సన్నీలియోన్ పరిచయం అక్కర్లేని పేరు. నీలిచిత్రాల తారగా మంచి పాపులర్ అయిన సన్నీలియోన్ ఆ సినిమాలకు గుడ్‌బై చెప్పేసి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. జిస్మ్-2, జాక్‌పాట్ సినిమాలలో సన్నీ చాలా హాట్ హాట్‌గా నటించింది. ఇందులో ఆమె అంగాంగ ప్రదర్శన చేసినా బాక్సాఫీసు వద్ద విజయాలు సాధించలేకపోయాయి. దీంతో సన్నీ గ్లామర్‌కే తప్పించి నటనకు పనికిరాదని విమర్శలు వచ్చాయి.
తాజాగా సన్నీలియోన్ రాగిణి ఎంఎంఎస్-2 సినిమాలో నటించింది. ఈ సినిమాతో బూతు హీరోయిన్ అనే ఇమేజ్‌ను చేరిపేసుకుంటానని సన్నీలియోన్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. తన మొదట రెండు సినిమాలకంటే ఈ సినిమాలో నటిగా మెరుగుపడ్డానని సన్నీలియోన్ భావిస్తోంది. ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డానని ఆమె చెబుతోంది.
ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశం షూటింగ్ సమయంలో తన శరీరం మొత్తం పూర్తిగా అలసిసొలసి పోయిందని, అనేక గాయాలు అయి రక్తం కూడా కారిందని ఆమె తెలిపింది. ఆమె కష్టానికి కొంతమేర ఫలితం కూడా కనిపిస్తోంది. శుక్రవారం విడుదలైన రాగిణి ఎంఎంఎస్-2 మంచి టాక్ తెచ్చుకుంది. తన కష్టానికి తగిన ఫలితం రావడంతో సన్నీలియోన్ ఆనందం వ్యక్తం చేస్తోంది.
0 comments:
Post a Comment