స్వామివారి దర్శనం అనంతరం అంకిత విలేకర్లతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి శివయ్య ఆశీస్సులతోనైనా వివాహం జరుగుతుందనే ఆశతో ఆయన సన్నిధిలో రాహుకేతు పూజలు చేయించుకున్నట్లు తెలిపింది. తాను అమెరికాలో చదువుకుంటున్నానని ప్రస్తుతం వివాహం చేసుకునే పనిలో ఉన్నానని... వివాహం తర్వాత సినిమాలు చేయాలా వద్దా...? అనేది చెబుతానని అంకిత తెలిపింది.
'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో తెరంగేట్రం చేసిన అంకిత... ఆ సినిమా తరువాత పెద్ద హీరోలతో పలు సినిమాలలో నటించినా తెలుగునాట అంతగా ఆదరణ లభించలేదు. దాంతో తెలుగులో అవకాశాలు రాకపోవడంతో ఆమె తమిళనాట అడుగు పెట్టింది. అక్కడ కూడా అవకాశాలు లేకపోవటంతో
అంకిత అమెరికాలో పలు స్టేజీ షోలు చేసింది.
0 comments:
Post a Comment