బాలయ్యబాబు సీమాంధ్ర టీడీపీ పగ్గాలను కోరుకొన్నాడు. అందుకు సంబంధించిన ప్రతిపాదనా పత్రాలతో తన ప్రతినిధులను బాబు వద్దకు పంపించాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే చంద్రబాబు మాత్రం దానికి ఒప్పుకోలేదు. మధ్యవర్తులుగా వచ్చిన వారిని చెడామడా తిట్టి వెనక్కు పంపించాడు తెలుగుదేశం అధ్యక్షుడు. అయితే మీడియా ముందు మాత్రం బాబు కొంచెం జాగ్రత్తగా మాట్లాడి... బాలయ్య కు పార్టీ పదవి కాదు, కోరుకొన్న చోట టికెట్ ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించాడు!
అయితే ఇప్పుడు నందమూరి నటసింహానికి ఆ ఆనందం కూడా ఆవిరి అవుతున్నట్టు సమాచారం! అవకాశం వస్తే హిందూపురం ఎంపీగా పోటీ చేద్ధామనేది బాలకృష్ణ కోరిక. ఈ విషయంపై ఆయన మూడేళ్ల కిందటే క్లారిటీ ఇచ్చాడు. అప్పట్లో అనంతపురం జిల్లాలో జరిగిన తారల క్రికెట్ మ్యాచ్ ఆడటానికి వెళ్లిన బాలయ్యబాబు వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి సిద్ధం అని ప్రకటన చేశాడు. అప్పటి నుంచి హిందూపురం పేరు బాలయ్య లిస్టులో ఉందని తెలుస్తోంది.
తాజా సమాచారం ఏమిటంటే చంద్రబాబు ఆ సీటును కూడా వలసవాదులకు ఆఫర్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో ప్రజారాజ్యం తరపున ఇదే నియోజకవర్గం ఉంచి పోటీ చేసిన కడపల శ్రీకాంత్ రెడ్డికి చంద్రబాబు ఈ టికెట్ ఆఫర్ చేస్తున్నాడట. దీనికి సంబంధించి ముప్పై కోట్ల రూపాయల పార్టీ ఫండ్ తో డీల్ కుదిరినట్టు వార్తలు వస్తున్నాయి! ఇప్పటికే అనంతపురం ఎంపీ టికెట్ ను జేసీ సోదరులకు ఇచ్చే శాడట చంద్రబాబు నాయుడు. ఆ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని అన్ని శాసనసభ స్థానాల్లోనూ ఖర్చు పెట్టుకొనే డీల్ మీద చంద్రబాబు జేసీ బ్రోస్ కు అనంత టికెట్ ను కేటాయించినట్టు పుకార్లున్నాయి.
ఇప్పుడు హిందూపురం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టుకోవాలనే షరతుతో హిందూపురం ఎంపీ టికెట్ ను కడపలకు కేటాయించే ఉద్దేశంతో ఉన్నాడట చంద్రబాబు నాయుడు! ఈ ఖర్చు మొత్తం ముప్పై కోట్ల వరకూ ఉంటుందట! ఈ డీల్ పట్ల కడపల కూడా సుముఖంగానే ఉన్నాడట! అయితే ఈయన చివరిసారి జనాలకు కనిపించింది 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థిగా మాత్రమే. ఆ తర్వాత ఎవరికీ కనపడకుండా పోయిన ఈయన రేపు టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి!
ఇలా ఉందట తెలుగుదేశం అధినేత తీరు. బాలయ్య ఆశలుపెట్టుకొన్నాడు, తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న నియోజకవర్గం అనే ఆలోచనలనేమీ పెట్టుకోకుండా హిందూపురం సీటును కూడా వలస పక్షులకే ఇచ్చేయడానికి రెడీ అయ్యాడట! మరి ఇలాంటి పరిణామాలను చూసి అభిమానులు ఏమనుకొంటారో!
0 comments:
Post a Comment