సీమాంధ్ర ప్రాంతంలో గతంలో జరిగిన సర్వేలు, పోలింగ్ తర్వాత జరిపిన ఎగ్జిట్ పోల్స్ వివరాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని వెల్లడి కావడంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ నాయకత్వం ఇప్పుడు ఇబ్బందికర పరిస్తితిని ఎదుర్కొంటోంది. తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్న కారణంతో ఇన్నాళ్ళూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంతగా పట్టించుకోని బీజేపీకి వాస్తవ పరిస్తితి తెలిసొచ్చినట్లుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు కోరనున్నాడన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి.
జగన్ మద్దతుతోపాటు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తదితరుల మద్దతుకోసం కూడా బీజేపీ ప్రయత్నించబోతుందని శనివారం మీడియాలో ఈమేరకు వార్తలొచ్చాయి. దీంతో టీడీపీ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఈ పరిస్తితిని ముందే అంచనా వేసిన మోడీ, సీమాంధ్రలో ప్రచారం చేస్తూ జగన్ ను పరోక్షంగా మాత్రమే విమర్శించారని, ఇక జగన్ పార్టీకే ఎక్కువ సీట్లు రానున్నాయని తేలడంతో బీజేపీ ఇక టీడీపీకి టాటా చెప్పేసి జగన్ చెంతన చేరడం ఖాయమని అంటున్నారు. కేంద్రంలో ఎవరొచ్చినా తమ వద్దకే రావాలని, తలవంచమని చెప్పిన జగన్ మాటలు నిజమని నిరూపితం అవ్వబోతున్నాయన్నమాట!

About the Author

0 comments:
Post a Comment