానులు!

About the Author

0 comments:
Post a Comment