సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ రానుందని పలు సర్వేలు, రాజకీయ విశ్లేషకులు, పార్టీ అధినేతలు కూడా ఇప్పటివరకు అభిప్రాయాలను వెల్లడించగా, తాజాగా అందుతున్న సమాచారాన్నిబట్టి కేంద్ర ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఇంటలిజెన్స్ నివేదికలపై ‘హైదరాబాద్ ఫస్ట్’కు అందిన సమాచారం ప్రకారం, సీమాంధ్రలో వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రానుండగా, తెలంగాణాలో టీఆర్ఎస్ కు స్పష్టమైన మెజారిటీకి ఐదారు సీట్లు తక్కువ రావచ్చని తెలిపింది. సీమాంధ్రలో పోలింగ్ పూర్తిగా ఏకపక్షంగా జరిగిందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడని, అనుభవం లేదనే ప్రచారం జరిగినా ప్రజలు ఆయననే విశ్వసించారని స్పష్టం చేశాయి. వైఎస్ఆర్ సీపీ ఓటర్లనుంచి పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టిందని అసెంబ్లీ, లోక్ సభ సీట్లలో తన హవాను కొనసాగించిందని తెలిపింది.
ఇంటలిజెన్స్ నివేదికల ప్రకారం వైఎస్ఆర్ సీపీ 130 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని, తెలుగుదేశం పార్టీ 35-45 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. లోక్ సభ సీట్లలో 21-23 వైఎస్ఆర్ సీపే, టీడీపీ-బీజేపీ 1-3 గెలుచుకోవచ్చని సమాచారం. తెలంగాణాలో 55-60 సీట్లతో టీఆర్ఎస్ అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలిచే పార్టీగా అవతరిస్తుందని, కాంగ్రెస్ 40-45, లోక్‌సభ సీట్ల విషయానికొస్తే టీఆర్ఎస్ 9-12, కాంగ్రెస్ 5-6, ఎంఐఎం 1, బీజేపీ 1-2 గెలుచుకోవచ్చని నివేదికల సారాంశం!!

About the Author

0 comments:
Post a Comment