హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ మరోసారి మండిపడింది. టీడీపీకి ఎమ్మెల్యేలు కరువైనట్లు ఉన్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. శనివారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మాట్లాడిన ఆమె.. టీడీపీకి కేడర్ తో పాటు, ఎమ్మెల్యేలు ఎవరూ లేనట్లు ఆ పార్టీలో చేరిన కాంగ్రెస్ వారిని చంద్రబాబు నాయుడు పెద్ద బలంగా భావిస్తున్నారని విమర్శించారు. ఆనాడు ఎఫ్ డీఐల విషయంలో కాంగ్రెస్ కు టీడీపీ సహకరించిన విధానాన్ని వాసిరెడ్డి పద్మ మరోమారు గుర్తు చేశారు. అప్పట్నుంచి రెండు పార్టీ విధానాలు ఒకటేనన్న విషయం అందరికీ అర్ధమైందన్నారు. ఇక టీడీపీ దుకాణాన్ని మూసుకోవాల్సిందేనన్నారు.
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను ఓదర్పుయాత్ర చేయొద్దనడం నుండి రాష్ట్ర విభజన వరకు కాంగ్రెస్ ఎన్నో తప్పులు చేస్తూ పోతే, దానికి టీడీపీ పునరావాసం అయిందన్నారు. చంద్రబాబుకు ప్రజల కోసం పాటుపడడానికి ఏనాడు చేతులు రాలేదు కాని, ఈ రోజు పార్టీలో చేరిన వారికి పచ్చ జెండాలు కప్పడానికి మాత్రం చేతులు వస్తున్నాయని విమర్శించారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన టీడీపీని ఎవరూ నమ్మడం లేదని వాసిరెడ్డి పద్మ తెలిపారు
.
0 comments:
Post a Comment