హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర ప్రచార కమిటీ చీఫ్ చిరంజీవి ఆదివారం తన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతల బస్సుయాత్ర సీమాంధ్రలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జనసేన పార్టీపై చిరు అభిప్రాయాన్ని విలేకరులు అడిగారు. తాను జనసేన పార్టీని ఆహ్వానిస్తున్నాని చిరు చెప్పారు. అదే సమయంలో ఆయన ఆసక్తికరమై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్ని కొత్త పార్టీలు వస్తే అంత మంచిదని, ఎక్కువ పార్టీలు వస్తే ఆశావహులకు టిక్కెట్లు లభిస్తాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి రావాలని చిరు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ద్వారా కొంతమందికి అవకాశం రావచ్చునని అన్నారు. అయితే, పార్టీలు పుట్టుకు వస్తే ఆశావహులకు టిక్కెట్లు ఇస్తామని చెప్పిన చిరంజీవి జనసేన పార్టీని ఎద్దేవా చేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు
0 comments:
Post a Comment